కిమ్స్ ఆస్పత్రిలో అక్కినేనికి వైద్య పరీక్ష
హైదరాబాద్: దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, సినీనటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు చికిత్స కోసం గురువారం కిమ్స్‌కు వచ్చారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రికి వచ్చినట్లు సీఈవో భాస్కర్‌రావు చెప్పారు. చిన్నపేగు చివరి భాగంలో కేన్సర్ సోకడంతోఇటీవల ఆయనకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఓపీ విభాగంలోని ప్రత్యేక గదిలో వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసి, ఆ తర్వాత ఇంటికి పంపినట్లు తెలిపారు. అయితే ఆయన చాలా నీరసంగా ఉన్నట్లు తెలిసింది.