దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా! | chiranjeevi, ambati visit dasari narayanarao at hospital | Sakshi
Sakshi News home page

దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా!

Published Fri, Feb 3 2017 1:17 PM | Last Updated on Fri, May 25 2018 7:29 PM

దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా! - Sakshi

దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా!

హైదరాబాద్‌: తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావును పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుక్రవారం పరామర్శించారు. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్‌, దర్శకుడు వివి వినాయక్‌, సినీనటి జయప్రద తదితరులు దాసరి నారాయణరావును ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా దాసరి నారాయణను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, ఆయన్ని చూశాక ధైర్యం వచ్చిందని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని  లేదని చిరంజీవి మీడియాతో పేర్కొన్నరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement