సాక్షి, హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)లో గాయపడ్డ శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు రాంగోల్‌పేట్ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పరామర్శించిన అల్లు అర్జున్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు.
అల్లు అర్జున్‌కు గడ్డు పరిస్థితి
తన సినిమా విజయం సాధిస్తే ఏ హీరో అయినా సంతోషపడిపోతాడు. రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే సంబరాలు చేసుకుంటాడు. కానీ అల్లు అర్జున్‌కు ఆ సంతోషం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ సంఘటన వల్ల అటు కేసులో ఇరుక్కోవడంతో పాటు మనోవేదనకు గురవాల్సి వస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనాలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు.
పుష్ప 2 రికార్డులు
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్‌లో హిట్టయింది. రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 రిలీజైంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది.
ప్రథమ స్థానం
ఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.
ఇండియన్ సినీ చరిత్రలో..
ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి, ఆర్‌ఆర్‌ఆర్ (రూ.1387 కోట్లు) నాలుగో స్థానానికి పరిమితమైంది.
చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!
Comments
Please login to add a commentAdd a comment