సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. బాలుడు శ్రీతేజ్‌ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది.
కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు దాదాపు 20 రోజులుగా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అలాగే రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు.
చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ
Comments
Please login to add a commentAdd a comment