సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం
- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
‘‘హైదరాబాద్‌లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. ప్రతి ఏటా రెండువందలకు పైగా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. సినిమా రంగానికి ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మేమందరం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం’’ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.
సోమవారం పలువురు చిత్రరంగ ప్రముఖులు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎన్వీ ప్రసాద్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి.కల్యాణ్, నిర్మాతల మండలి అధ్యక్షులు బూరుగపల్లి శివరామకృష్ణ, తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు విజయేంద్రరెడ్డి, మురళీమోహన్‌లతో పాటు కేయస్ రామారావు, డి. సురేశ్‌బాబు, కొడాలి వెంకటేశ్వరరావు, కాజా సూర్యనారాయణ, సురేశ్ కొండేటి, మహర్షి రాఘవ తదితరులు పాల్గొన్నారు.