'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం' | dasari narayana rao likely to recover in two or three days, says kims doctors | Sakshi
Sakshi News home page

'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'

Published Tue, Jan 31 2017 5:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'

'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని కిమ్స్‌ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. దాసరికి చెస్ట్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని ఆయన వివరించారు. ఇప్పుడైతే ఆయన చాలా బాగున్నారని, రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకేమీ చెప్పలేనని డాక్టర్ భాస్కరరావు అన్నారు.  
 
తన గురువుగారైన దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావల్సిన మనిషని నటుడు మోహన్ బాబు అన్నారు. డాక్టర్లు అన్నీ చెబుతున్నారని.. వీళ్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయన తెలిపారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. దాసరి నారాయణరావు అన్నయ్య, దాసరి కుమారుడు రఘు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement