kims hospital
-
శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ
-
సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)లో గాయపడ్డ శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పరామర్శించిన అల్లు అర్జున్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజు సైతం ఉన్నారు. అల్లు అర్జున్‌కు గడ్డు పరిస్థితితన సినిమా విజయం సాధిస్తే ఏ హీరో అయినా సంతోషపడిపోతాడు. రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే సంబరాలు చేసుకుంటాడు. కానీ అల్లు అర్జున్‌కు ఆ సంతోషం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ సంఘటన వల్ల అటు కేసులో ఇరుక్కోవడంతో పాటు మనోవేదనకు గురవాల్సి వస్తోంది.ఇంతకీ ఏం జరిగిందంటే?డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనాలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా ఒకరోజు జైల్లో కూడా ఉన్నాడు.పుష్ప 2 రికార్డులుసుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో హిట్టయింది. రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 రిలీజైంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. ప్రథమ స్థానంఈ సారి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. నెల రోజుల్లోనే పుష్ప: ది రూల్ 1831 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.ఇండియన్ సినీ చరిత్రలో..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి, ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు) నాలుగో స్థానానికి పరిమితమైంది.చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ! -
శ్రీ తేజ కుటుంబానికి రూ.2 కోట..
-
కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
-
కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన డీకే అరుణ
-
శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు. ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాటహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్‌కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు.పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి(చదవండి: పెద్దపేగు కేన్సర్ నివారణకు...) -
వాల్స్.. వండర్స్.. ప్రతి గోడా ఓ కళాఖండంలా..
ఖైరతాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.. అయితే మనలో చాలా మంది అనారోగ్యంపాలైనప్పడు ఆస్పత్రులకు వెళ్లక తప్పదు..వెళ్లాలి కదా..! ఇప్పుడేమంటారు? అంటారా.. అదేనండి.. ఆస్పత్రులు అనగానే చాలా మంది బెదిరిపోతారు.. ఎందుకంటే ఓ వైపు మందుల వాసన, మరోవైపు ఫినాయిల్కంపు, ఎక్కడ చూసినా గోడలకు రోగాలకు సంబంధించిన పోస్టర్లు, చూట్టూ రోగులు.. అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటారు. అలాంటి వారు కూడా ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే మాత్రం ఎంచక్కా మ్యూజియంకో, ఎగ్జిబిషన్‌కో వెళ్తున్నట్లు రెడీ అయిపోతారు.. అదే నగరంలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. క్యారికేచర్స్గా డాక్టర్స్ ఫొటోలు.. ఆయా డిపార్ట్మెంట్ల ముందు డాక్టర్ల ఫొటోలను పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల్లాగా కాకుండా లైటర్వేయిన్తో క్యారికేచర్స్గా ప్రత్యేకంగా రూపొందించి ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలను చూసి హాస్పిటల్‌కు వచ్చిన వారు ఎంజాయ్ చేయడంతో పాటు ఉత్సాహంగా ఫోన్లో ఫొటోలు భద్రపరుచుకుంటున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న మనిషికి ఆధునిక వైద్య విధానాలు ఎన్ని వచి్చనప్పటికీ ఆప్యాయంగా... ప్రేమగా పలకరించే వైద్యులు, వారి బాధలు చెప్పుకునేంత సమయం.. ఓర్పు, సహనం కలిగిన వైద్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే హాస్పిటల్‌కు వెళ్లామనే ïఫీలింగ్ పేషెంట్లకు కలిగించేందుకు కొత్త కొత్త ఏర్పాట్లు చేస్తున్నాయి పలు హాస్పటల్స్. ఈ తరహా ప్రయత్నమే చేస్తోంది నగరంలోని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్. రొటీన్ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని కలి్పంచేలా ఓ మ్యూజియంకు వెళ్లామనే అనుభూతి, పేషెంట్‌ను పేషెంట్‌గా కాకుండా ఒక గెస్ట్‌గా ఆహా్వనించే పద్దతి, ఎక్కడ ఏ సమస్య వచి్చనా వెంటనే హాజరై సలహాలు, సూచనలు చేసే సిబ్బంది ఉంటే ఆ రోగికి సగం జబ్బు నయమైపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు. సంస్కృతిని ప్రతిబింబించేలా..హాస్పిటల్లోకి వెళ్లగానే బాబోయ్ హాస్పిటల్‌కు వచ్చామనే ఫీలింగ్ లేకుండా ఉండేవిధంగా లోపలికి అడుగు పెట్టగానే తెలుగు సాంప్రదాయ పద్దతిలో చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలికే సిబ్బంది మొదలుకొని డాక్టర్ల వరకూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఓపి పరిసరాల్లో ఉండే గోడలపై భారతీయతను ప్రతిబింబించేలా తెలుగు పండగలు, అలనాటి క్రీడలు, అన్ని మతాలనూ ప్రబోధిస్తూ ఫొటోలు, తెలుగు రాష్ట్రాల చీరలు, రామాయణం, మహాభారతం, మనదేశ సంప్రదాయ నృత్యాలు, తల్లిప్రేమను ప్రతిబింబించే ఫొటోలు, మెడిసిన్ హిస్టరీని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు, మన శరీరం ఆకృతిని నిర్దేశిస్తూ శరీరంలో ఉండే అస్థిపంజరం నమూనాలు, పెయింటింగ్స్ పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చే వారు ప్రతి ఫ్లోర్లో మనస్సు నింపుకొని వెళ్లే విధంగా ఉండటం కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ప్రత్యేకత.సిబ్బంది పద్దతి నచ్చింది..మేము ఉండేది కొండాపూర్, మా చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా గంటన్నర ప్రయాణం చేసి బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు వస్తాం. ఇక్కడి వాతావరణం, నర్సులు, ఇతర సిబ్బంది పద్దతి మాకు బాగా నచ్చింది. బాధ్యతతో వ్యవహరించే డాక్టర్లు, హాస్పిటల్లో ప్రతి ఫ్లోర్లో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం మాలో బరోసాను పెంపొందిస్తుంది. – జే.సుమిత్ర, కొండాపూర్, గృహిణిసేవా ధృక్పథంతో...మేమంతా సేవా ధృక్పథంతో పనిచేస్తున్నాం. మా అందరి గురువు డాక్టర్ గురవారెడ్డి. ఆయన అడుగు జాడల్లో రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి బాధలు చెప్పుకునేంత సమయం ఇస్తూ, వారి ఆనందంలో భాగస్వాములవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి సిబ్బంది ఒక కుటుంబంలా పనిచేయడం ఎంతో సంతోషం. – డాక్టర్ నివేదిత సాయిచంద్ర, న్యూరో ఫిజీషియన్కంఫర్ట్ ఇవ్వగలగాలి..రొటీన్ పద్దతికి స్వస్తిచెప్పి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించేలా మ్యూజియం, హార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. రానున్న సంవత్సరంలో పేషెంట్‌ను గెస్ట్‌లా భావిస్తున్నాం. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉండటం వల్ల సగం జబ్బు నయమవుతుంది. గోడలను రకరకాల పెయింటింగ్స్, డిజైన్స్, ఫొటోలతో ఏర్పాటు చేశాం. అన్ని బాధలూ మేము తగ్గించకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని, కంఫర్ట్‌ని ఇవ్వగలగాలి. ఇంగ్లిష్‌లో ఓక సామెత ఉంది ‘యు మే నాట్ క్యూర్ ఆల్ ది టైం.. బట్ యు కెన్ కంఫర్ట్ ఆల్ ది టైం’ అనేది నేను బలంగా నమ్ముతాను. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. -
ఏట్రియల్ ఫిబ్రిలేషన్! సైలెంట్‌గా దాడి చేసే డేంజరస్ వ్యాధి!
కొన్ని వ్యాధులు అంత తేలిగ్గా బయటపడవు. ఎటువంటి సంకేతాలు ఇవ్వవు. కానీ ఇతరత్ర వ్యాధులకు దారితీసేంత వరకు దాని వల్లే మనకు ఆ వ్యాధి వచ్చిందనేది కూడా తెలియదు. దీంతో పరిస్థితి విషమించిన సందర్భాలు కోకొల్లలుగా జరగుతున్నాయి. అలాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(గుండెదడ). ఇదే స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకంగా మారుస్తోంది. అసలు ఏంటీ ఏట్రియల్ ఫిబిలేషన్(ఏఎఫ్)? ఎలా సైలెంట్‌గా దాడి చేసేంత డేంజరస్ వ్యాధి తదితరాల గురించే ఈ కథనం!. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(ఏఎఫ్)గుండెదడ)) బాధపడుతున్న రోగులలో దాదాపు 1/3వ వంతు రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం చాలామంది రోగుల్లో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఏట్రియా అంటే గుండె గదులు. వీటిలో గుండె లయలు సక్రమంగా లేకపోతే గుండెలోని దిగువ గదులకు రక్తప్రవాహం సవ్యంగా జరగదు. దీంతో స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తంచారు వైద్యులు. నిజానికి భారతదేశంలో పలు ఆస్పత్రుల అధ్యయనాల ప్రకారం..దాదాపు 10 నుంచి 25% స్ట్రోకు రోగులకు అంతర్లీనంగా ఉన్న ఈ ఏట్రియల్ ఫిబ్రలేషన్ కారణమని చెబుతున్నారు. సుమారు మూడింట ఒక వంతు మందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి రావడం, జీవన నాణ్యత దారుణంగా పడిపోయింది, ప్రాణాంతక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఎఫ్ని గనుక ముందుగా గుర్తించగలిగితే (ఓరల్ యాంటీ కోగ్యులెంట్ థెరపీ) నోటి ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ఔషధాలతో స్ట్రోక్‌లు వంటివి రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు. ఎవరికీ వచ్చే ఛాన్స్ ఎక్కువంటే.. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, స్లీప్ అప్నీయా లేదా హైపర్ థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఈ ఏఎఫ్ బారినపడే అవకాశం ఎక్కువుగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు మాట్లాడుతూ..చాలా సందర్భాలలో ఈ ఏఎఫ్ లక్షణ రహితంగా ఉంటుంది. ఈసీజీ, రొటీన్ చెకప్‌లు లేదా సంబంధిత స్ట్రోక్ కారణంగా యాదృచికంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ ఏఎప్లో ముందుగా స్ట్రోక్ రాకుండా చూడటం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాధి బారినపడిన రోగులు రక్తాన్ని పలుచగా చేసే మందులు లేదా గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడటం అత్యంత కీలకం. సరైన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సక్రమమైన జీవనశైలిని పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలను అనుసరిస్తే స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా నివారించగలుగుతామని హైగ్రీవ్ రావు చెప్పారు. ఏఎఫ్ వచ్చిన రోగుల లక్షణాలు.. అలసట, హృదయ స్పందన సరిగాలేకపోవటం దడ, గుండెలు అదరటం మైకము, మూర్ఛ శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి తిమ్మిరి, నీరసం, గందరగోళం దృష్టి సమస్యలు నడకసమస్యలు మైకము, వివరించలేని తలనొప్పి వంటివి కనిపిస్తే స్ట్రోక్‌కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉదని అర్థం. చికిత్స దీనికి మూడు ప్రధాన రకాల ఔషదాలు ఉన్నాయి, గుండె స్పందన రేటు నియంత్రణ మందులు (హృదయ స్పందన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి), రిథమ్ నియంత్రణమందులు (సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి పని చేస్తాయి), చివరిగా రక్తంపలచబడటానికి ( రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించేవి) మందులు ఉంటాయి . కొంతమంది రోగులకు ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ లేదా పల్మనరీ వీన్ అబ్లేషన్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం. వీటితో పాటుగా , ధూమపానానికి దూరంగా ఉండటం, గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్నే తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యం. వీటన్నింటిని పాటిస్తే ఈ ఏఎఫ్ సమస్య నుంచి సత్వరమే బయటపడొచ్చని అంటున్నారు కిమ్స్ వైద్యులు హైగ్రీవ్ రావు. --కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు..) -
ఆ రోజు నాకు మాటలు రాలేదు ..
-
రాంప్ వాక్ అదరగొట్టిన లూపస్ పేషెంట్స్
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
ఆస్పత్రి బాత్రూమ్ డోర్‌లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్‌తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
భద్రాచలం కిమ్స్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే, సకా లంలో అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్కానింగ్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడగా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో నిర్వా హకులు అగ్నిమాపక సిబ్బందికి సమా చారం ఇవ్వగా వారు చేరుకుని ఆక్సిజన్ మాస్క్‌లతో లోపలికి వెళ్లి ఐసీయూలో ఉన్న ముగ్గురు, చికిత్స పొందుతున్న మరో పది మందిని బయటకు తీసు కొ చ్చారు. ఐసీయూలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. మంటలు రాకపోవడంతో ముప్పు తప్పింది. -
పేద కుటుంబంలో వెలుగు నింపారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పుట్టుకతోనే బైలియరీ అట్రేజియా (పిత్తవాహిక మూసుకుపోవడం)తో బాధపడుతున్న 9 నెలల చిన్నారికి అత్యం త ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. సోమవారం కిమ్స్ కాలేయ విభాగపు అధిపతి డాక్టర్ రవిచంద్ సిద్దాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన శంకర్, శోభారాణి దంపతులకు పుట్టిన పాపకు నెల రోజులకే కామెర్లు వచ్చాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో పాపకు శస్త్ర చికిత్స చేసినా కామెర్లు తగ్గలేదు. పైగా కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో 2 నెలల క్రితం తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి బైలియరీ అట్రేజియాతో బాధపడుతోందని గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. బిడ్డకు కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చినా శస్త్ర చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి దంపతులిద్దరికీ దిక్కుతోచకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఉచితంగా సర్జరీ చేసింది. కోలుకున్నాక చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. -
ఎంసీపీఐయూ నేత తాండ్ర కుమార్ మృతి
మియాపూర్: ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్రకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో నాలుగు రోజుల నుండి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తాండ్రకుమార్ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుండి బాగ్‌లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్‌కు తరలించారు. అక్కడి నుంచి మియాపూర్‌లోని ఎంఏనగర్‌లో ఉన్న ఎంసీపీఐయూ కార్యాలయంలో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం మియాపూర్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్‌కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
ఒకే వ్యక్తికి రెండు కేన్సర్లు.. రోబోటిక్ సర్జరీతో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఓ కేన్సర్ వచ్చి పూర్తిగా తగ్గకుండానే మరో కేన్సర్ వచ్చిన వ్యక్తికి రోబోటిక్ సర్జరీ ద్వారా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఉపశమనం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ సర్జరీ పూర్వాపరాలు తెలిపారు. ‘ఫార్మారంగంలో పనిచేసే 36 ఏళ్ల నగరవాసి ఎక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా (ఏపీఎంఎల్).. అనే రక్తకేన్సర్‌కు కీమోథెరపీ తీసుకుంటూనే పాంక్రియాటిక్ కేన్సర్‌కి కూడా గురవడంతో రెండో కేన్సర్ చికిత్స కోసం తమ ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు. సమస్య తీవ్రత దృష్ట్యా అతడికి రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయించి, కేవలం మూడున్నర గంటల కన్సోల్ టైంలోనే సర్జరీ పూర్తి చేశామన్నారు. సర్జరీ తర్వాత ఒక్క రోజు మాత్రమే ఐసియూలో ఉంచి, ఐదోరోజున డిశ్చార్జి చేశామన్నారు. మన దేశంలో అత్యంత వేగవంతంగా జరిగిన రోబోటిక్ సర్జరీల్లో ఇదొకటని, రోగి చాలా త్వరగా, చాలా బాగా కోలుకున్నాడన్నారు. ఈ రోబోటిక్ సర్జరీలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ మాధవితో పాటు సిస్టర్ స్వప్న పాల్గొన్నారని తెలిపారు. -
కామినేని ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 15 నిమిషాల్లో గుండెను తరలించిన అధికారులు
-
చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ
సాక్షి, నందిగామ(కృష్ణా): అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డుకు చెందిన ముంగి కోటయ్య 10 నెలల బాబు సంతోష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తొలుత విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. రూ.10 లక్షల ఖరీదైన శస్త్ర చికిత్స ఈనెల 8న కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగింది. చిన్నారి సంతోష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో వారి ఇంటి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే తమ బిడ్డ తిరిగి వచ్చాడని, ముఖ్యమంత్రికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి కోటయ్య పేర్కొన్నాడు. -
సీఎం జగన్ సహాయంతో ‘ఊపిరితిత్తుల మార్పిడి’ సక్సెస్
కారంచేడు: ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావుకు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. విధుల్లో ఉన్న ఆయనకు ఏప్రిల్ 24న కోవిడ్ సోకింది. దీంతో ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ల్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. భాస్కరరావు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మార్చాలని, అందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను వివరించింది. ఈ విషయాన్ని వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయడంతో సీఎం స్పందించి డబ్బుకు వెనుకాడొద్దని, భాస్కరరావు చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చినట్టుగానే డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక ప్రభుత్వ వైద్యుడికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆయన ప్రాణాలను కాపాడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి.. సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
28 వారాలకే జన్మించిన శిశువు.. అరుదైన చికిత్స
సాక్షి, గచ్చిబౌలి: నెలలు నిండక ముందే జన్మించిన (28 వారాలు) ఆడ శిశువు గుండెకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. చందానగర్‌కు చెందిన అనిత, రాకేష్ సింగ్ దంపతులకు గత ఏప్రిల్ 21న ఆడపిల్ల జన్మించింది. సాధారణంగా నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువు (1100 గ్రాముల బరువు) బతికే అవకాశాలు తక్కువ. పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ సమస్య ఉండటంతో రెండు ప్రధాన రక్త నాళాల మధ్య ఖాళీ ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు చికిత్స అందించినట్లు ఆస్పత్రి చీఫ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు. దీంతో పాప ఊపిరి తిత్తులు విచ్చుకోవడానికి మందులు ఇచ్చేందుకు వీలు పడిందన్నారు. 28వ రోజున చిన్నారికి యూ ఏ పీడీఏ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. దీంతో పాప బరు వు 1500 గ్రాములకు చేరుకోవడంతో జూన్ 11 డిశ్చార్జీ చేసినట్లు డాక్ట ర్ సుదీప్ వర్మ తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ గౌతమి, డాక్టర్ సుదీప్, అనస్తటిస్ట్ డాక్టర్ నాగరాజన్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కొరడా ఝుళిపించిన కలెక్టర్.. డీపీఆర్‌ఓపై చర్యలు -
అతి పిన్న వయసులో కరోనాను జయించిన శిశువు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మాతృత్వాన్ని ప్రసాదించడంతో పాటు, నెలలు నిండకముందే పుట్టి కరోనా బారిన పడిన ఆ బిడ్డకు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ డాక్టర్లు ఊపిరి పోసి తల్లి ఒడికి చేర్చారు. దీంతో హైదరాబాద్ నగరంలోనే అతి పిన్న వయస్సులో కరోనాను గెలిచిన పాపగా ఆ నవజాత శిశువు రికార్డు సాధించినట్లయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోనా సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా ఏప్రిల్ 17న నెలలు నిండని 1,000 గ్రాముల బరువుతో కూడిన నవజాత శిశువుకు ఆమె జన్మనిచ్చింది. మొదట నెగెటివ్.. తర్వాత పాజిటివ్ పుట్టిన శిశువుకు కోవిడ్ టెస్ట్ చేయగా తొలుత నెగెటివ్ వచ్చింది. వారం తర్వాత క్రమంగా శిశువు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ అవసరం ఏర్పడింది. దీంతో మరోసారి కరోనా టెస్ట్ చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో శిశువు బరువు 1,000 గ్రాముల నుంచి 920 గ్రాములకు తగ్గిపోయింది. ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి.అపర్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడానికి కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూకు తరలించారు. ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తూ ఆధునిక పద్ధతులలో చికిత్స చేశారు. శిశువు క్రమంగా కోలుకోవడంతో మరోసారి డాక్టర్లు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కోవిడ్ నెగటివ్ రావడంతో శిశువును ఐసీయూ నుంచి చక్కని వెలుతురు, సరైన ఊష్ణోగ్రత కూడిన ప్రత్యేకమైన గదిలోకి మార్చి చికిత్స చేశారు. ఆస్పత్రిలో దాదాపు 30 రోజులు అన్ని రకాల మెరుగైన చికిత్సలతో శిశువు 1,500 గ్రాముల బరువుకు చేరుకోవడంతో పాటు, ఆరోగ్యంగా తయారు కావడంతో డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ అపర్ణ వివరించారు. చివరకు తల్లి కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. -
Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్.. దిశా పటాని ఫిదా!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు డ్యాన్స్ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్, దిశా పటాని నటించిన "రాధే" చిత్రంలోని సీటీ మార్ పాటకు వైద్యులు డ్యాన్స్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ భామ దిషా పటాని ఫ్యాన్స్ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. 35,515 మంది నెటిజన్లు వీక్షించారు. డాక్లర్లు చేసిన డ్యాన్స్‌ని మెచ్చుకుంటూ నెటిజన్లు తమ ప్రేమను పంచుకుంటున్నారు. దీనిపై దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది. "మా ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులకు ధన్యవాదాలు" అని ఓ నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "మీరు నిజమైన హీరోలు. మీ డ్యాన్స్ చాలా బాగుంది." అంటూ మరో నెటిజన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Team Disha (@teamdishap) (చదవండి: వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!) -
పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స
కర్నూలు(హాస్పిటల్): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్ చింతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్ హాస్పిటల్‌కు వచ్చాడు. యాంజియోగ్రామ్ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది. ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు.