దాసరిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత‍్స పొందుతున‍్న దర‍్శకరత‍్న దాసరి నారాయణరావును వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులతో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన ఆయన దాసరిని పరామర్శించి ఆరోగ‍్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ‍్యంపై వైద‍్యులతో మాట్లాడారు. దాసరి త‍్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.