వాషింగ్టన్ : వృద్ధులకు కరోనా సోకితే కోలుకోవడం కష్టమని చెబుతున్నా అమెరికాలో 70 ఏళ్ల వృద్ధుడు మరణం అంచులదాకా వెళ్లి మహమ్మారిని జయించారు. సియాటెల్‌కు చెందిన మేఖేల్ ఫ్లోర్ మార్చి 4న కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఓ దశలో పరిస్ధితి విషమించడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో అక్కడి నర్సులు మాట్లాడించారు. ఆపై చికిత్సకు స్పందించిన ఫ్లోర్ 60 రోజుల అనంతరం మే 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని ఓడించి బయటపడిన ఫ్లోర్ ఆస్పత్రి సిబ్బంది తీసుకువచ్చిన 181 పేజీల బిల్లును చూసి షాక్ తిన్నారు.
కరోనా చికిత్స కోసం మొత్తం 1.1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8.5 కోట్ల రూపాయలకుపైగా బిల్లును ఆ వృద్ధుడి ముందుంచారు. అయితే వయోవృద్ధులకు ప్రభుత్వం కల్పించే మెడికేర్ బీమా ఉండటంతో ఫ్లోర్ జేబులో నుంచి ఒక్క పైసా చెల్లించకుండా బయటపడ్డారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలైన మొత్తం తన చికిత్సకు వెచ్చించాల్సి రావడం బాధాకరమని ఫ్లోర్ ఆందోళన చెందినట్టు సియాటెల్ టైమ్స్ పేర్కొంది. బిల్లు భారీగా వచ్చినా కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఆ వృద్ధుడు మృత్యుంజయుడై తిరిగి రావడం మాత్రం ఊరట కలిగించే పరిణామమే. చదవండి : భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment