మూడు కోట్లు ఇవ్వాల్సిందే! | Kajal Agarwal demands 3 Crore for Vishals film? | Sakshi
Sakshi News home page

మూడు కోట్లు ఇవ్వాల్సిందే!

Published Thu, Dec 4 2014 3:05 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

మూడు కోట్లు ఇవ్వాల్సిందే! - Sakshi

మూడు కోట్లు ఇవ్వాల్సిందే!

 నటి కాజల్ కాల్‌షీట్స్ అడగాలంటే దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలంట. లేకుంటే ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి గుండెలు గుభేల్ మనడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ అమ్మడి ఆశకు అంతులేకుండా పోతోందట. టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లడానికి కారణం కూడా ఇదే నంటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం కోలీవుడ్‌లో జిల్లా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత ఇక్కడ అవకాశాలు దరి చేరలేదు. అలాంటిది తాజాగా బాలాజి మోహన్ దర్శకత్వంలో ధనుష్‌తో జోడి కట్టే అవకాశం వచ్చింది. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఈ అమ్మడికి మరో అవకాశం తలుపు తట్టింది.
 
 అదే విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం. ప్రస్తుతం విశాల్ ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ తదుపరి సుశీంద్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో మొదట లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.
 
 ఇప్పుడామె స్థానంలో కాజల్ వచ్చి చేశారు. అయితే నటుడు విశాల్‌కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడంతో ఈ చిత్రాన్ని ద్విభాషల్లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ వేందన్ మూవీస్ నిర్ణయించుకుంది. దీంతో ఇది ద్విభాషా చిత్రం కాబట్టి తన పారితోషికాన్ని తమిళ వెర్షన్‌కు కోటిన్నర, తెలుగు వెర్షన్‌కు మరో కోటిన్నర మొత్తం మూడు కోట్లు ఇవ్వాలంటూ కాజల్ అగర్వాల్ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బెంబేలెత్తిన చిత్ర నిర్మాణ సంస్థ అధినేత అంత ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారట. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు సుశీంద్రన్ వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement