urban development minister
-
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు
-
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని మంత్రి అన్నారు. రాజకీయ నేపథ్యం: ఐఆర్ఎస్ అధికారిగా 2004 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు పనిచేశారు. 2009లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో వైఎస్సార్ ఆశీస్సులతో కాంగ్రెస్ తరఫున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందారు. సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. -
ఏడాదికో కొత్త షికాగో నిర్మిస్తేనే!
న్యూయార్క్: పట్టణీకరణ విషయంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు 2030 వరకు ఏడాదికో కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. 2030 కల్లా భారత జనాభాలో 40%మంది పట్టణాల్లో నివసిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సమ్మిళిత అభివృద్ధిపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్దీప్ మాట్లాడారు. భారత పట్టణీకరణ లక్ష్యాలను చేరుకునేందుకు నేటినుంచి 2030 వరకు ప్రతి ఏటా 70 నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణాభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. మిషన్ 2030లో భాగంగా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే పట్టణీకరణ కోసం 70% కొత్త మౌలికవసతులను భారత్ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని పురీ తెలిపారు. 1947లో భారత జనాభాలో 17% పట్టణాల్లో నివసిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30% ఉంది. 2030 కల్లా ఇది 40%కు చేరవచ్చని అంచనా. -
అదృష్టమంటే ఆయనదేనండి ...
అదేమి విచిత్రమో ... ఒక్క బహిరంగ సభలో ప్రసంగించలేదు... ఎన్నికల ప్రచారంలో ఒక్కసారి కూడా పాల్గొనలేదు... అంతేందుకు ఒక్క ఓటరును కూడా తనకు ఓటు వేయండి అని అడగలేదు. అయితే నక్క తోక తొక్కినట్లు ఆయన్ని మంత్రి పదవి వరించింది. దాంతో ఆయన అదృష్టం వీల్ డిటర్జంట్ పౌడర్ యాడ్‌లో కనిపించే 'వీల్'లా గిరగిర తిరుగుతుంది. ఇంతకు ఎవరా అదృష్టవంతుడు అనుకుంటున్నారా ? ఆయనేనండి ప్రముఖ విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ గారు. ఆయన ఏ సభలో సభ్యుడు కాడు అన్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నిక కానున్నారు... ఆ విషయం కూడా తెలిసిందే. అయితే చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి (జూన్ 8వ తేదీ) మాంచీ ఊపు, ఉత్సాహంతో పని చేసుకుపోతున్నారు. ఎలా అంటే ఆయన తన సహచర మంత్రుల కంటే రేస్‌లో దూసుకు పోతున్నారు. అది ఆయన శాఖలో అనుకుంటే పప్పులో తప్పకుండా కాలేసినట్లు.... ఎలా అంటారా విషయంలోకి వద్దాం... బియాస్ సంఘటన జరిగిన వెంటనే అక్కడ వాలిపోయారు. సహాయక చర్యలు చేపట్టడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తానైనట్లు మసలుకున్నారు. అంతేందుకు రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో శివరామకృష్ణన్ కమిటీతోపాటు ... రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ దేశ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణ గారి 'పనితనం' కొండవీటి చాంతాడంతా జాబితా తయారవుతుంది. అయితే నిన్న కాక మొన్న వచ్చిన నారాయణ గారు .... ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని తానైనట్లు ప్రవర్తిస్తుడం పట్ల ఆయన సహచర కేబినెట్‌కు ఒంటికి కారం పుసుకున్నట్లుగా ఉంది. దాంతో ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసుకుంటూ... ప్రజల మధ్య ఉండి... ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తాము... తుప్పు పట్టిన ఇనుపముక్కలా ఓ పక్కన పడి ఉన్నామని మిగతా మంత్రులు తెగ కలత చెందుతున్నారు. ఎంతైనా ఆయన టైము బాగుంది అంటూ నారాయణకు పట్టిన అదృష్టాన్ని చూసి 'వారు' తమలోతాము గుసగుసలాడుకుంటున్నారు. -
గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య
రాష్ట్రాల గవర్నర్ల నియామకం రాజకీయపరమైనదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్ఫష్టం చేశారు. రాజకీయ వ్యవస్థ మారినప్పుడు గవర్నర్లు మారుతుంటారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయిన ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన వివరించారు. రైల్వే ఛార్జీల పెంపు, సోషల్ మీడియాలో హిందీ భాష వాడాలని యూపీఏ సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. మా వల్లే ధరలు పెరిగాయంటూ యూపీఏ ప్రభుత్వం హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. -
'నారా'యణ మంత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తారక మంత్రాన్ని తత్కాలికంగా పక్కనపెట్టి... నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు. అటు శాసనసభలో, ఇటు శాసన మండలిలో సభ్యుడు కానీ ప్రముఖ విద్యాసంస్థల అధినేత పి. నారాయణను చంద్రబాబు ఏకంగా తన కేబినెట్లోకి తీసుకున్నారు. అంతేనా ప్రభుత్వశాఖలలో అత్యంత ముఖ్యమైన శాఖ మున్సిపల్, పట్టణాభివృధ్దిని నారాయణకు అప్పగించేశారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్న తమకు రాకుండా ఏ సభలో సభ్యుడు కానీ నారాయణ పార్టీలోకి ఇలా వచ్చి అలా మంత్రి పదవి ఎలా ఎగరేసుకుపోయాడా అని తెలుగు తమ్ముళ్లు తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారని సమాచారం. అసలు విషయానికి వస్తే.... 90వ దశకంలో క్రియటీవ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రంలో చేపల కృష్ణలా ఏదో చట్ట సభలో అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఎన్నాళ్ల నుంచో నారాయణ ఎంతో ఆశగా ఉన్నారు. ఇటీవల జరిగిన పెద్దల సభ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్ష అనిపించుకోని తన ముచ్చట తీర్చుకోవాలని నారాయణ ఆశించారు. అంతే ఇంకా ఆలస్యం చేయకుండా తాను రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితానంటూ చంద్రబాబు చెవిలో ఊదారు. సామదానభేదోపాయలు ఉపయోగించి అయినా గెలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే నారాయణ అధ్యక్ష ఆశలపై.... అప్పట్లో బాబు నీళ్లు చల్లారు. దాంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో టీడీపీని గెలిపిస్తే ఏ సభలో సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కట్టబెడతానంటూ నారాయణకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే నారాయణ రంగంలోకి దిగారు. నారాయణమంత్రంతో... ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా విశాఖపట్నం,అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ సీట్లు సైతం ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో నారాయణకు చంద్రబాబు తన కేబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓ దశలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి నారాయణను చంద్రబాబు ఎంపిక చేశారంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. -
రాజకీయ నిర్ణయం మేరకే
ఆంధ్ర కొత్త రాజధాని ఎంపికపై వెంకయ్య వెల్లడి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక రాజధానిపై కసరత్తు కొత్త రాజధానిగా హైదరాబాద్ అంతటి నగరాన్ని ఆశించలేం {పధాని మోడీ స్మార్ట్ సిటీ ఆలోచనకు హైదరాబాద్ అనువైనది ఆంధ్ర, తెలంగాణలను కేంద్రం కన్నబిడ్డల్లా ఆదుకుంటుంది హైదరాబాద్: విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక అన్నది అంతిమంగా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చేవారు రాజకీయంగా తీసుకునే నిర్ణయం మేరకే జరుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఆయన మంత్రివర్గ విస్తరణ తరువాత రాజధానికి సంబంధించి తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్యనాయుడు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించి ఇప్పటికే తానొకసారి చంద్రబాబుతోనూ చర్చిం చినట్టు తెలిపారు. కొత్త రాజధాని హైదరాబాద్ అంతటి నగరంగా ఉంటుం దని ఆశించ లేమని.. ఎంత మేరకు అవసరం, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నదే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగని కేవలం అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస గృహాలకు పరిమితమై రాజధాని నగరాన్ని నిర్మిం చడం సరికాదన్నారు. రాజధానిగా ఉండే నగరానికి ఉండాల్సిన మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం వంటి అవసరాలను పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గుంటూరు-విజయవాడ, ఖాజీపేట-వరంగల్ వంటి జంట నగరాల అభివృద్ధి మంత్రిగా తన ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా చెప్పారు. ప్రధాని మోడీ ఆలోచనల్లోని స్మార్ట్ సిటీ విధానానికి హైదరాబాద్ అనువైనదిగా వెంకయ్య పేర్కొన్నారు. ఈ నగరం చుట్టూ కొన్ని చిన్న నగరాలను అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో పనులు 2017 వరకు పూర్తవుతాయని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దీనిని విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలను కన్నబిడ్డల్లా చూసుకుంటాం... అంతకుముందు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వెంకయ్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కన్నబిడ్డల మాదిరి ఆదుకుంటుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధ్యమని.. ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఉద్యోగుల పంపిణీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల మేరకు ఉద్యోగుల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు జరిగిన పంపిణీ తాత్కాలికమైనదని.. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మూడు నెలల్లో తెలియజేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎక్కడి వారు అక్కడ పనిచేయాలని కొందరు అంటున్నా రెండో ప్రాంతంలో సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపితేనే అది సాధ్యమని చెప్పారు. ఘన స్వాగతం.. అధికారులతో సమీక్ష కేంద్రమంత్రి పదవి చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన బెంగళూరులో ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని పార్టీ నేతలు చెప్పారు. -
దేశంలో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఈ పదేళ్లలో క్లాస్-1 నగరాలు 394 నుంచి 468కి పెరిగాయన్నారు. ఆధ్మాత్మిక నగరాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని 43శాతం ప్రజలు మెట్రో నగరాల్లో నివసిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. 2015 నాటికి సగం జనాభా పట్టణాల్లో నివసిస్తారనే అంచనా ఉందన్నారు. 2020 నాటికి దేశంలో ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. పేదలకు పట్టణాల్లో ఆవాసాలు కల్పిస్తామని తెలిపారు.