విశాల్‌తో డ్యూయెట్లకు సిద్ధమా? | Vishal Nayanthara Romance | Sakshi
Sakshi News home page

విశాల్‌తో డ్యూయెట్లకు సిద్ధమా?

Published Thu, Jan 12 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

విశాల్‌తో డ్యూయెట్లకు సిద్ధమా?

విశాల్‌తో డ్యూయెట్లకు సిద్ధమా?

నటుడు విశాల్‌తో మరోసారి డ్యూయెట్లు పాడడానికి సంచలన నటి నయనతార రెడీ అవుతున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్‌ నుంచి వస్తోంది. ఈ జంట ఇంతకు ముందు సత్యం అనే చిత్రంలో రొమాన్స్  చేశారు. కాగా సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ జత కట్టడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, శింబు, ధనుష్‌ అంటూ స్టార్‌ హీరోలందరితోనూ ఒక రౌండ్‌ కొట్టేసిన నటి నయనతార ఇప్పుడు టాప్‌ హీరోయిన్  స్థాయిని ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతే కాదు హీరోయిన్  ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరుపొందారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలే. అందులో అరం, దోరా, కొలైయుధీర్‌ కాలం, నేర్‌వళి వంటి హీరోయిన్  సెంట్రిక్‌ కథా చిత్రాలు చోటు చేసుకున్నాయి.

కాగా పిచ్చ డిమాండ్‌లో ఉన్న నయనతారను మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. మలయాళంలో యువ నటుడు నవీన్ పౌలీతో నటించడానికి గ్రీన్   సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో తాజగా నటుడు విశాల్‌తో మరో సారి రొమాన్స్  కు ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల బోగట్టా. ఈ క్రేజీ చిత్రానికి సాక్రటీస్‌ దర్శకత్వం వహించనున్నారట. ఈయన ఇంతకు ముందు శశికుమార్‌ హీరోగా బ్రహ్మన్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన అధికార పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా విశాల్‌ ప్రస్తుతం మిష్కన్  దర్వకత్వంలో తుప్పరివాలన్  చిత్రాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. తరువాత ఇరుంబు తిరై, సండైకోలి–2 చిత్రాల్లో నటించనున్నారు. ఆ తరువాతే నయనతారతో విశాల్‌ రొమాన్స్  చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement