
పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవలను ఇంటి వద్దనే అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి.. హోమ్ హెల్త్‌కేర్ సేవలందించే పోర్షియాతో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో సికింద్రాబాద్, కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయిన పేషెంట్లకు ఇతర వైద్య సేవలను పోర్షియా ద్వారా అందిస్తామని, టెక్నాలజీ ఆధారిత సమగ్ర వైద్య సేవలను ఇంటి వద్దనే పొందొచ్చని కిమ్స్ తెలియజేసింది.