Hospital bill
-
బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..
సైదాబాద్(హైదరాబాద్): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. 13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. -
Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..!
డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది వేస్తాడేమోననే భయంతో ముందే ఏడుపులంకించుకునే వాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. అదే సర్జరీ ఐతే నిలువెళ్లా వణికిపోతాం. భయంతో కన్నీళ్లు రానివారు ఉండరేమో! ఐతే డాక్టర్లు ధైర్యం చెప్పి చికిత్స చేయడం పరిపాటి. ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఒక హాస్పిటల్ మాత్రం ఆపరేషన్ టైంలో పేషెంట్ ఏడ్చినందుకు ఏకంగా బిల్లు వేశారండి! బిల్లు చూసి నోరెళ్లబెట్టిన సదరు పేషెంట్ తన అనుభవాన్ని ట్విటర్లో పంచుకుంది. ఇక నెటిజన్లు అమెరికా హెల్త్ కేర్ సిస్టంను కామెంట్లరూపంలో ఏకి పారేస్తున్నారు. అసలేంజరిగిందంటే.. మిడ్జ్ అనే మహిళ మోల్ తొలగించేందుకు ప్రైమరీ సర్జరీ ఒకటి చేయించుకుంది. తర్వాత హాస్పిటల్ బిల్లులో అన్ని చార్జీలతోపాటు బ్రీఫ్ ఎమోషన్ పేరుతో అదనంగా రూ.800 (11 డాలర్లు) బిల్లేశారు. అమితాశ్చర్యాలకు గురైన సదరు మహిళ అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన పెంచేందుకు బిల్లును ట్విటర్లో షేర్ చేసింది. ఇది అమెరికన్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఏవిధంగా ఉందనేది వివరిస్తుందని ఒకరు, ఈ సమయమంతా నేను ఉచితంగానే ఏడ్చానని అనుకున్నాను" అని మరొక యూజర్ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! Mole removal: $223 Crying: extra pic.twitter.com/4FpC3w0cXu — Midge (@mxmclain) September 28, 2021 -
ఆస్పత్రి బిల్లు రూ.3.40 కోట్లు.. ఆదుకున్న అధికారులు
దుబాయ్: అనారోగ్యం కారణంగా దుబాయ్ ఆస్పత్రిలో చేరిన గల్ఫ్ కార్మికుడికి అండగా నిలిచింది గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి అనే కార్మికుడు గతేడాది డిసెంబర్ 25న అనారోగ్యం కారణంగా దుబాయ్‌లోని మెడిక్లినిక్ హాస్పిటల్లో చేరాడు. అప్పటికే పక్షవాతం రావడంతో బ్రెయిన్ ఆపరేషన్ మొదలుపెట్టగా పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. గత ఆరు నెలల తర్వాత గంగారెడ్డి కోమా నుంచి బయటకు వచ్చాడు,. అనంతరం మరో మూడు నెలల పాటు చికిత్స కొనసాగింది. అయితే ఈ 9 నెలలకు సంబంధించి చికిత్స బిల్లు రూ. 3.40 కోట్లు అయ్యింది. స్పందించిన అధికారులు తల తాకట్టు పెట్టినా చెల్లించలేనంతగా ఆస్పత్రి బిల్లు రావడంతో గంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని సంప్రదించారు. సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహా పేషెంటుకు ధైర్యం చెప్పడంతో పాటు దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీనికి స్పందించిన భారతీయ అధికారులు బిల్లు మాఫీ చేయించడంతో పాటు గంగారెడ్డి ఇండియా చేరుకునేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్సుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కి చేరుకున్న గంగారెడ్డిని నేరుగా స్వగ్రామానికి పంపకుండా ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచారు. చదవండి: యూఏఈకి వెళ్లే వారికి ఊరట -
KTR Office: మేము చూసుకుంటాం.. సాయం చేస్తాం
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): న్యుమోనియాతో బాధ పడుతున్న 45 రోజుల పసిపాప కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరీంనగర్‌కు చెందిన ఆ చిన్నారి తండ్రి అసీఫ్ రోజువారీ ఆటోడ్రైవర్. ఆటోను కిరాయికి తీసుకొని నడుపుతున్న అతను తన బిడ్డ ఆసుపత్రి బిల్లు చెల్లించే పరిస్థితిలో లేడు. ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిన కరీంనగర్‌కు చెందిన సామాజిక సేవకురాలు మునిపల్లి ఫణిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురికి పాప ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను గురువారం పోస్ట్ చేసి, ఆదుకోవాలని కోరారు. ఆమె ట్వీట్‌కు గంటలోపే మంత్రి కార్యాలయం స్పందించింది. ‘మేము చూసుకుంటాం.. వీలైనంత త్వరగా సహాయం చేస్తాం’ అని రీట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం అసీఫ్కు మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాప వైద్య చికిత్స వివరాలు అడిగారని, ఆసుపత్రి బిల్ ఎంత అవుతుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారు.. తదితర వివరాలు అడిగారని, వీలైనంత త్వరగా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారని అసీఫ్ తెలిపాడు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. ఠాగూర్ సినిమా సీన్‌ను తలపించారు
సాక్షి, చెన్నై: ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్‌ను తలపించారు తెరుప్పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు. విషమంగా ఉన్న రోగి కోలుకుంటున్నాడని చెప్పి రూ.19 లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి నిర్వాకంపై కుటుంబ సభ్యులు తిరుప్పూర్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి తీసుకోవాల్సిన ఫీజులపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే అనేక ఆస్పత్రులు దోపిడే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌లోని ఓ ఆస్పత్రి లీలపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వివరాలు...తిరుప్పూర్‌కు చెందిన సుబ్రమణ్యం (62) మే 3న కరోనా బారినపడ్డారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. మే 23న ఆస్పత్రి సిబ్బంది సుబ్రమణ్యం తనయుడు కార్తికేయన్‌తో మాట్లాడి బిల్లు చెల్లించాలని కోరారు. బిల్లు కట్టించుకుని.. సుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్టు పేర్కొనడంతో రూ. 19 లక్షలను కార్తికేయన్ చెల్లించాడు. అయితే, ఆ మరుసటి రోజు రాత్రే సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించినట్టు, పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు హడావుడి సృష్టించాయి. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాయి. ఆగమేఘాలపై మరో ఆస్పత్రికి తరలించగా సుబ్రమణ్యం మరణించాడు. అయితే తొలుత చికిత్స పొందిన ఆస్పత్రిపై అనుమానం కలగడంతో మంగళవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. కంప్యూటరైజ్డ్ బిల్లు కాకుండా చేతితో రాసిన బిల్లులు ఇచ్చి ఉండటం గమనార్హం. జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్ వైరల్: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు! -
డైరెక్టర్ మృతి, హాస్పిటల్ బిల్ కట్టిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇటివల లాక్డౌన్లో ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఓ హస్య నటుడికి ఆర్థిక సాయింతో పాటు వైద్య చికిత్సకు డబ్బు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కష్టకాలంలో తనని ఆదరించిన దర్శకుడు ఎస్పీ జననాథన్ హాస్పిటల్ బిల్లు కట్టి కృతజ్ఞత తిర్చుకున్నాడు. కాగా మార్చి 14న తమిళ దర్శకుడు ఎస్పీ జగనాథన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. జననాథన్, విజయ్‌తో ‘లాభం’ అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆయన చివరి చిత్రం. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ విడుదల కాకముందే ఆయన ఆకస్మికంగా మరణించడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. కెరీర్ ప్రారంభంలో తనను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దర్శకుడి మరణం విజయ్ సేతుపతిని బాగా కలచివేసింది. జననాథన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న విజయ్ ఇప్పుడు హాస్పిటల్ ఛార్జీలు మొత్తం కట్టి ఆయన రుణం తీర్చుకున్నాడట. దర్శకుడు జననాథన్ కుటుంబ సభ్యులను విజయ్ ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదట. అంతేకాదు ఆయన అనారోగ్యం వార్త తెలియగానే అందరికంటే ముందు విజయ్ స్పందించి హాస్పిటల్‌కి వెళ్లి పలకరించాడట. ఆయన చనిపోయాడని తెలిసిన అనంతరం అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు జననాథన్ కుటుంబంతో పాటే ఉండి కన్నీటీ పర్యంతరం ఆయ్యారట. ఆయన స్టార్ హీరో అన్న విషయం పక్కన పెట్టి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయాడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది తెలిసి ఆయన అభిమానులు తమ అభిమాన హీరోని చూసి మురిసిపోతున్నారు. చదవండి: నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్ సేతుపతి ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
ఆక్సిజన్‌పై అబద్ధాలు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి నాలుగు రోజుల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో వెళ్లాడు. అతని ఆక్సిజన్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు అతని చేతి నుంచి రక్తం తీసుకున్నారు. పరీక్షించి చూడగా అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 65 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఆసుపత్రిలో చేరాలని అతన్ని భయపెట్టారు. దీంతో రూ. లక్షలు చెల్లించి ఆసుపత్రిలో చేరాడు. పల్స్ ఆక్సీమీటర్లో అతని ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ ఎందుకిలా జరిగింది? అసలెక్కడ లోపముంది? సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఊపిరితిత్తులకు సక్రమంగా ఆక్సిజన్ అందుతోందా లేదా అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమైన అంశం. కాబట్టి ఎవరికి వారు పల్స్ ఆక్సీమీటర్లను కొనుక్కొని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకుంటున్నారు. అలా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను బట్టే రోగి పరిస్థితి తీవ్రంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సాధారణంగా 95 కంటే తక్కువగా ఉంటే అలర్ట్ కావాలి. 90లోపు వస్తే డాక్టర్ వద్దకు వెళ్లాలి. 85 నుంచి తక్కువవుతూ 65% వరకు చేరుతుందంటే రోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పరిగణించి ఆక్సిజన్ పెడతారు. 65% వరకు వచ్చిందంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లెక్క. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు 65% వరకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినా ఎలా సాధారణంగా ఉండగలిగాడు? ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేకుండానే కేవలం రిపోర్ట్ ఆధారంగానే అతన్ని బెడ్‌పై పడుకోబెట్టారు. అసలేం జరుగుతోందంటే... తప్పుడు పరీక్షలు... తప్పుడు రిపోర్టులు సాధారణ రక్త పరీక్షల కోసం మోచేయి భాగం నుంచి రక్త నమూనాలు తీస్తారు. వాటి ద్వారా పూర్తి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. కానీ రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షించాలంటే మణికట్టు వద్ద ఉండే నాడి నుంచి రక్త నమూనాలను తీయాలి. మోచేయి భాగం నుంచి తీసిన రక్త నమూనాలతో ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షిస్తే అత్యంత తక్కువగా 65–70 మధ్య మాత్రమే వస్తాయి. నాడి వద్ద నుంచి తీసే రక్త నమూనాల ద్వారానే ఆక్సిజన్ స్థాయులు సరిగ్గా తెలుస్తాయి. కానీ చాలా ఆసుపత్రులు బాధితులను భయపెట్టి తమ బెడ్లను నింపుకొని రూ. లక్షలు గుంజేందుకు మోచేయి పైభాగం నుంచి తీసిన రక్త నమూనాల ద్వారానే ఆక్సిజన్ లెవల్స్‌ను గుర్తిస్తున్నట్లు బాధితుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్లాస్మా థెరపీ అంటూ మరో మోసం... కరోనా చికిత్స పేరుతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తున్నాయి. రోగులు అప్పులపాలై రోడ్డున పడేలా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు రోగులకు ప్లాస్మా అవసరమని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని, దాతలు దొరకడం లేదని చెప్పి ఆ పేరుతో రూ. లక్షలు గుంజుతున్నాయి. కొన్నిసార్లు వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స చేస్తున్నట్లు అనేక ఆసుపత్రులపై ఆరోపణలున్నాయి. వాస్తవానికి వెంటిలేటర్‌పై ఉన్న వారికి ప్లాస్మా థెరపి చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ రోగులు, వారి కుటుంబ సభ్యుల భయాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అలాగే సాధారణ ధరలకు రెమిడిసివిర్ ఇంజెక్షన్లు తెప్పించి వాటిని రోగులకు అత్యవసరం పేరిట బ్లాక్‌లో కొన్నట్లు చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలున్న మరికొన్ని మందులను కూడా ఇలాగే వాడుతూ ఎక్కువ బిల్లులు వేస్తున్నాయి. ఇక కొందరు రోగులకు నెగెటివ్ వచ్చినా వారికి రిపోర్టులు వెంటనే ఇవ్వకుండా చికిత్స పేరిట అనేక ఆసుపత్రులు మోసం చేస్తున్నాయి. -
ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం...
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ మేరకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉ త్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆస్పత్రుల అధినేత భాస్కర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం... ‘సర్కారు జీవో ప్రకారమే కరోనా చికిత్సకు ఫీజులు వసూలు చేయాలని, ఆ ప్రకారమే చెల్లిస్తామని బీమా కంపెనీలు ఒత్తి డి చేస్తున్నాయి. అందరికీ అలా చేయాలంటే కుదరదని ప్ర భుత్వానికి విన్నవించాం. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల ప్ర కారం అందరికీ కరోనా వైద్యం కుదరదు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకు ఆ ఫీజులకు చికిత్స అందించాలంటేనే ఒప్పుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలలో విడుదల చేసిన జీవోల్లో కూడా కేవలం నగదు చెల్లించే రోగులకే ఆయా రాష్ట్రాలు ఫిక్స్ చేసిన ఫీజులను వసూలు చేయాలని జీవోల్లో ఉంది. ప్రైవేటు బీమా, సీజీహెచ్ఎస్ వంటి రోగులకు సర్కారు ఉత్తర్వులు వర్తించవు. అది కూడా సాధారణ వార్డుల్లో ఉన్న వారికే ఇది వర్తి స్తుంది. అందరికీ ఆ ఫీజు లతో వైద్యం చేయడం సాధ్యం కాదని చెప్పామని తెలిపారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... నగదు చెల్లించే వారికి మాత్రమే ఆ ఫీజులు వర్తిస్తాయని ప్ర భుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భాస్కర్‌రావు చెప్పారు. అందరికీ అవే ఫీజులతో చికిత్స చేస్తే ఆసుపత్రులు నిలదొక్కుకోలేవన్నారు. 50 శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా చికిత్సకు బెడ్ల కేటాయింపును యాప్ ద్వారా చేస్తారని, ఐఏఎస్‌లతో కమిటీ వేస్తారంటూ వచ్చిన ప్రచారమూ తమ కు తెలియదన్నారు. పడకలు లేవంటూ చెప్పడం, ఎవరో ఒ కరు రావడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్‌ను పెట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరామన్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఉత్తర్వుల జారీకి ముందు జనరల్ వార్డుల్లో ఉన్న వారికే నిర్దేశించిన ఫీజులన్న విషయాన్ని అంగీకరించిందన్నారు. బీమా కంపెనీలకు ఈ ప్యాకేజీ వర్తిం చదని జీవోలో మార్పులు చేయాలని కోరామన్నారు. ఇప్పటికే వివిధ జబ్బులకు వర్తించేలా బీమా కంపెనీలు ప్రజల నుంచి పాలసీలు తీసుకున్నాయని, వాటి ప్రకారం ఫీజులు వసూలు చేస్తాం తప్ప ఈ ప్యాకేజీ ప్రకారం కరోనా రోగుల కు ఫీజులను వర్తింప చేయలేమన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వ ప్యాకేజీ కిందకు రారని స్పష్టం చేశారు. వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనన్నారు. -
ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులపై ప్రైవేటు ఆస్ప త్రులు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. అసలు మందే లేని కరోనాకు చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. చెల్లించలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్న బాధితులను ఆస్పత్రుల్లో నిర్బంధిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను పక్కనపెట్టి ఇష్టానుసారం బిల్లులు వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి కరోనా బాధితునికి పీపీఈ కిట్ల చార్జీలను రూ.45 వేలకు పైగా వేసిన విషయం మర్చిపోక ముందే చాదర్‌ఘాట్‌లోని మరో కార్పొరేట్ బిల్లు కోసం ఏకంగా ప్రభుత్వ వైద్యురాలినే నిర్బంధించింది. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) అసలేమైందంటే..: మలక్‌పేటకు చెందిన డాక్టర్ హర్ష సుల్తానా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్. వారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐదు రోజల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మరోసారి చేయించుకోగా కరోనా నిర్ధారణైంది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు కుమారులకూ పాజిటివ్ వచ్చింది. దీంతో వారంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. జూలై 1న అర్ధరాత్రి శ్వాస సంబంధ సమస్య తలెత్తడంలో ఇంట్లో ఉండటం శ్రేయస్కరం కాదని భావించిన సుల్తానా.. సమీపంలోని చాదర్‌ఘాట్ తుంబే ఆస్పత్రిలో చేరారు. అడ్మిషన్‌కు ముందే రూ.40 వేలు చెల్లించారు. ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే రూ.1.50 లక్షల బిల్లు చేతికొచ్చింది. ఒక్కరోజుకే ఇంత బిల్లు ఎలా వేస్తారని ఆమె ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. బిల్లు చెల్లించేందుకు నిరాకరిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా, సిబ్బంది అడ్డుకుని నిర్బంధించారు. (చచ్చినా వదలట్లేదు) దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి బయటికి వదిలారు. ఓ ప్రభుత్వ వైద్యురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీసిన ఈ వీడియోను ఆమె బంధువులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది. సదరు వీడియో వైరల్ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సదరు కార్యాలయం నుంచి ఫోన్ చేయడంతో సుల్తానాను తుంబే ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేసింది. విచ్చలవిడిగా బిల్లులు వేస్తూ పేషంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తుంబే హాస్పిటల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుల్తానా కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. (ఒక్క రోజే 1,590 కేసులు) దురుసుగా ప్రవర్తించారు కరోనాతో బాధపడుతున్న డాక్టర్ సుల్తానాకు వైద్యపరంగా అన్ని సేవలూ అందించాం. అధిక బిల్లు వేశామనే ఆరోపణల్లో నిజం లేదు. ఆమె ఐదు రోజుల క్రితం చేరారు. సిబ్బందితో ఆమె దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్‌నర్సులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె వద్దకు వెళ్లేందుకు సిబ్బంది భయపడేవారు. ఆమెకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నాం. పూర్తిగా కోలుకోవడంతోనే డిశ్చార్జి చేశాం. – తుంబే ఆస్పత్రి యాజమాన్యం ముందే చెబితే నిమ్స్‌లో చేర్చేవాళ్లం డాక్టర్ సుల్తానాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ఆమె చెప్పే వరకు తెలియదు. క్వారంటైన్‌కు వెళ్తానని చెప్పడంతో అనుమతిచ్చాం. ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం లేదు. ముందే చెబితే ఫీవర్‌లో లేదా నిమ్స్‌లో చేర్చి వైద్యం చేయించేవాళ్లం. ఫీవర్ ఆస్పత్రి వైద్యురాలిగా ఆమె ఆరోగ్యాన్ని కాపాడటం మా బాధ్యత. విషయం తెలిసిన వెంటనే ఆర్ఎంఓ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కరోనాను జయించాడు.. కానీ!
సియాటిల్: అమెరికాలోని సియాటిల్‌కు చెందిన మైఖేల్ ఫ్లార్ పేరు మీద ఇప్పుడు చాలా రికార్డులున్నాయి. ఒకటి, ఆయన 70 ఏళ్ల వయస్సులో కరోనాను జయించారు. రెండు, చాలా ఎక్కువ కాలం కోవిడ్–19తో పోరాడి, మృత్యువుపై విజయం సాధించారు. మూడు, కరోనా చరిత్రలోనే అత్యధిక మొత్తం బిల్‌ను ఆసుపత్రి నుంచి పొందారు. ఫ్లార్కు చికిత్స అందించిన ఇసాఖ్లోని స్వీడిష్ మెడికల్ సెంటర్, ఆయన చికిత్సకుగానూ 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.35 కోట్లు. మరో రికార్డు కూడా ఉంది. ఆయన చికిత్స, అందుకైన ఖర్చు వివరాలను మొత్తం 181 పేజీల్లో పొందుపరిచి, ఒక పుస్తకంలా ఆయనకు అందించారు. ఫ్లార్ దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లి వచ్చాడు. ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు భార్య, పిల్లలకు చెప్పేశారు. నైట్ డ్యూటీ నర్స్ చివరి కాల్ అని చెప్పి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించింది. కానీ, కరోనాకు అంత ఈజీగా లొంగిపోదలచుకోలేదు ఫ్లార్. కరోనాతో 62 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు. ఆయనను వైద్యులు, ఇతర పేషెంట్లు అంతా ‘మిరాకిల్ చైల్డ్’ అనడం ప్రారంభించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత.. 181 పేజీల పుస్తకాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పంపించారు. ఆ పుస్తకంలో చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వివరాలు కూడా ఉన్నాయి. ఆ భారీ బిల్లు చూసి ఫ్లార్ అవాక్కయ్యారు. బిల్లు చూసి హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందన్నారు. ‘బిల్లు భారీగా ఉంటుందనుకున్నాను కానీ.. ఇంత భారీగా ఉంటుందనుకోలేద’న్నారు. ఐసీయూలో ఫ్లార్ ఉన్న గది అద్దె రోజుకు 9,736 డాలర్లు. ఆ ఐసోలేషన్ చాంబర్లో ఆయన 42 రోజులున్నారు. అలాగే, 29 రోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆ బిల్లు రోజుకు 2,835 డాలర్లు. మెడిసిన్స్ ఖర్చు మొత్తం బిల్లులో దాదాపు నాలుగో వంతు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్న సమయంలో రెండు రోజుల పాటు అందించిన చికిత్స ఖర్చు లక్ష డాలర్లు. ఇలా అన్ని కలిసి మొత్తం బిల్లు 11 లక్షల డాలర్లయింది. అదృష్టవశాత్తూ, ఫ్లార్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో, బిల్లులో ఎక్కువ భాగం చెల్లించాల్సిన పనిలేదు. అలాగే, అది కోవిడ్–19 కనుక మొత్తం బిల్లు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. బిల్లును చూడగానే ఎలా ఫీల్ అయ్యారన్న ప్రశ్నకు.. ‘బతికినందుకు సిగ్గుగా అనిపించింది’అని జవాబిచ్చారు ఫ్లార్. -
కరోనా చికిత్సకు రూ. 8.5 కోట్ల బిల్లు
వాషింగ్టన్ : వృద్ధులకు కరోనా సోకితే కోలుకోవడం కష్టమని చెబుతున్నా అమెరికాలో 70 ఏళ్ల వృద్ధుడు మరణం అంచులదాకా వెళ్లి మహమ్మారిని జయించారు. సియాటెల్‌కు చెందిన మేఖేల్ ఫ్లోర్ మార్చి 4న కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఓ దశలో పరిస్ధితి విషమించడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో అక్కడి నర్సులు మాట్లాడించారు. ఆపై చికిత్సకు స్పందించిన ఫ్లోర్ 60 రోజుల అనంతరం మే 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని ఓడించి బయటపడిన ఫ్లోర్ ఆస్పత్రి సిబ్బంది తీసుకువచ్చిన 181 పేజీల బిల్లును చూసి షాక్ తిన్నారు. కరోనా చికిత్స కోసం మొత్తం 1.1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8.5 కోట్ల రూపాయలకుపైగా బిల్లును ఆ వృద్ధుడి ముందుంచారు. అయితే వయోవృద్ధులకు ప్రభుత్వం కల్పించే మెడికేర్ బీమా ఉండటంతో ఫ్లోర్ జేబులో నుంచి ఒక్క పైసా చెల్లించకుండా బయటపడ్డారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలైన మొత్తం తన చికిత్సకు వెచ్చించాల్సి రావడం బాధాకరమని ఫ్లోర్ ఆందోళన చెందినట్టు సియాటెల్ టైమ్స్ పేర్కొంది. బిల్లు భారీగా వచ్చినా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆ వృద్ధుడు మృత్యుంజయుడై తిరిగి రావడం మాత్రం ఊరట కలిగించే పరిణామమే. చదవండి : భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు -
ఈ చిట్టితల్లికి ఎంత కష్టం..
చిత్తూరు, పలమనేరు: లక్ష్మి ఎనిమిదేళ్ల చిన్నారి..పలమనేరు లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. తోటి పిల్లలతో చలాకీగా కనిపించే లక్ష్మికి అనుకోని జబ్బు వచ్చి పడింది. బిడ్డకు కాలేయం పాడైందని తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుంగిపోయారు. బిడ్డను బతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు పేదరికం శాపంలా మారింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన శివప్రసాద్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పది రోజుల క్రితం కుమార్తె లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లివర్ సంబంధిత వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఈనెల 12న బెంగళూరులోని వైదేహీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు కొంత సాయం చేశారు. సోషల్ మీడియా సాయంతో మరికొంత వచ్చింది. ఆపరేషన్‌కు రూ.15లక్షల దాకా అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లి దండ్రులు మంత్రి అమరనాథరెడ్డికి విన్నవిం చారు. అంతమొత్తంలో సాయం చేయలేమని ఆయన చెప్పడంతో మరింత నిరాశకు గురయ్యారు. దాతలు ఎవరైనా ఉంటే 94940 66812, 9642951204లను సంప్రదించాలని కోరుతున్నారు. -
అమ్మకోసం.. బిచ్చగాడిగా మారిన బాలుడు.!
ప్రాణం పోసే వైద్యులను కనిపించే దేవుళ్లని చెబుతారు. అలా వృత్తికి అంకితమై గొప్ప పేరుతెచ్చుకున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వైద్యాన్ని కార్పొరేట్ కల్చర్ ఆవహించిన తర్వాత చాలామంది డబ్బు సంపాందించేందుకే డాక్టర్లవుతున్నారు. డబ్బు కట్టకపోతే మధ్యలో చికిత్సను కూడా ఆపేస్తున్నారు. ఇలాంటి వైద్యుల నిర్వాకమే.. ఓ పదేళ్ల బాలుణ్ని అడుక్కునే దయనీయ స్థితికి తీసుకొచ్చింది. వివరాల్లోకెళ్తే... సాక్షి, స్కూల్ ఎడిషన్: కళ్లు తెరవని పసికందు కూడా అమ్మకోసం పరితపిస్తుంది. అమ్మ ఒడికి దూరమైతే అల్లాడిపోతుంది. అది అమ్మతనం గొప్పదనం. అలాంటి ఓ తల్లిని బతికించుకునేందుకు పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు వీధుల్లో తిరుగుతూ బిచ్చమడుక్కున్నాడు. ఈ దౌర్భాగ్యస్థితికి కారణం వైద్యులేనన్న విషయం తర్వాత వెలుగుచూసింది. ‘డబ్బు తీసుకొచ్చే వరకు మీ అమ్మకు ట్రీట్మెంట్ చేయబోమ’ని డాక్టర్లు చెప్పడంతో చేసేదిలేక చేతులు చాచాడు. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. బిల్లు చూసి... ఆరోగ్యం బాగాలేకపోవడంతో పదేళ్ల కొడుకు కుందన్‌ను వెంటబెట్టుకొని బిహార్‌లోని మాధేపురా జిల్లాలో ప్రైవేటు నర్సింగ్‌హోం వెళ్లింది ఓ తల్లి. రకరకాల పరీక్షలు చేసి, చిన్నపాటి ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. ఐదువేలో.. పదివేలో అవుతుందనుకొని సరేనన్నారు. తీరా ఆపరేషన్ అయ్యాక రూ.70వేల బిల్లు చేతిలో పెట్టారు. దానిని చూసిన తల్లీకొడుకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమవద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో.. ఇంకా ట్రీట్మెంట్ మిగిలే ఉందని, మధ్యలో ఆపేస్తామని, ఏం చేసైనా డబ్బులు తెమ్మని చెప్పారు. బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జ్ చేసేది లేదని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత వేసిన కుట్లను ఊడదీయకుండా అలాగే ఉంచేశారు. వైద్యమూ నిలిపివేశారు. సొంతూరికెళ్లి.. యాజమాన్యం వేసిన భారీ బిల్లును చెల్లించలేక...సాయం చేసే వారెవరూ కానరాక... ఆమె పదేళ్ల కుమారుడు కుందన్ చివరకు మధేపురాజిల్లాలోని తన సొంతూరికి వెళ్లాడు. ‘అమ్మ ఆసుపత్రి బిల్లు చెల్లించాలి.. సాయం చేయండ’ంటూ వీధివిధి తిరిగాడు. చివరకు విషయం మాధేపురా ఎంపీకి తెలియడంతో... హుటాహుటిన ఆయన నర్సింగ్‌హోంకు వెళ్లి, తల్లిని డిశ్చార్జ్ చేయించాడు. -
జయ లలిత వైద్య ఖర్చు ఎంతో తెలుసా ?
-
ఊరును బట్టే బీమా ప్రీమియం!
వేణుది విశాఖపట్నం. రెండు వారాల పాటు పని ఉండటంతో ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీలో ఉండగా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేయించుకుని, ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. ఆ తరవాత రీయింబర్స్ నిమిత్తం ఆసుపత్రికి చెల్లించిన రూ.50 వేల బిల్లును బీమా కంపెనీకి సమర్పించాడు. వేణుకి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంది. 100 శాతం రీయింబర్స్ వచ్చే అవకాశమూ ఉంది. కానీ కంపెనీ మాత్రం వేణుకి రూ.40 వేలే చెల్లించింది. ఎందుకో తెలుసా? * జోన్ ఆధారంగా కంపెనీల హెల్త్ పాలసీలు * ట్రీట్మెంట్లో జోన్ మారితే మాత్రం ఇబ్బందే * తీసుకున్న జోన్ ఆధారంగానే కంపెనీల చెల్లింపు ఎందుకంటే వేణు బీమా తీసుకున్న కంపెనీ భౌగోళిక జోన్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తోంది. వేణు బీమా తీసుకున్నది జోన్-2 సిటీలో. ప్రీమియం కూడా అక్కడి ధరల ఆధారంగానే చెల్లించాడు. కానీ చికిత్స చేయించుకున్నది జోన్-1 కిందికి వచ్చే నగరంలో. ఎందుకంటే జోన్-1 నగరంలో బీమా తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. అందుకే రీయింబర్స్‌లో ఆ తేడా. మరో రకంగా చూసినా... ఒకవేళ వేణు బీమా తీసుకున్న విశాఖలోనే ఆ చికిత్స కూడా చేయించుకున్నట్లయితే ఢిల్లీ కన్నా రేట్లు తగ్గి ఉండేవి కదా? అదీ కంపెనీ లాజిక్. తాము వేణు బీమా తీసుకున్న విశాఖపట్నంలోని వైద్య ఖర్చుల ఆధారంగానే బీమా ప్రీమియం నిర్ణయించామన్నది కంపెనీ వాదన. క్లెయిమ్‌లు కూడా తక్కువే... కంపెనీల డేటా చూస్తే... టైర్-1 నగరాల్లో ఉండేవారి బీమా క్లెయిములు కూడా ఎక్కువే. వారితో పోలిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో ఆరోగ్య బీమా క్లెయిములు చాలా తక్కువ. ‘‘టైర్ -1 నగరాల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాన్నే మిగతా నగరాల వారికీ వర్తింపజేసి వారిపై భారం మోపటం ఇష్టంలేక కంపెనీలు జోన్ ఆధారిత ప్రీమియాలను వసూలు చేస్తున్నాయి’’ అని పాలసీఎక్స్ డాట్‌కామ్ వ్యవస్థాపక సీఈఓ నావల్ గోయెల్ చెప్పారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ హెల్త్ ఇన్సూరెన్స్, సిగ్నా టీటీకే ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటివి ఈ జోన్ ఆధారిత పాలసీలు అందిస్తున్నాయి. ఇవి నగరాల్ని, పట్టణాల్ని జోన్-1, జోన్-2, జోన్-3గా విభజించాయి. జోన్-3లో పాలసీ తీసుకునేవారు జోన్-2లో తీసుకున్న వారి కన్నా 10 శాతం తక్కువకే పాలసీ పొందొచ్చు. అలాగే జోన్-1లో ఉన్నవారు జోన్-2లో వారికన్నా 10 శాతం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. ‘‘జోన్ ఆధారిత ధరలనేవి ఇష్టప్రకారం ఎంచుకునేవి కాదు. కంపెనీయే పాలసీ తీసుకున్న ప్రాంతాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తుంది. కానీ వారు ఏ నగరంలోనైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే పాలసీలో మాత్రం ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అందరికీ ఒకేలా పూర్తిస్థాయి సేవలందుతాయి’’ అని గోయెల్ వివరించారు. ప్రీమియం ఒక్కటే ప్రాంతాన్ని బట్టి ఉంటుందన్నారు. పాలసీదారు కనక చిరునామా మారితే అది కంపెనీకి తెలియజేయాలని, ఒకవేళ జోన్ మారితే దాని ఆధారంగా ప్రీమియం ఛార్జీలను కంపెనీ సవరిస్తుందని మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సోమేష్ చంద్ర తెలియజేశారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి జోన్-1 నగరంలో మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ పాలసీ తీసుకుంటే రూ.3 లక్షల కవరేజీకి ఏడాదికి రూ.7,044 చెల్లించాల్సి ఉంటుంది. అదే విశాఖ వంటి టైర్-2 సిటీలోనైతే రూ.6,340 చెల్లిస్తే చాలు. అయితే జోన్-3లోనో, 2లోనో పాలసీ తీసుకుని... జోన్-1లో ట్రీట్మెంట్ తీసుకున్నవారికి ఈ పాలసీలతో ఇబ్బందేనని గోయెల్ చెప్పారు. అందుకే తాము ఏ జోన్లో చికిత్స తీసుకునే అవకాశం ఉందో... ఆ జోన్నే పేర్కొంటూ పాలసీ తీసుకోవటం ఉత్తమమని చెప్పారాయన. చాలా కంపెనీలు జోన్-3 నుంచి జోన్-2కు, అలాగే జోన్-1కు మారటానికి అంగీకరించవని, అలాంటపుడు ప్రీమియంలో తేడా మొత్తాన్ని చెల్లిస్తే అంగీకరిస్తాయని తెలియజేశారు. కాకపోతే ఈ జోన్ల విషయంలో కంపెనీలన్నీ ఒకేరకంగా లేవు. కొన్ని నగరాల్ని కొన్ని కంపెనీలు జోన్-2గా పేర్కొంటే... మరికొన్ని కంపెనీలు జోన్-1గా పేర్కొంటాయి. ఈ తేడాల్ని ముందే చూసుకోవాలనేది గోయెల్ సూచన. -
పేగు బంధాన్ని అమ్ముకున్నారు
కందుకూరు, న్యూస్‌లైన్: పేదరికం ఆ దంపతుల కన్నపేగును దూరం చేసుకునేలా చేసింది. హాస్పిటల్ బిల్లులు చెల్లించలేని స్థితిలో తమకు కలిగిన కవలలను అమ్మకానికి పెట్టారు. ఆడపిల్లలన్న కారణమో..లేక సాకలేమన్న భయమో పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని అమ్మేశారు. నెల రోజుల క్రితం లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శిశు సంక్షేమ శాఖాధికారులు ఆ పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పెదపవని గ్రామానికి చెందిన వ్యక్తికి, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సంకువారిపాలెం గ్రామానికి చెందిన యువతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటికే వారికి ఒక బాబు, పాప ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం గతనెల 18న కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. మూడో కాన్పులో ఆడ పిల్లలైన ఇద్దరు కవలలు జన్మించారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ యజమాని వారిని పోషించలేమని భావించి విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసవమైన 8 రోజులకు వేటపాలేనికి చెందిన ఓ వ్యక్తికి ఒక పాపను ఇచ్చేయగా.. 9వ రోజు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తికి రెండో పాపను ఇచ్చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కు అయిన ఖర్చు రూ 25 వేలను వారు చెల్లించినట్లు సమాచారం. ఆ దంపతుల కుటుంబ ఖర్చుల కోసం మరికొంత నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా శిశు సంక్షేమ శాఖాధికారులకు తెలియడంతో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసులు పెదపవని వెళ్లి దంపతులను విచారించడంతో పిల్లల్ని ఎవరికి ఇచ్చిందీ చెప్పారు. అధికారులు పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కవల పిల్లల్ని ఒంగోలులోని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి సంరక్షిస్తున్నారు. మంగళవారం పిల్లలిద్దరికీ ఒంగోలులోని హాస్పటల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం శిశువులిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన శిశు సంక్షేమశాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కవలలను తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు పిల్లలు లేని వారేనని, తమ సమ్మతితోనే వారు తీసుకెళ్లినట్లుగా చెప్పినట్లు సమాచారం. అయినా చట్టప్రకారం ఇది నేరం కావడంతో కేసులు నమోదు చేశారు. శిశువుల విక్రయంలో పలువురు దళారుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. -
బయట తినాలంటే..భయం
సాక్షి, సిటీబ్యూరో :‘గ్రేటర్’లో కల్తీ నిత్యకృత్యమై పోయింది. పసిపిల్లల పాల నుంచి మొదలు పెడితే.. ప్రాణాధారమైన నీటి నుంచి తినే తిండి దాకా అన్నింటా కల్తీయే. ఈ విషాహారం తింటే జరిగే అనర్థం వేల రూపాయల ఆస్పత్రి బిల్లు నుంచి ప్రాణాలు పోయేంతదాకా! అయినప్పటికీ ప్రజలకు ప్రాణాం తకంగా పరిణమించిన ఈ ఆహార కల్తీపై జీహెచ్ఎంసీ చోద్యం చూస్తోంది. కేవలం వంద రూపాయల జరిమానా విధించి, ఓ హెచ్చరిక ముఖాన పారేసి చేతులు దులుపుకొంటోంది. దీంతో కర్రీపాయింట్ల నుంచి స్టార్‌హోటళ్ల వరకూ యథేచ్ఛగా కల్తీలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది లేమి.. ఇతరత్రా లోపాలు.. లొసుగులు.. ఆమ్యామ్యాలు.. కారణాలేవైతేనేం కల్తీ రక్కసి సిటీజనుల జీవితాలను కకావికలం చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, ఇతరత్రా ఆహార కేంద్రాల్లోని వంటకాలు తింటూ నిత్యం వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. సాక్షాత్తూ జీహెచ్ఎంసీయే పాలల్లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించింది. అయినా ఇటు ఆహార కల్తీని అరికట్టలేక, అటు పాల కల్తీని నిరోధించలేక చేష్టలుడిగి చూస్తోంది. గత నాలుగు సంవత్సరాల్లో జీహెచ్ంఎసీ అధికారులు ఆహార కల్తీకి సంబంధించి నమోదు చేసిన కేసుల సంఖ్య 223. దీన్ని చూస్తే చాలు వారి పనితీరు ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లనే ప్రస్తుతం 70 లక్షల జనాభాకు వినియోగిస్తూ ప్రజలేమైపోతే తన కేంటన్నట్లు వ్యవహరిస్తోంది. నిర్మాణ లోపాలతో భవనాలు కూలినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని క్షమించే ప్రసక్తే లేదని డాంబికాలు పలుకుతున్న అధికారులు.. విషాహారంతో ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్న వారిని మాత్రం ఏమీ చేయకపోవడం విశేషం. లోకాయుక్త ఆదేశాల మేరకు వివిధ సంస్థల పాల ఉత్పత్తులను పరీక్షలు చేయించగా లోపాలు వెల్లడవడం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొనైనా ఆహార కల్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టిందా అంటే అదీలేదు. వివిధ రకాల పన్నులు, ఫీజుల వసూళ్లపై జీహెచ్ఎంసీ చూపుతున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై చూపకపోవడంపై పలు స్వచ్ఛంద సంస్థలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తనిఖీల్లేవు.. చర్యల్లేవు.. ఆహార కల్తీ జరగకుండా, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందాలంటే క్రమం తప్పని తనిఖీలు.. కల్తీలకు పాల్పడినవారిపై తక్షణ కఠిన చర్యలు అవసరం. కానీ.. గ్రేటర్‌లోని ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత దృష్ట్యా అది సాధ్యం కావడం లేదు. ఇతర ప్రాంతాల్లోని హోటళ్ల సంగతటుంచి సాక్షాత్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్లోనే పరిశుభ్రత లోపించింది. ఈ క్యాంటీన్లో ప్రజలు తినడానికి పనికిరాని ఆహారం వడ్డిస్తున్నట్లు గుర్తించిన ఆరోగ్యం, పారిశుధ్యం విభాగం అధికారులు ఇటీవల దాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారులెందరో కొలువై ఉన్న చోటే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తేలిగ్గానే అంచనా వేసుకోవచ్చు. సిబ్బంది లేమితో ఇబ్బంది జీహెచ్ఎంసీ పరిధి, జనాభా కనుగుణంగా 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 30 వేల హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి సంస్థల తనిఖీల బాధ్యత వీరిదే. నలుగురే అన్నింటినీ తనిఖీ చేయడం సాధ్యం కావడం లేదు. చేస్తున్న తనిఖీలు సైతం మొక్కుబడిగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రికార్డుల్లో చూపేందుకన్నట్లుగా కొన్ని కేసులు మాత్రం నమోదు చేసి, తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు లేకపోవడంతో హోటళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చిరు హోటళ్ల నుంచి స్టార్ హోటళ్లదాకా, ఇరానీ టీకొట్ల నుంచి బిర్యానీ సెంటర్ల దాకా ఇదే పరిస్థితి. గ్రేటర్‌కు 26 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఐదుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులైతే మంజూరైనప్పటికీ ఇప్పటికీ భర్తీ కాలేదు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల కనుగుణంగా సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణతోనే సర్కిల్కొకరు చొప్పున 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల్ని త్వరలో భర్తీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. నిబంధనలివీ.. ఆహార కల్తీ వల్ల చనిపోతే, బాధిత కుటుంబానికి హోటల్ యజమాని రూ.5 లక్షలు చెల్లించాలి. హోటల్‌ను సీజ్ చేయడంతో పాటు యజమానికి ఆర్నెల్ల జైలుశిక్ష వేయాలి. లెసైన్సు లేకుండా ఆహారపదార్థాల ఉత్పత్తి, సరఫరా చేస్తే రూ.25 వేల జరిమానా. కానీ.. ‘గ్రేటర్’లో సామాన్య శిక్షలే అమలవడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల బాధ్యతలివీ.. ఆహారం విక్రయించే మాల్స్, దుకాణాలు, హోటళ్లలో తరచూ తనిఖీలు. కల్తీ ఆహారం సరఫరా చేస్తే సీజ్ చేయడం.. లెసైన్సు రద్దు చేయడం. అనుమానిత పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలి. కలుషిత, నిల్వ ఉంచిన ఆహారం ధ్వంసం చేయాలి. {పజల నుంచి అందే ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి. తనిఖీలు, ల్యాబ్‌ల నివేదికలతో రికార్డు నిర్వహణ. నలుగురే ఉండటంతో ఇవేవీ సక్రమంగా జరగడం లేదు. జరిమానాల తీరిదీ... సంవత్సరం జరిమానాలు సంవత్సరం జరిమానాలు 2010 రూ. 4500 2011 రూ. 5400 2012 రూ.13500 2013 ....... బిజీలైఫ్‌తో ముప్పు బిజీ లైఫ్‌తో నగరంలో చాలామంది హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వేళకు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం, వండుకునే తీరిక లేకపోవడం వంటి కారణాలతో అధికసంఖ్యాకులు హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీపాయింట్స్పై ఆధారపడుతున్నారు. వీటిలో శుచి, శుభ్రతల గురించి పట్టించుకుంటున్న వారు లేరు. కర్రీ పాయింట్ల నుంచి మొదలు పెడితే స్టార్‌హోటళ్ల దాకా జరుగుతున్న కల్తీ, శుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో గ్రేటర్లో రోజుకు 50-100 మంది వరకు కల్తీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.