యూపీఏ ప్రభుత్వంపై వెంకయ్య ధ్వజం
సాక్షి, బెంగళూరు: ఆధార్ కార్డుల పేరుతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రూ. 3,500 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిందని బీజేపీ నేత వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. ప్రధాని కావాలన్న నరేంద్ర మోడీ కల ఎన్నటికీ నెరవేరదని...కావాలంటే ఆయన టీ అమ్ముకోవచ్చన్న కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు శనివారమిక్కడ ఉచిత టీ పంపిణీ చేపట్టారు. వెంకయ్య మాట్లాడుతూ.. ఆధార్ విషయంలో కేంద్రం ‘తుగ్లక్ పాలన’ను తలపించిందని విమర్శించారు. నిన్నటి వరకూ గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరంటూ ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేయడమే కాకుండా, ప్రజలను నానా ఇబ్బందులు పెట్టిందని దుమ్మెత్తిపోశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రూ.630 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని సూచించారు.
‘ఆధార్’ పేరిట రూ.3,500 కోట్లు వృథా
Published Sun, Feb 2 2014 1:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement