గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య | Venkaiah Naidu takes on UPA Government | Sakshi
Sakshi News home page

గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య

Published Sun, Jun 22 2014 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య

గవర్నర్ల నియామకం రాజకీయపరమైనది: వెంకయ్య

రాష్ట్రాల గవర్నర్ల నియామకం రాజకీయపరమైనదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్ఫష్టం చేశారు. రాజకీయ వ్యవస్థ మారినప్పుడు గవర్నర్లు మారుతుంటారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

 

మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయిన ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన వివరించారు. రైల్వే ఛార్జీల పెంపు, సోషల్  మీడియాలో హిందీ భాష వాడాలని యూపీఏ సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. మా ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. మా వల్లే ధరలు పెరిగాయంటూ యూపీఏ ప్రభుత్వం హడావిడి చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement