
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో సాయంత్రం సీఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం, పింఛన్లు రూ.4 వేలకు పెంపు ఫైల్‌పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై ఐదో సంతకం చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరి ఇద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment