Mole
-
నలుపు తగ్గేదెలా..?
చిన్నారుల ఒంటిమీద, ముఖం మీద పుట్టుమచ్చల్లాంటి నల్లమచ్చలు కనిపిస్తుండటం మామూలే. అయితే కొందరు చిన్నారుల్లో ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ కండిషన్‌ను ‘నీవస్’ అంటారు. ఇలా నల్లమచ్చలు ఎక్కువగా వచ్చే ఈ కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘మల్టిపుల్ నీవస్’ అని పేర్కొంటారు. చర్మంలోని రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలే పుట్టుమచ్చలకూ, ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘నీవస్’ అని పిలిచే మచ్చలకు కారణం. ఈ మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఈ లక్షణమున్న కొందరిలో ఇవి అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలు రావడంతోపాటు సూర్యకాంతికి చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వంటి అంశాలు ఇవి వచ్చేందుకు కారణమవుతాయి.రకాలు ...ఈ మచ్చలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది హానికరం కాని సాధారణ ‘బినైన్’ మచ్చలు. రెండోది హానికరంగా మారే ‘మెలిగ్నెంట్’ మచ్చ. అయితే ఈ మెలిగ్నెంట్ అన్నది చాలా చాలా అరుదు. బినైన్ నీవస్ పెరుగుతున్నప్పుడు ఒకసారి పరీక్షించి, ఆ తర్వాత అది మెలిగ్నెంట్ కాదని నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత నిశ్చింతగా ఉండాలి. ఈ మచ్చల్లో కొన్ని పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలో రావచ్చు. బినైన్ మచ్చల విషయానికి వస్తే... చాలామంది పిల్లల్లో కనిపించే పుట్టుమచ్చల్లో... హానికరం కాని నీవస్ వాటివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిశాక నిశ్చింతగా ఉండవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఉన్నవారు క్రమం తప్పకుండా డర్మటాలజిస్ట్లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతోపాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్నూ డాక్టర్లు చూస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లో΄ాలు కూడా కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఇవన్నీ చాలా అరుదైన కండిషన్స్.మచ్చలు ఉన్నప్పుడు గమనించాల్సిన ఏ, బీ, సీ, డీలు...అది ఎలాంటి నల్లమచ్చ లేదా నీవస్ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాల్ని పిల్లల తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవం లో ఏదైనా మార్పు కనిపిస్తుంటుందేమో అని గమనించడం, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా అని చూడటం, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందేమో గమనిస్తుండటం, చివరగా... డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ తాలూకు వ్యాసం పెరుగుతోందా అని పరిశీలిస్తూ ఉండటం... ఈ నాలుగు మార్పుల్లో ఏది కనిపించినా తక్షణం డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.నివారణ ఇలా... పిల్లల్లో నల్లమచ్చల నివారణకు... చిన్నారులను మరీ ఎర్రటి ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అది హానికారక అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లేప్పుడు, వారికి కూడా 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి.చికిత్స...ఇక కొన్ని నల్లమచ్చలు హానికరం కాని నీవస్ మచ్చలే అయినప్పటికీ కొన్ని అవి చిన్నారుల లుక్స్‌కు కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... నిపుణులు వాటిని షేవ్ ఎక్సెషన్ థెరపీ వంటి ప్రక్రియల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అవి ప్రమాదకరమైన మచ్చలైతే... సంబంధిత నిపుణుల చేత వాటికి అవసరమైన చికిత్సలు అందించాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ (చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...) -
Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..!
డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది వేస్తాడేమోననే భయంతో ముందే ఏడుపులంకించుకునే వాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. అదే సర్జరీ ఐతే నిలువెళ్లా వణికిపోతాం. భయంతో కన్నీళ్లు రానివారు ఉండరేమో! ఐతే డాక్టర్లు ధైర్యం చెప్పి చికిత్స చేయడం పరిపాటి. ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఒక హాస్పిటల్ మాత్రం ఆపరేషన్ టైంలో పేషెంట్ ఏడ్చినందుకు ఏకంగా బిల్లు వేశారండి! బిల్లు చూసి నోరెళ్లబెట్టిన సదరు పేషెంట్ తన అనుభవాన్ని ట్విటర్లో పంచుకుంది. ఇక నెటిజన్లు అమెరికా హెల్త్ కేర్ సిస్టంను కామెంట్లరూపంలో ఏకి పారేస్తున్నారు. అసలేంజరిగిందంటే.. మిడ్జ్ అనే మహిళ మోల్ తొలగించేందుకు ప్రైమరీ సర్జరీ ఒకటి చేయించుకుంది. తర్వాత హాస్పిటల్ బిల్లులో అన్ని చార్జీలతోపాటు బ్రీఫ్ ఎమోషన్ పేరుతో అదనంగా రూ.800 (11 డాలర్లు) బిల్లేశారు. అమితాశ్చర్యాలకు గురైన సదరు మహిళ అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన పెంచేందుకు బిల్లును ట్విటర్లో షేర్ చేసింది. ఇది అమెరికన్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఏవిధంగా ఉందనేది వివరిస్తుందని ఒకరు, ఈ సమయమంతా నేను ఉచితంగానే ఏడ్చానని అనుకున్నాను" అని మరొక యూజర్ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! Mole removal: $223 Crying: extra pic.twitter.com/4FpC3w0cXu — Midge (@mxmclain) September 28, 2021 -
కిలోగ్రామ్‌కు సరికొత్త నిర్వచనం
వర్సెయిల్స్: ప్రపంచవ్యాప్తంగా బరువును కొలిచేందుకు వాడుతున్న కిలోగ్రామ్(కేజీ) ప్రమాణం నిర్వచనాన్ని మార్చేందుకు ఫ్రాన్స్ లో సమావేశమైన 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో పాటు విద్యుత్ ప్రవాహానికి వాడే ఆంపియర్, ఉష్ణోగ్రతకు వాడే కెల్విన్, పదార్థ రాశిని కొలిచేందుకు వాడే మోల్ ప్రమాణాల నిర్వచనాలను సవరించాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్లో జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. 1889 నుంచి ఇప్పటివరకూ ఫ్రాన్స్‌లోని ఓ హైసెక్యూరిటీ లాకర్లో భద్రపరిచిన ప్లాటినం–ఇరీడియం అల్లాయ్ గోళాన్ని ఇన్నాళ్లూ కేజీకి ప్రమాణంగా పరిగణిస్తూ వచ్చారు. ఈ లోహపు వస్తువు కిందపడ్డా, మరే కారణంచేత అయినా దెబ్బతిన్నా కేజీ బరువులో మార్పులు జరిగే అవకాశముండేది. ఈ నేపథ్యంలో తాజా నిర్వచనం ప్రకారం కేజీని ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజిటల్ మాధ్యమంలో సంఖ్యల రూపంలో తెలియజేయనున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వచ్చే మే 20 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి
సీమ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి త్వరలో ఉద్యమం కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబు రా యలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై, సీమ ద్రోహిగా మి గిలిపోయారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. త్వరలో నే రాయలసీమ సాగునీటి హక్కును కాపాడుకోవడానికి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన శ నివారం మడకశిర మండలం నీలకంఠాపురంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జ రుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాల ను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాన్ని 854 అడుగుల వ రకు కాపాడితేనే సీమ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ అక్రమం గా వాడుకుని నీటి మట్టం ఇంతకన్నా తగ్గిపోతే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్ర కాశం జిల్లాల రైతులు కూడా నష్టపోతార న్నారు. త్వరలో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమానికి రూలకల్పన చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ రెండేళ్ల పాలనలో టీడీపీ నాయకులు దోచుకోవడానికే పరిమిత మయ్యారని ఆరోపించారు. సమావేశంలో అనంతపురం, కర్నూలు డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. -
పెంపుడు శునకం పేరుమీదుగా మాల్డోవా
పేరులో నేముంది ఒక కుక్క పేరు మీదుగా ఈ దేశానికి ఈ పేరు ఏర్పడిందటే ఆశ్చర్యం వేస్తోంది కదా! అవును ఇది నిజం. మోల్డా అనేది రోమన్ యువరాజు డ్రాగోస్ పెంపుడు శునకం. వేటాడ్డమంటే సదరు యువరాజులుంగారికి మహా ఇష్టం. దాంతో ఓ రోజాయన ఓ అడవి దున్నను వేటాడుతూ దట్టమైన అరణ్యంలోకి వెళ్లిపోయాడు. డ్రాగోస్ వెంట పరివారం, తోడుగా వేటకుక్కలు ఉన్నాయి. అడవిదున్న చాలా దూరం పాటు వీళ్లని తన వెంట తిప్పుకుంది. విపరీతంగా అలసిపోయిన యువరాజు, పరివారం ఇక తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అయితే యువరాజు పెంపుడు కుక్క మోల్డా మాత్రం అలా దాన్ని వెంబడిస్తూ వెళ్లి, చివరికి ఓ నది ఒడ్డున నీళ్లు తాగుతున్న దాని జాడ కనుక్కొని, తన అరుపులతో అందరినీ అప్రమత్తం చేసింది. అందరూ వచ్చే వరకూ దాన్ని నిలువరించింది. ఈ ప్రయత్నంలో మోల్డా కాస్తా ప్రాణాలు కోల్పోయింది. అందరూ కలిసి అడవిదున్నను బంధించారు కానీ, తాను ప్రాణసమంగా ప్రేమించే మోల్డా చనిపోవడంతో యువరాజు ఎంతో దుఃఖించాడు. వీరమరణం చెందిన తన శునకానికి అక్కడే సమాధి కట్టించాడు. దాని స్మృతిచిహ్నంగా మలిచాడు. క్రమేణా అదే దేశమైంది.