
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): న్యుమోనియాతో బాధ పడుతున్న 45 రోజుల పసిపాప కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరీంనగర్‌కు చెందిన ఆ చిన్నారి తండ్రి అసీఫ్ రోజువారీ ఆటోడ్రైవర్. ఆటోను కిరాయికి తీసుకొని నడుపుతున్న అతను తన బిడ్డ ఆసుపత్రి బిల్లు చెల్లించే పరిస్థితిలో లేడు. ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిన కరీంనగర్‌కు చెందిన సామాజిక సేవకురాలు మునిపల్లి ఫణిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురికి పాప ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను గురువారం పోస్ట్ చేసి, ఆదుకోవాలని కోరారు.
ఆమె ట్వీట్‌కు గంటలోపే మంత్రి కార్యాలయం స్పందించింది. ‘మేము చూసుకుంటాం.. వీలైనంత త్వరగా సహాయం చేస్తాం’ అని రీట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం అసీఫ్‌కు మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాప వైద్య చికిత్స వివరాలు అడిగారని, ఆసుపత్రి బిల్ ఎంత అవుతుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారు.. తదితర వివరాలు అడిగారని, వీలైనంత త్వరగా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారని అసీఫ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment