చంద్రబాబు రాయలసీమ ద్రోహి
- సీమ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి త్వరలో ఉద్యమం
- కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబు రా యలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై, సీమ ద్రోహిగా మి గిలిపోయారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. త్వరలో నే రాయలసీమ సాగునీటి హక్కును కాపాడుకోవడానికి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన శ నివారం మడకశిర మండలం నీలకంఠాపురంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రాయలసీమకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జ రుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాల ను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాన్ని 854 అడుగుల వ రకు కాపాడితేనే సీమ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ అక్రమం గా వాడుకుని నీటి మట్టం ఇంతకన్నా తగ్గిపోతే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్ర కాశం జిల్లాల రైతులు కూడా నష్టపోతార న్నారు.
త్వరలో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమానికి రూలకల్పన చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ రెండేళ్ల పాలనలో టీడీపీ నాయకులు దోచుకోవడానికే పరిమిత మయ్యారని ఆరోపించారు. సమావేశంలో అనంతపురం, కర్నూలు డీసీసీ అధ్యక్షులు కోటాసత్యం, లక్ష్మీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.