దాసరికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jagan vistis kims hospital over dasari narayanarao health condition | Sakshi
Sakshi News home page

దాసరికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Wed, Feb 1 2017 12:30 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

దాసరికి వైఎస్‌ జగన్‌ పరామర్శ - Sakshi

దాసరికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్‌ జగన్‌ బుధవారం కలిశారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

(చదవండి : దర్శకుడు దాసరికి అస్వస్థత )

దాసరి కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దాసరిని పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్‌ నేత బొత్స  సత్యనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement