takes charge
-
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో సాయంత్రం సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం, పింఛన్లు రూ.4 వేలకు పెంపు ఫైల్‌పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై ఐదో సంతకం చేశారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరి ఇద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. -
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
-
ఉగ్ర దుర్బేధ్యంగా భారత్‌ను నిర్మిస్తా
న్యూఢిల్లీ: భారత దేశాన్ని అజేయ శక్తిగా మలుస్తానని నూతన హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో హోం శాఖ కార్యాలయంలో అమిత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ దేశం, దేశ ప్రజల భద్రతే నాకు అత్యున్నతం. మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని భద్రత విషయంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సల్ ప్రభావం బారిన పడకుండా దుర్బేధ్యంగా మారుస్తా’ అని అన్నారు. మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023, భారతీయ సాక్ష్యా అధినియం–2023ల సమర్థ అమలును అమిత్‌షా పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు మంత్రులుగా ప్రమాణంచేసిన నేతలు మంగళవారం ఢిల్లీలో తమతమ శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి కర్తవ్య నిర్వహణ మొదలెట్టారు. కొందరు నేతలు పూజాకార్యక్రమాలు చేసి మంత్రి కుర్చిల్లో కూర్చుంటే కొందరు కమలదళ నినాదాలు చేస్తూ కుర్చిల్లో ఆసీనులయ్యారు. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, అశ్వనీ వైష్ణవ్ రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రిగా ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కుటుంబసభ్యుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.మహిళా మంత్రులూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అన్నపూర్ణాదేవి చెప్పారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా శోభా కరంద్లాజె, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నిమూబెన్ బంభానియా బాధ్యతలు స్వీకరించారు. -
హైదరాబాద్ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
-
సీసీఐ చైర్పర్సన్ నియామకంలో విశేషం! మొదటిసారిగా..
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా రవనీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని ఓ మహిళ పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే మొదటిసారి. రవనీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సీసీఐ చైర్ పర్సన్‌గా కౌర్‌తో ప్రమాణం చేయించినట్టు ట్విటర్లో సీసీఐ ప్రకటించింది. సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా పదవీ కాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవికి పూర్తి స్థాయి చైర్పర్సన్ లేరు. కౌర్ నియామకంతో ఈలోటు భర్తీ అయింది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుంచి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, యాపిల్‌తో సహా డిజిటల్ స్పేస్‌కు సంబంధించిన వివిధ కేసులను అనుసరిస్తున్న సమయంలో రవనీత్ కౌర్ సీసీఐ పగ్గాలను చేపట్టారు. అలాగే జీఎస్టీ లాభదాయకతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ను పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గురువారం ఉదయం విశాఖ డెయిరీలో జరిగిన పాలకవర్గం సమావేశంలో సీనియర్ బోర్డు డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ డెయిరీ తదుపరి చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్ పేరును ప్రతిపాదించగా మరో సీనియర్ డైరెక్టర్ కోళ్ల కాటమయ్యతో పాటు ఇతర పాలక వర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆడారి ఆనంద్‌కుమార్ తన తండ్రి దివంగత తులసీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి తులసీరావు విశాఖ డెయిరీ చైర్మన్‌గా గత 36 సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తు చేశారు. మేలైన పశుజాతిని, పశు దాణాను, పశు వైద్యాన్ని అందించి పాడి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పాడి రైతులకు ఆరోగ్య సంక్షేమ పథకాలు, సేవలు అందిస్తూ విశాఖ డెయిరీను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నూతన చైర్మన్ ఆనంద్‌కుమార్‌కు విశాఖ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ రమణ పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: లోకేశ్ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు? -
UK PM: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. డేటా ఉల్లంఘన తప్పిదాలపై లిజ్ ట్రస్ హయాంలో హోంమంత్రిగా రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని తిరిగి నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆమెను అదే పదవిలో నియమించడాన్ని తప్పు పట్టింది. బ్రేవర్మన్ నియామకాన్ని రిషి సమర్థించారు. ఆమె తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులతో ఆయన బుధవారం మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తొలిసారి ప్రధాని హోదాలో ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్) ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ కొత్త మంత్రులతో కలిసి చర్చించారు. యూకే రాజకీయాల్లో పీఎంక్యూస్ కార్యక్రమం అత్యంత కీలకమైనది. ప్రతీ బుధవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలు, ఎంపీలు ఏ అంశం మీద అడిగిన ప్రశ్నలకైనా ప్రధాని బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలను రిషి నవంబర్ 17 దాకా వాయిదా వేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సన్నాహాలే ఇందుకు కారణమని హంట్ చెప్పారు. కేబినెట్ సమావేశంలోనూ ప్రధానిగా పార్లమెంటు తొలి భేటీలోనూ రిషి చేతికి హిందువులకు పవిత్రమైన దీక్షా కంకణం (మంత్రించిన ఎర్ర తాడు) ధరించి పాల్గొన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. దుష్ప్రభావాలు పోయి మంచి జరగడానికి దీనిని ధరిస్తే దేవుడు రక్షగా ఉంటాడని హిందువులు నమ్ముతారు. హిందూ మత విశ్వాసాలకు చెందిన దీనిని ధరించడంతో రిషి తాను నమ్ముకున్న సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
పగ్గాలు చేపట్టిన ఖర్గే
న్యూఢిల్లీ: సహచర నాయకుడు శశిథరూర్‌ను ఓడించి ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (75) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ‘‘అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది. నాకు చాలా ఊరటగా ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు! మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్ర నేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఖర్గేకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికీ కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పని చేస్తా. ప్రతి కార్యకర్తకూ గొంతుకగా మారతా. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా’’ అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. తన పక్క కుర్చీలో కూర్చోవాల్సిందిగా ఖర్గే కోరగా సున్నితంగా తిరస్కరించారు. ‘భయపడొద్దు’ నినాదంతో ముందుకు తన ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన ఉందని ఖర్గే అన్నారు. పార్టీగా కాంగ్రెస్‌కు ఇది కష్టకాలమేనని అంగీకరించారు. అయితే కార్యకర్తలు తమలో ఉన్న భయాలను పారదోలితే ఎంతటి సామ్రాజ్యమైనా వారిముందు మోకరిల్లుతుందన్నారు. రాహుల్ ఇచ్చిన ‘భయపడొద్దు’ నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీని ఓడించేందుకు నేతలు, కార్యకర్తలూ స్వరశక్తులూ ధారపోయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వయసు వారికే ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేసి సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై కళ్లు మూసుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకు సర్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘గాడ్సేను దేశభక్తునిగా, గాంధీని దేశద్రోహిగా చిత్రిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి సంఘ్ పరివార్ రాజ్యంగం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ఈ అబద్ధాలను బట్టబయలు చేసి, మోసాలను ఎండగట్టి, విద్వేష ప్రచారాలను తుత్తునియలు చేసి తీరతామన్నారు. పార్టీని ఖర్గే మరింత పటిష్టపరుస్తారని, స్ఫూర్తిదాయకంగా నడుపుతారని సోనియా విశ్వాసం వెలిబుచ్చారు. ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఓటమిని మాత్రం ఎన్నడూ అంగీకరించలేదని అన్నారు. దేశ ప్రజాస్వామిక సూత్రాలకే పొంచి ఉన్న పెను ముప్పును దీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే ఈ కాలంలో సోనియా మాత్రం స్వార్థరహితంగా పార్టీని ముందుకు నడిపారంటూ ఖర్గే కొనియాడారు. సునాక్‌కు సోనియా లేఖ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను సోనియా అభినందించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమంటూ ఆయనకు లేఖ రాశారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ఆఫీస్ బేరర్ల రాజీనామాలు... 47 మందితో స్టీరింగ్ కమిటీ 47 మందితో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని నూతన అధ్యక్షుడు ఖర్గే నియమించారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేదాకా దాని బాధ్యతలను ఖర్గే సారథ్యంలోని ఈ కమిటీ చూస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌తో పాటు గత సీడబ్లు్యసీ సభ్యుల్లో అత్యధికులకు కమిటీలో చోటు దక్కింది. ప్రియాంక, ఏకే ఆంటోనీ, అంబికా సోని, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు. సీడబ్లు్యసీ ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం ఎవరికీ చోటు దక్కలేదు. కొత్త టీములను ఏర్పాటు చేసుకునేందుకు ఖర్గేకు వీలు కల్పిస్తూ అంతకుముందు సీడబ్లు్యసీ సభ్యలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తదితర ఆఫీసు బేరర్లంతా ఆయనకు లాంఛనంగా రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికను ఆమోదించేందుకు వచ్చే మార్చిలో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశముంది. ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో గుజరాత్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. -
సీడీఎస్‌గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్‌ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్‌ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. -
ఎన్ఎస్ఈ చీఫ్‌గా చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్ చౌహాన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం పాటు బీఎస్ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసిన నేపథ్యంలో, ఈ పదవికి చౌహాన్ ఎంపిక కావడం తెలిసిందే. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. 2000 సంవత్సరంలో ఎన్ఎస్ఈని వీడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు కంపెనీల్లో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. తిరిగి 2009లో బీఎస్ఈ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపట్టి, 2012లో సీఈవో అయ్యారు. మరోవైపు బీఎస్ఈ కొత్త చీఫ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ బీఎస్ఈ రోజువారీ వ్యవహారాలు చూస్తుందని పేర్కొంది. కీలక బాధ్యతలు.. ఎన్ఎస్ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ ముందు పరిష్కరించాల్సిన పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో తరచూ సాంకేతిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆశిష్ కుమార్ చౌహాన్ దీనికి పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే, కోలొకేషన్ స్కామ్‌లో ఎన్ఎస్ఈ తనపై పడ్డ మరకను కడిగేసుకోవాల్సి ఉంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్ఎస్ఈని విజయవంతంగా ఐపీవోకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అలాగే, పాలనా లోపాలకు చెక్ పెట్టాల్సి ఉంది. బీఎస్ఈ బాస్‌గా ఆశిష్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎక్సేంజ్‌గా తీర్చిదిద్దారు. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫామ్ బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్‌ను ఏర్పాటు చేశారు. -
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు. -
వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడదల రజిని అన్నారు. చదవండి: ఉంగరం దొంగలు మీరేనా? రాజకీయ నేపథ్యం: హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో ప్రాసెస్ వీవర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు
-
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమురి నాగేశ్వరరావు
-
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని మంత్రి అన్నారు. రాజకీయ నేపథ్యం: ఐఆర్ఎస్ అధికారిగా 2004 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు పనిచేశారు. 2009లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో వైఎస్సార్ ఆశీస్సులతో కాంగ్రెస్ తరఫున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందారు. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. -
మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పనిచేస్తానని కారుమూరి తెలిపారు. చదవండి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్ రాజకీయ నేపథ్యం: 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున తణుకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున దెందులూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున తణుకు ఎమ్మెల్యేగా గెలిచారు. -
రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: చెప్పాడంటే.. చేస్తాడంతే.. గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ‘‘రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని’ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్పారీ్టలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు
-
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ
-
ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును చైర్‌వద్దకు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. చదవండి: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్ వైఎస్సార్ కుటుంబం ఎంతో మంది సామాన్యులను ఉన్నతస్థాయికి తీసుకొచ్చిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారని మోషేన్‌రాజు అన్నారు. దళితుడిని ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడతానన్నారు. రాజకీయాలకు కులం, డబ్బు అవసరం లేదు. ప్రజల విశ్వాసం ఉంటే చాలని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అని మోషేన్ రాజు అన్నారు. చదవండి: అసెంబ్లీలో టీడీపీ హైడ్రామా.. కన్నీళ్లు, వాకౌట్ అంటూ పచ్చ మీడియా అతి కొయ్యే మోషేన్ రాజు ప్రస్థానమిది.. జననం: 1965, ఏప్రిల్ 10 తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి విద్యాభ్యాసం: డిగ్రీ గతంలో చేపట్టిన పదవులు ► 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ► ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ భీమవరం పట్టణ అ«ధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. ► కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు. -
సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన భాస్కర్‌రెడ్డి.. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. రైస్‌మిల్లింగ్ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సీఎంకు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
బెజవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు
సాక్షి, విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్లైన్ మోసాలపై సైబర్ సెల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. (గ్యాంగ్ వార్ కేసులో పురోగతి) నేరాలను నియంత్రించాం: ద్వారకా తిరుమలరావు విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్) -
దేవులపల్లి అమర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
సీబీఐ చీఫ్‌గా శుక్లా బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన రిషి కుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ 28వ డైరెక్టర్‌గా రిషి శనివారం నియమితులైన విషయం తెలిసిందే. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన 58 ఏళ్ల రిషి కుమార్ మధ్యప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణంగా కొత్తగా నియమితులైన వారెవరైనా కనీసం వారం రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం కోల్‌కతాలో బెంగాల్ పోలీసులకు, సీబీఐ అధికారులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్తా.. కేంద్రం, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధం కారణంగానే రెండ్రోజులకే బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. సీబీఐ ఉన్నతాధికారులు అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రం సెలవుపై పంపి, నాగేశ్వర్రావును తాత్కాలిక చీఫ్‌గా నియమించింది. తాజాగా ప్రధాని నేతృత్వంలోని కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా శుక్లాను నియమించింది. -
రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నిరాబండరంగా జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మనోహర్ పరీకర్ రాజీనామా చేయడంతో రక్షణ మంత్రి పదవి ఖాళీ అయింది. గోవా ముఖ్యమంత్రిని చేపట్టేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరీకర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆమోదించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2014, మే 26 నుంచి అదే ఏడాది నవంబర్ 9 వరకు రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టారు.