Vishwak Sen Walks Out Of Arjun Sarja Movie, Team To File Complaint - Sakshi
Sakshi News home page

Vishwak Sen : మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్‌ సేన్‌.. ఫిల్మ్‌ చాంబర్‌లో కంప్లైంట్‌?

Published Sat, Nov 5 2022 12:20 PM | Last Updated on Sat, Nov 5 2022 3:00 PM

Vishwak Sen Walks Out Of Arjun Sarja Film Team To File Complaint - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్‌ అవుతున్నాడు. రీసెంట్‌గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్‌ కింగ్‌ ర్జున్‌ సర్జా దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ ఓ సినిమాకు కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.

అర్జున్‌ కూతురు ఐశ్వర్యా అర్జున్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్‌ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్‌సేన్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

అగ్రిమెంట్‌ను బ్రేక్‌ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్‌ అయిన అర్జున్‌ సర్జా విశ్వక్‌ సేన్‌ మీద ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement