
డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది వేస్తాడేమోననే భయంతో ముందే ఏడుపులంకించుకునే వాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. అదే సర్జరీ ఐతే నిలువెళ్లా వణికిపోతాం. భయంతో కన్నీళ్లు రానివారు ఉండరేమో! ఐతే డాక్టర్లు ధైర్యం చెప్పి చికిత్స చేయడం పరిపాటి.
ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఒక హాస్పిటల్ మాత్రం ఆపరేషన్ టైంలో పేషెంట్ ఏడ్చినందుకు ఏకంగా బిల్లు వేశారండి! బిల్లు చూసి నోరెళ్లబెట్టిన సదరు పేషెంట్ తన అనుభవాన్ని ట్విటర్‌లో పంచుకుంది. ఇక నెటిజన్లు అమెరికా హెల్త్ కేర్ సిస్టంను కామెంట్లరూపంలో ఏకి పారేస్తున్నారు. అసలేంజరిగిందంటే..
మిడ్జ్ అనే మహిళ మోల్ తొలగించేందుకు ప్రైమరీ సర్జరీ ఒకటి చేయించుకుంది. తర్వాత హాస్పిటల్ బిల్లులో అన్ని చార్జీలతోపాటు బ్రీఫ్ ఎమోషన్ పేరుతో అదనంగా రూ.800 (11 డాలర్లు) బిల్లేశారు. అమితాశ్చర్యాలకు గురైన సదరు మహిళ అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన పెంచేందుకు బిల్లును ట్విటర్‌లో షేర్ చేసింది.
ఇది అమెరికన్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఏవిధంగా ఉందనేది వివరిస్తుందని ఒకరు, ఈ సమయమంతా నేను ఉచితంగానే ఏడ్చానని అనుకున్నాను" అని మరొక యూజర్ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?!
Mole removal: $223
— Midge (@mxmclain) September 28, 2021
Crying: extra pic.twitter.com/4FpC3w0cXu