
సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని మంత్రి అన్నారు.
రాజకీయ నేపథ్యం:
ఐఆర్‌ఎస్ అధికారిగా 2004 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు పనిచేశారు. 2009లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో వైఎస్సార్ ఆశీస్సులతో కాంగ్రెస్ తరఫున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందారు. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు.
Comments
Please login to add a commentAdd a comment