
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ మేరకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉ త్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆస్పత్రుల అధినేత భాస్కర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం...
‘సర్కారు జీవో ప్రకారమే కరోనా చికిత్సకు ఫీజులు వసూలు చేయాలని, ఆ ప్రకారమే చెల్లిస్తామని బీమా కంపెనీలు ఒత్తి డి చేస్తున్నాయి. అందరికీ అలా చేయాలంటే కుదరదని ప్ర భుత్వానికి విన్నవించాం. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల ప్ర కారం అందరికీ కరోనా వైద్యం కుదరదు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకు ఆ ఫీజులకు చికిత్స అందించాలంటేనే ఒప్పుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలలో విడుదల చేసిన జీవోల్లో కూడా కేవలం నగదు చెల్లించే రోగులకే ఆయా రాష్ట్రాలు ఫిక్స్ చేసిన ఫీజులను వసూలు చేయాలని జీవోల్లో ఉంది. ప్రైవేటు బీమా, సీజీహెచ్‌ఎస్ వంటి రోగులకు సర్కారు ఉత్తర్వులు వర్తించవు. అది కూడా సాధారణ వార్డుల్లో ఉన్న వారికే ఇది వర్తి స్తుంది. అందరికీ ఆ ఫీజు లతో వైద్యం చేయడం సాధ్యం కాదని చెప్పామని తెలిపారు.
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి...
నగదు చెల్లించే వారికి మాత్రమే ఆ ఫీజులు వర్తిస్తాయని ప్ర భుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భాస్కర్‌రావు చెప్పారు. అందరికీ అవే ఫీజులతో చికిత్స చేస్తే ఆసుపత్రులు నిలదొక్కుకోలేవన్నారు. 50 శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా చికిత్సకు బెడ్‌ల కేటాయింపును యాప్ ద్వారా చేస్తారని, ఐఏఎస్‌లతో కమిటీ వేస్తారంటూ వచ్చిన ప్రచారమూ తమ కు తెలియదన్నారు. పడకలు లేవంటూ చెప్పడం, ఎవరో ఒ కరు రావడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్‌ను పెట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరామన్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఉత్తర్వుల జారీకి ముందు జనరల్ వార్డుల్లో ఉన్న వారికే నిర్దేశించిన ఫీజులన్న విషయాన్ని అంగీకరించిందన్నారు. బీమా కంపెనీలకు ఈ ప్యాకేజీ వర్తిం చదని జీవోలో మార్పులు చేయాలని కోరామన్నారు. ఇప్పటికే వివిధ జబ్బులకు వర్తించేలా బీమా కంపెనీలు ప్రజల నుంచి పాలసీలు తీసుకున్నాయని, వాటి ప్రకారం ఫీజులు వసూలు చేస్తాం తప్ప ఈ ప్యాకేజీ ప్రకారం కరోనా రోగుల కు ఫీజులను వర్తింప చేయలేమన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వ ప్యాకేజీ కిందకు రారని స్పష్టం చేశారు. వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment