Film Chamber
-
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
రెండు వారాలకే రూ. 10 కోట్లా.. వివాదంలో నాగ శౌర్య సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గతేడాది 'రంగబలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలతో శౌర్య బిజీగా ఉన్నారు. అయితే, చాలా కాలంగా మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. సినిమాల పరంగా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్ధతుగా శౌర్య నిలిచాడు. ఒక హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా ఆయన కొత్త సినిమా నిర్మాత నుంచి పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డైరక్టర్‌కు ,నిర్మాతలకు మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ కొత్త వారు కావడంతో ఈ చిక్కులు వచ్చినట్లు సమాచారం. నాగశౌర్య సినిమాకు పెట్టుబడి పెట్టేందకు ఓ ఎన్నారై ముందుకు వస్తే.. ఆయన ఈ ఫీల్డ్‌కు కొత్త వ్యక్తి కావడంతో సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. కేవలం రెండు వారాల షూటింగ్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఆ నిర్మాత ఖర్చు పెట్టాడట. దీంతో ఆయన భయపడిపోయి సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే, సినిమా ఆగింది కాబట్టి వేరే నిర్మాతను నాగశౌర్య తీసుకొచ్చారట. కానీ, ఇప్పటి వరకు తాము పెట్టిన డబ్బు తిరిగిచ్చేసి సినిమాను నిర్మించాలని వారు పట్టుపడుతున్నారని సమాచారం. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితీ ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. అధికారికంగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. -
ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!
హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చుట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తెలుగు సినీ దర్శకుల ఎన్నికలు ప్రారంభం..
-
తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు
హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయం ప్రెసిడెంట్‌గా అధికారం చేజిక్కుంచుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అగ్ర నిర్మాత దిల్‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. మొత్తం 14 రౌండ్స్‌లో 563 ఓట్లు దిల్ రాజు పానెల్‌కు, సి.కల్యాణ్ పానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్ లో భాగంగా 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) -
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికల సందడి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, శుక్రవారంతో అంటే జూలై 21తో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ క్రమంలోనే జూలై 30న ఎలక్షన్స్ జరగనున్నాయి. నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇకపోతే సి.కల్యాణ్ ఇప్పటికే టాలీవుడ్లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ వర్క్ చేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. (ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
తారకరత్న భౌతికకాయం వద్ద విషణ్ణ వదనాలతో కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం
-
కొడుకును అలా చూసి అల్లాడిపోయిన తారకరత్న తల్లిదండ్రులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం
నందమూరి తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం గత నెల 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు ఇటూ నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు చాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తారకరత్న మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. -
ధమాకా సినిమాకు ధమ్కీ.. దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. దర్శకుడు త్రినాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు. -
మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడు. రీసెంట్గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన అర్జున్ సర్జా విశ్వక్ సేన్ మీద ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. -
టాలీవుడ్లో షూటింగులు తిరిగి ప్రారంభం?
టాలీవుడ్లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగితి తెలిసిందే. -
ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
ముగిసిన ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం
-
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
సినీ కార్మికుడి నుంచి... స్టూడియో అధినేతగా..
సాక్షి,దేవరాపల్లి(అనకాపల్లి): సినీ పరిశ్రమలో కార్మికుడిగా చేరిన కళామతల్లి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగి నేడు సినిమా స్టూడియో యజమాని స్థాయికి చేరుకోగలిగారు... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కొల్లి రామకృష్ణ. 1978లో చెన్నైలో సినీ రంగ కార్మికుడిగా చేరి, వివిధ భాషల్లో తీసిన 1600 సినిమాలకు విజయ వాహిని స్టూడియో తరపున సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు. 1997లో తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడి శబ్ధాలయ స్టూడియోలో చేరి 2001 వరకు పని చేశారు. 2002లో రిథమ్ డిజిటల్ సినీ స్టూడియోను తానే సొంతంగా నిర్మించుకున్నారు. 2014 నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఉపాధ్యక్షుడిగా పని చేసి గత నెల(ఏప్రిల్) 27న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది... ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో సినీ రంగంలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, సినీ స్టూడియో యజమానులు సభ్యులుగా ఉంటారు. దాసరి నారాయణరావు, రామానాయుడు, రాజేంద్రప్రసాద్ తదితర సినీరంగ ప్రముఖులు అధ్యక్షుడిగా పని చేసిన ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని, విశేషాలను వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖనగరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సినీ రంగానికి ఏపీ ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీసేందుకు అనువైన అహ్లాదకర ప్రాంతాలు, అందమైన లొకేషన్లు అనేకం ఉన్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం కలిసి కోరతాం. ఈనెల ఆఖరి బుధవారం మా సంస్థ కార్యవర్గం సమావేశమై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాం. మా సంస్థకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో దీనికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిని త్వరలో సందర్శిస్తాం. –కొల్లి రామకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చదవండి: Photo Feature: ఆకులు లేని పూల చెట్టు -
ఫిల్మ్ ఛాంబర్లో కందికొండ భౌతిక కాయం.. మంత్రి తలసాని నివాళి
Kandikonda Yadagiri Passes Away: Minister Talasani Tribute In Film Chamber: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తలసాని. తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా గొంతు కేన్సర్, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆయస స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ కాగా కందికొండ యాదగిరికి భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ప్రముఖుల నివాళుల అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/Bg5zhexYUc — Talasani Srinivas Yadav (@YadavTalasani) March 12, 2022 చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
'టాలీవుడ్‌కు ఇవే పెద్ద దిక్కు, ప్రభుత్వాలు వీటితోనే చర్చ జరపాలి'
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్ తరఫున సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, వై. రవి, అనిల్ సుంకర, నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
చిరంజీవి, మోహన్ బాబుల కీలక సమావేశం
టాలీవుడ్లో సంచలన సమావేశానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. కొంతకాలంగా ఉప్పు, నిప్పుల్లా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు సంబందించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వివరాలివి.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ముహుర్తం ఖరారైంది. ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం ఈ కీలక సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలం తరువాత చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేధికపై కన్పించనుండటంతో ఈ సమావేశంపై ఉత్కఠ నెలకొంది. -
'గీత' మూవీ మోషన్ పోస్టర్ విడుదల
రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో నటించిన చిత్రం `గీత` (మన కృష్ణగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్). శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై రాము, మురళి, పరమేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఫిలించాంబర్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ``మోషన్ పోస్టర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేటర్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అని పేర్కొన్నారు. -
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)