దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్ | pawan kalyan visits kims over dasari narayanarao health | Sakshi
Sakshi News home page

దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్

Published Wed, Feb 1 2017 9:24 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్ - Sakshi

దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్

హైదరాబాద్‌: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న దాసరిని కలిసిన పవన్ అనంతరం డాక్టర్లతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాసరి నారాయణరావు త్వరలో కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా దర్శకరత్న దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌ను తొలగించేందుకు స్టెంట్‌ వేయడంతో పాటు.. వెంటిలెటర్‌పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. ఆయనకు డయాలసిస్‌ కూడా చేస్తున్నారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement