ఆచూకీ | Not knowing the concern of the physician information | Sakshi
Sakshi News home page

ఆచూకీ

Published Thu, Aug 27 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

ఆచూకీ

ఆచూకీ

వైద్యుడి సమాచారం తెలియక ఆందోళన
టెక్నాలజీసాయంతో తెలుసుకున్న కుమారుడు

 
రసూల్‌పుర, సాక్షి, సిటీబ్యూరో: కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు రాఘవేంద్రరావు బోయిన్‌పల్లి సమీపంలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి బయలుదేరిన ఆయన ఆచూకీ సాయంత్రం 6.30 గంటల వరకూ తెలియలేదు. కుటుంబసభ్యులు ఫోన్ చేసినా...అటు నుంచి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో వారు అమెరికాలో ఉన్న రాఘవేంద్రరావు కుమారుడు సుదీప్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన బీఎండబ్ల్యూ కారులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో తండ్రి ఆచూకీ కనుగొన్నారు.

ఎలాగంటే...
బీఎండబ్ల్యూ కారుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సౌకర్యం ఉంటుంది. దీనికోసం ఆ కంపెనీ ఏకంగా విర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) ప్రత్యేక పోర్టల్ నిర్వహిస్తోంది. కారు కొనుగోలు చేసినప్పుడే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. వీపీఎన్ యాక్సెస్ కావాలి. అధిక సెక్యూర్ కలిగిన ఐక్లోడ్ నెట్‌వర్క్ ద్వారా కారు ఎక్కడెక్కడ? ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? ఏఏ ప్రాంతాల మీదుగా వెళ్లింది? చివరిసారిగా ఎక్కడ ఆగిపోయిందనే వివరాలను తెలుసుకునే సౌకర్యముందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కుమారుడు సుదీప్‌కి రాఘవేంద్రరావు ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ గతంలోనే ఇచ్చి ఉండాలి. లేదంటే తన తండ్రి కారు కనబడటం లేదని... యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వాలని బీఎండబ్ల్యూ కంపెనీ ప్రతినిధులను కోరి   ఉండాలి. అమెరికాలో ఉన్న కుమారుడు సుదీప్ ఈ టెక్నాలజీ ద్వారానే తండ్రి వాహనం ఆచూకీని కనుగొన్నారు.
 
ఇంటి నుంచి బయలుదేరిన అరగంటకే..
రోజూ ఉదయం 9 గంటలకు పేట్ బషీరాబాద్ నుంచి డాక్టర్ రాఘవేంద్రరావు సికింద్రాబాద్ కిమ్స్‌కు బయలుదేరేవారు. మంగళవారం ఉదయుం 10.45కు ఇంటి వుుందుకు వచ్చారు. అక్కడే దాదాపు గంటపాటు సెల్‌ఫోన్‌లో వూట్లాడారు. వివిధ ఆస్పత్రుల వైద్యులతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఉదయం 11 గంటల వరకు డాక్టర్ రాకపోవడంతో ఆపరేషన్ ఉందని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఆయనకు ఫోన్ చేశారు. సహచర వైద్యులతో ఆ ఆపరేషన్ చెయ్యించండి అని రాఘవేంద్రరావు వారికి సూచించారు.11.40 గంటలకు బయలుదేరిన డాక్టర్ రాఘవేంద్రరావు పేట్‌బషీరాబాద్, సుచిత్ర, బోయిన్‌పల్లికి వచ్చారు. పాత బోయిన్‌పల్లి మార్గంలో ఉన్న హర్షవర్ధన్ కాలనీ రోడ్డు పక్కనే కారు ఆగిపోయింది. సాయుంత్రం 6.30 గంటల వరకూ డాక్టర్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యూరు. పలువూర్లు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అమెరికాలో ఉంటున్న రాఘవేంద్రరావు

కుమారుడు సుదీప్‌కు సవూచారం ఇచ్చారు. ఆయన బీఎండబ్ల్యూకు సంబంధించిన నెట్‌వర్క్ ద్వారా కారు బోయినపల్లి హర్షవర్థన్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయూన్ని తల్లికి ఫోన్‌లో చెప్పారు. ఆ తర్వాత కారును గుర్తించారు.
 
ఇదీ అనుమానం...
 డాక్టర్ రాఘవేంద్రరావు కారు ఆగి ఉన్న ప్రాంతం  చుట్టూ జనావాసాలు ఉన్నాయి. మంగళవారం వుధ్యాహ్నం కారు ఆగితే... బుధవారం ఉదయుం 7.30 గంటల వరకు గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. వాహనం రోడ్డు పక్కనే ఆగి ఉండడం.. అద్దాలు తెల్లగా ఉండడం... స్టీరింగ్‌పై ఓ వ్యక్తి పడుకున్నట్లు ఉండడం.. ఆయన నోరు, వుుక్కు నుంచి రక్తం కారడం వంటి విషయూలను ఎవరూ గవునించలేదా అన్న విషయుమై అనువూనాలు వ్యక్త వువుతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement