UPA government
-
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్‌కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్‌పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్‌లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్‌లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్‌ను రద్దుచేసింది. కోల్‌స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
India Mobile Congress 2023: కాంగ్రెస్.. కాలం చెల్లిన ఫోన్
న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్‌గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్‌డేటెడ్ ఫోన్‌ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్‌ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్‌లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్‌లు’ యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు. ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్‌లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
'ఆ క్రెడిట్ మాదే..' మహిళా రిజర్వేషన్ బిలుపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం. "It is ours, अपना है" 🔥#WomenReservationBill पर CPP अध्यक्ष श्रीमती सोनिया गांधी जी। pic.twitter.com/2LDIHhrIGN — Srinivas BV (@srinivasiyc) September 19, 2023 If the government introduces the Women's Reservation Bill tomorrow, it will be a victory for the Congress and its allies in the UPA government Remember, it was during the UPA government that the Bill was passed in the Rajya Sabha on 9-3-2010 In its 10th year, the BJP is… — P. Chidambaram (@PChidambaram_IN) September 18, 2023 ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం -
జాతి క్షేమాన్ని మించిన పదవీ కాంక్ష..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళాను వర్చువల్‌గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్‌ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు. వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది. భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్‌గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. బుధవారం ఓ మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా -
చీతా ప్రాజెక్టు తమ హయాంలోనే ప్రారంభమైంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాజెక్టు తమ హయాంలోని ప్రారంభమైందని కరాఖండిగా కాంగ్రెస్ చెబుతుంది. తాము ఈ ప్రాజెక్టు చిరుత ప్రతిపాదనను 2008-09లోనే సిద్ధం చేశామని పేర్కొంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆమోదించిందని కూడా కాంగ్రెస్ పేర్కొంది. ఐతే 2013లో సుప్రీం కోర్టు ఈ ప్రాజెక్టుపై స్టే విధించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. మళ్లీ 2020లో సుప్రీం కోర్టు అనుమతితో చిరుతలు భారత్‌కి తిరిగి రావడానికి మార్గం సుగమమైందని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పేర్కొంది. అంతేగాదు అప్పటి అటవీ పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్ 2010లో ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో చిరుత జౌట్‌రిచ్ సెంటర్‌కు వెళ్లినట్లు కూడా తెలిపింది. నాటి ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. 'प्रोजेक्ट चीता' का प्रस्ताव 2008-09 में तैयार हुआ। मनमोहन सिंह जी की सरकार ने इसे स्वीकृति दी। अप्रैल 2010 में तत्कालीन वन एवं पर्यावरण मंत्री @Jairam_Ramesh जी अफ्रीका के चीता आउट रीच सेंटर गए। 2013 में सुप्रीम कोर्ट ने प्रोजेक्ट पर रोक लगाई, 2020 में रोक हटी। अब चीते आएंगे pic.twitter.com/W1oBZ950Pz — Congress (@INCIndia) September 16, 2022 (చదవండి: కునో పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫొటోలు తీస్తూ..) -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
‘రఫేల్’పై ఆధారాలున్నా మౌనమెందుకు?
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వ్యవహారం సెగలు రాజేస్తూనే ఉంది. రఫేల్ ఫైటర్జెట్ల సరఫరా కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘డసాల్ట్ ఏవియేషన్’ భారత్‌కు చెందిన సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి 2007–12కాలంలో కమీషన్ల కింద 7.5 మిలియన్ యూరోలు(రూ.65 కోట్లు) చెల్లించినట్లు ఫ్రెంచ్ పరిశోధన పత్రిక ‘మీడియాపార్ట్’ ఆరోపించింది. కమీషన్లు చేతులు మారడానికి వీలుగా డొల్ల కంపెనీల పేరిట నకిలీ రశీదులను సృష్టించి వాడారంది. ఆ రశీదులను ప్రచురించింది. అయితే, దీనిపై భారత రక్షణ శాఖ గానీ, డసాల్ట్ ఏవియేషన్ స్పందించలేదు. యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.59వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రఫేల్ డీల్‌లో అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ భారత్‌లోని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని మీడియాపార్ట్ ప్రశ్నించింది. రఫేల్ ఒప్పందంలో విదేశీ కంపెనీలు, మోసపూరిత కాంట్రాక్టులు, నకిలీ రశీదుల ప్రమేయం కనిపిస్తోందని, 2018 అక్టోబర్ నుంచి ఆధారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినా విచారణ జరపొద్దని సీబీఐ, ఈడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని మీడియాపార్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్కో రఫేల్ ఫైటర్‌జెట్‌ను రూ.526 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లకు కొంటోందని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమీషన్లు చేతులు మారాయని బీజేపీ నేత అమిత్ మాలవియా చెప్పారు. -
తమిళులకు డీఎంకే–కాంగ్రెస్ ద్రోహం చేశాయి: నడ్డా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్‌లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్‌లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
రాజీవ్ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు
న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూపీఏ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి భారీగా నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యూపీఏ హయాంలో రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్‌జీఎఫ్‌కి ఆమే చైర్ పర్సన్. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. -
పాత పద్ధతిలోనే ఎన్పీఆర్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)–2020ను పాత ఫార్మాట్లోనే నిర్వహించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నిర్వహణకు వినియోగించిన ఫార్మాట్‌నే ఈసారీ వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ భేటీలో నిర్ణయించింది. తాజాగా పాత ఫార్మాట్లోనే ఎన్పీఆర్ నిర్వహణపైనా తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కేరళ, పశ్చిమ బెంగా ల్ ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్పీఆర్ పనులను పూర్తిగా నిలిపేయగా రాజస్తాన్, పంజాబ్ శాసనసభలు ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. బిహార్‌లో ఎన్నార్సీ జరపబోమని, ఎన్పీఆర్ను సైతం పాత ఫార్మాట్లోనే నిర్వహిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్డీఏ పాలనలో ఉన్న బిహార్ తరహాలోనే రాష్ట్రంలోనూ పాత ఫార్మాట్లో ఎన్పీఆర్ నిర్వహించేలా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఏవైనా 45 రోజులపాటు ఎన్పీఆర్ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్పీఆర్ నిర్వహణపై శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భయాందోళనలను దూరం చేసేందుకు... ఎన్పీఆర్–2020 కరదీపికలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి పౌరుడు తనతోపాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం వివరాలను కచ్చితమైన సమాచారంతో ఇవ్వాల్సి ఉంది. అయితే అత్యధికం మంది వద్ద పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఆధారాలు లేవు. అలాగే చాలా మందికి కచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. దీనికితోడు చనిపోయిన తల్లి దండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం తెలిసి ఉండే అవకాశం తక్కువే. నిరక్షరాస్యులైన పేదల వద్ద వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఎన్పీఆర్–2020 ఫార్మాట్లో అడిగే ప్రశ్నలన్నింటికీ ప్రజలు ‘స్వచ్ఛందంగా’ఆధారాలు చూపించాలని కేంద్రం పేర్కొంటోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత హింసకు గురై 2014 డిసెంబర్ నాటికి భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైనులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. ఎన్నార్సీకి ఎన్పీఆర్ డేటాబేస్ మూల ఆధారమని కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేర్కొంటోంది. ఎన్పీఆర్, సీఏఏ, ఎన్ఆర్సీలలో ఒకదానితో మరొకటికి సంబంధం లేదని కేంద్రం పేర్కొంటున్నా దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీలో చోటు సంపాదించని వారిలో ముస్లిమేతరులందరికీ సీఏఏ కింద పౌరసత్వం లభించనుందని, చివరికి తమ పౌరసత్వమే ప్రశ్నార్థకం కానుందని ముస్లింలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలను దూరం చేసేందుకు ఎన్పీఆర్ను పాత ఫార్మాట్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పాత ఫార్మాట్ సులువు... ఎన్పీఆర్–2011 ఫార్మాట్‌ను వినియోగిస్తే 15 ప్రశ్నలకు సాధారణ రీతిలో సమాధానమిస్తే సరిపోనుంది. పేరు/కుటుంబ పెద్దతో సంబంధం/తండ్రి పేరు/తల్లిపేరు/జీవిత భాగస్వామి పేరు (ఒకవేళ వివాహితులైతే)/లింగం/పుట్టిన తేదీ/వివాహితులా కాదా?/పుట్టిన ప్రాంతం/జాతీయత/ప్రస్తుత చిరునామా/ప్రస్తుత చిరునామాలో ఎన్నాళ్ల నుంచి నివాసం/శాశ్వత చిరునామా/వృత్తి/విద్యార్హతల సమాచారాన్ని ఎన్యూమరేటర్లు కోరనున్నారు. ఒకవేళ ఎన్పీఆర్–2020 ఫార్మాట్‌ను వినియోగిస్తే ఇవే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని మరింత లోతుగా, ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలతో ప్రజలు ఇవ్వాల్సి రానుంది. -
విపక్షాలది ఉద్దేశపూర్వక ప్రచారం : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: 2021లో జరగనున్న జనగణనలో అంతర్భాగంగానే ప్రస్తుత ఎన్పీఆర్ను చేపడుతున్నట్టు, ఆ మాటకొస్తే యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్పీఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్పీఆర్ అనేది ఎన్ఆర్సీకి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్షాలు, మీడియాలోని ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిరాధారమైన అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హైదరాబాద్‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా తెలిపారు. అయితే ఇందులో భాగంగా మూడు నాలుగు అదనపు అంశాలు జోడించి ఒక వ్యక్తి తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్, చివరి నివాస స్థలం ఎన్పీఆర్లో పొందుపరచనున్న కనీస ప్రాథమికాంశాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి అపోహలు సృష్టించి ప్రజల మనసులతో ఆటలాడుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ పథకాల అమలుకు విఘాతం కల్గించడం వీరి లక్ష్యంగా కనబడుతోందన్నారు. అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొందించలేదన్నారు. కాబట్టి అసత్యాలతో, అర్థ సత్యాలతో గగ్గోలు పెడుతూ గోబెల్స్ మాదిరి గా విపక్షాలు, ఇతరులు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌కు (ఐటీఐఆర్) యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒక్క పైసా ఇవ్వలేదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం తన పదవీ కాలం చివరి సమయంలో ఐటీఐఆర్‌ను తీసుకొచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని, కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రాన్ని దాదాపు పది సార్లునేరుగా కలిసి అడిగినా, లేఖలు రాసినా స్పందించలేదని శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెల్లడించారు. నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని తెలిపారు. దీనిపై అప్పటి సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైతం ఐటీఐఆర్ మా పాలసీ కాదని, దాన్ని ముందుకు తీసుకెళ్లమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి ఆగలే దన్నారు. గడిచిన ఏదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు గాదరి కిషోర్ కుమార్, కేపీ వివేకానంద్, కాంగ్రెస్ సభ్యుడు డి.శ్రీధర్‌బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి రూ.1.09 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర ఐటీలో 17 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని, కరీంనగర్లో వచ్చే నెలలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మురుగు శుద్ధి లేకే జ్వరాలు: అక్బరుద్దీన్ హైదరాబాద్‌లో కేవలం 30% మాత్రమే మురుగు శుద్ధి జరుగుతోందని, కావాల్సినన్ని సీవరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు (ఎస్టీపీ) లేకపోవడంతో మురుగు పెరుగుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మురుగు శుద్ధి జరగక నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమలు విజృంభిస్తున్నాయన్నారు. ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, మురుగు శుద్ధి లేకపోవడం, మూసీ నదిలో వదులుతున్న వ్యర్థాలే దీనంతటికీ కారణమన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. నగరంలో 735 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు 21 ఉన్నాయని, అయితే ఇవి చాలినంతగా లేవన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే 2021 నాటికి మరో 700 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేసేలా, 2036 నాటికి 3 వేల ఎంఎల్డీల మురుగు శుద్ధి జరిగేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. దోమల నివారణకు 200 జెట్టీ యంత్రాలతో స్ప్రే చేయిస్తున్నామని, డెంగీ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మురుగు పారుదల వ్యవస్థ బలోపేతం చేసేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యతను ముంబైకు చెందిన షా కన్సల్టెన్సీకి అప్పగించిందని, ఈ నివేదిక డిసెంబర్లో వస్తుందని తెలిపారు. -
సర్జికల్ దాడులు.. కాంగ్రెస్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్‌లో యూరి సెక్టార్లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. -
రాహుల్ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సమయంలో.. రాహుల్ గతంలో బ్రిటన్‌లో ఉల్రిక్ మెక్నైట్ అనే వ్యక్తి భాగస్వామిగా బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు మెక్నైట్ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. కంపెనీ మూతపడటానికి ముందు 2005 జూన్ 5 నాటికి బ్యాకాప్స్ కంపెనీలో రాహుల్‌కు 65 శాతం, మెక్‌నైట్‌కు 35 శాతం వాటా ఉంది. ఆ తర్వాత 2011లో కూడా ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ నుంచి (స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించి) మెక్నైట్ కాంట్రాక్టులు పొందారు. యూపీఏ హయాంలో నావల్ గ్రూప్ విదేశీ భాగస్వామిగా.. రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు ‘ఇండియా టుడే’కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం.. రాహుల్, మెక్‌నైట్‌లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు. కాగా 2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో బ్యాకాప్స్ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్ పొందుపరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది. కాగా దాదాపు ఇదేవిధమైన పేరుకలిగిన బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కూడా రాహుల్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ భారతీయ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ 2004 ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. రూ.2.5 లక్షల మూలధన పెట్టుబడి కూడా ఉందన్నారు. 2002లో మొదలైన ఈ కంపెనీ కూడా తర్వాత మూతపడింది. చివరిసారిగా 2010 జూన్‌లో ఈ సంస్థ రిటర్న్స్ దాఖలు చేసింది. అయితే రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామి, అతని కంపెనీలు ఫ్రెంచి కంపెనీ ఇచ్చిన ఆఫ్సెట్ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందుతూ వచ్చాయి. విశాఖ సంస్థల్లో డైరెక్టర్‌గా మెక్నైట్ ముంబయిలోని మాజగాంవ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) వద్ద తయారయ్యే స్కార్పీన్ జలాంతర్గాములకు అవసరమైన కీలక విడిభాగాలు సప్లై చేసేందుకు ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ 2011లో విశాఖపట్నంకు చెందిన ఫ్లాష్ ఫోర్జ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన రూ.20 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఎండీఎల్‌తో నావల్ గ్రూప్ కలసి పనిచేయాల్సి ఉంది. కాగా అదే ఆర్థిక సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ యూకేకి చెందిన ఆప్టికల్ ఆర్మోవర్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. 2012 నవంబర్‌లో ఇద్దరు ఫ్లాష్ ఫోర్జ్ డైరెక్టర్లను ఆ సంస్థలో డైరెక్టర్లుగా చేశారు. వీరు ఆ సంస్థ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన 2012 నవంబర్ 8నే ఉల్రిక్ మెక్‌నైట్‌ను కూడా ఆ సంస్థ డైరెక్టర్‌గా చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో మెక్‌నైట్‌కు సంస్థ 4.9 శాతం వాటా కేటాయించినట్లు ఆప్టికల్ ఆర్మోవర్ 2014లో దాఖలు చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఫ్లాష్ ఫోర్జ్ 2013లో యూకేకి చెందిన మరో కంపెనీ కాంపోజిట్ రెసిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ ఇద్దరు డైరెక్టర్లతో పాటు మెక్నైట్ కూడా ఆ సంస్థలో డైరెక్టర్‌గా చేరారు. నావల్ గ్రూపు వెబ్సైట్లు పేర్కొంటున్నదాని ప్రకారం..దాని భారతీయ భాగస్వాముల్లో ఫ్లాష్ ఫోర్జ్, సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లాష్ ఫోర్జ్, మరో ఫ్రెంచి గ్రూప్ కోయార్డ్ల జాయింట్ వెంచర్) ఉన్నాయి. దీనిపై ఇండియా టుడే మెక్‌నైట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. నావల్ గ్రూపుతో ఫ్లాష్ ఫోర్జ్ ఒప్పందం కుదుర్చుకోక ముందే రాహుల్ గాంధీకి చెందిన భారత, యూకే కంపెనీలు మూతపడినా.. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాలతో ఆయన మాజీ వ్యాపార భాగస్వామి.. భారత విదేశీ భాగస్వామిగా యూరప్ సంస్థల ద్వారా లబ్ధి పొందినట్లు స్పష్టమవుతోంది. రాహుల్ రక్షణ డీలర్‌గా బెటర్! కాంగ్రెస్ స్పందించాలన్న కేంద్రమంత్రి జైట్లీ రాహుల్æ గాంధీ సన్నిహితుడికి యూపీఏ హయాంలో రక్షణ శాఖ కాంట్రాక్టు కట్టబెట్టారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘బాకాప్స్ నుంచి రాహుల్ 2009లో బయటకు రాగా, భారత్‌లోని బాకాప్స్ 2010లో మూతబడింది. అయితే, మెక్నైట్, రాహుల్ సంబంధాలు కొనసాగాయి. యూపీఏ హయాంలో ఫ్రాన్సు సహకారంతో జలాంతర్గాములను నిర్మించే రక్షణ శాఖ కాంట్రాక్టు మెక్‌నైట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి అసలు కథ ఇది అని పేర్కొన్నారు. ‘ఇందులో రాహుల్ పాత్ర ఏమిటి? రక్షణ సామగ్రి డీలర్ అవుదామనుకున్నారా? కాంగ్రెస్ దీనిపై సత్వరం స్పందించాలి. రాజకీయాల్లో రావడం కంటే కూడా ఆయన రక్షణ రంగంలో డీలర్ అయితే బాగుండేది’ అని అన్నారు. -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
‘కేంద్రంలో యూపీఏ 3 ఖాయం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కేంద్రంలో యూపీఏ -3 కొలువుతీరుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా యూపీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడనున్నాయని జోస్యం చెప్పారు. 2009లో యూపీలో కాంగ్రెస్ 21 స్ధానాలను గెలుచుకున్న సందర్భం మరోసారి ఎదురవనుందని, అప్పటికన్నా అధికంగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. 2009లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 205 స్ధానాలను గెలుపొందగా అదే సంఖ్యలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించగా అందులో ఎలాంటి సందేహం లేదని సల్మాన్ ఖుర్షీద్ బదులిచ్చారు. పార్టీలో నూతన నాయకత్వం రాకతో కార్యకర్తలు, శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని, లోక్‌సభ ఎన్నికల అనంతరం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధితిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక ఆగమనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చెప్పారు. కాగా,ఫరక్కాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన సల్మాన్ ఖుర్షీద్ బీజేపీ సిటింగ్ ఎంపీ ముఖేష్ రాజ్పుట్, బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్‌ల నుంచి ముక్కోణ పోటీ ఎదుర్కొంటున్నారు. -
అధికారం మాదే
న్యూఢిల్లీ: డొల్ల వాగ్దానాలతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న రాజకీయాల్ని దేశ ప్రజలు తిరస్కరించారని, ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభ పరిష్కారం, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేలా అందులో చర్యలు ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థిక రంగ పరిపుష్టానికి కూడా రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తామని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సోదరి ప్రియాంక గాంధీ పోటీచేయాలని పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్లపై స్పందిస్తూ..ఎన్నికల్లో బరిలోకి దిగడంపై ఆమెనే ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాహుల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రజల గొంతుక వింటాం.. బీజేపీ–ఆరెస్సెస్‌లు తమ అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలు చెప్పేది వింటుంది. భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగ పరివర్తన, చిన్నస్థాయి వ్యాపారాలకు దన్నుగా నిలవడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా మా మేనిఫెస్టో ఉంటుంది. పరిశ్రమలకు పన్నుల బెడదను తప్పించడంతో పాటు చిన్న, మధ్యస్థాయి వ్యాపారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితే సామాన్యుడికి మేలు జరుగుతుంది. మోదీ బూటకపు వాగ్దానాలు, బీజేపీ వైఫల్యాలు లాంటివే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలైనా, మా ప్రణాళికలు, దేశానికి సంబంధించి మా దార్శనికత గురించి పంచుకోవడానికి చాలా ఉంది. 2014లో ఓటమి అనంతరం అధికార వికేంద్రీకరణతో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దాం. మోదీ హామీ వల్లే ‘న్యాయ్’ ఆలోచన 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చేసిన వాగ్దానం వల్లే కనీస ఆదాయ హామీ పథకం ఆలోచన తనకు వచ్చిందన్నారు. దేశంలోని నిరుపేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు జమచేసే న్యాయ్ పథకం ప్రకటించగానే మోదీలో కలవరపాటు మొదలైందన్నారు. మేమొస్తే నీతి ఆయోగ్‌ను రద్దుచేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌తో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని, ప్రధాని మోదీకి ప్రచారం చేస్తూ సమాచారాన్ని వక్రీకరించడానికే పరిమితమైందని ఆరోపించారు. -
‘యూపీఏ హయాంలో ఆ నీళ్లు తాగగలిగావా?’
ముంబై : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా(యూపీ తూర్పు విభాగం) బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె విమర్శలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రియాంక గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర యూపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. అలానే బీజేపీపై ప్రియాంక ప్రభావం గురించి ప్రశ్నించగా.. ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచరం చేయడం వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఒక వేళ నేను గనక అలహాబాద్ - వారణాశిల మధ్య వాటర్ వే మార్గాన్ని పూర్తి చేయకపోతే.. ఈ రోజు ఆమె ఈ గంగాయాత్ర చేయగలిగేదా. ప్రియాంక గంగా జలాన్ని కూడా తాగారు. అదే ఒక వేళ యూపీఏ హాయాంలో ఆమె గంగా నదిలో పర్యటిస్తే.. ఆ నీటిని తాగగలిగే వారా? ప్రస్తుతం మా ప్రభుత్వం గంగా నదిని శుద్ది చేసే కార్యక్రమాన్ని పార్రంభించింది. 2020 నాటికి గంగా నది నూటికి నూరు శాతం స్వచ్ఛంగా మారుతుంద’ని గడ్కరీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇటీవల ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్ వరకు గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రియాంక ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేసి గంగా నదికి హారతి ఇచ్చారు. అనంతరం గంగా జలాన్ని తాగారు. -
యూపీఏతో పోలిస్తే చవకే
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని తేల్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకు మోదీ సర్కారు ఒప్పందం కదుర్చుకున్నట్టు కాగ్ వెల్లడించింది. బుధవారం రాజ్యసభకు సమర్పించిన 141 పేజీల నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2007, 2015 కొనుగోలు ఒప్పందాలను పోల్చిచూసినట్టు కాగ్ తెలిపింది. రఫేల్ యుద్ధవిమానాల కోసం గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కారు జరిపిన సంప్రదింపుల్లో బేస్ ధరలో ఎటువంటి మార్పులేదని తేల్చింది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఆపరేషనల్ సపోర్ట్ నిర్వహణ 4.77 శాతం తగ్గింది. భారత అవసరాలకు తగినట్లు సాంకేతిక మార్పులు చేయడంలో 17.08 శాతం తగ్గుదల కనిపించింది. ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ 6.54 శాతం పెరిగింది. పనితీరు ఆధారిత విషయంలో 6.54 శాతం మెరుగుపడింది. టూల్స్, టెస్టర్స్, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌లో 0.15 శాతం పెరిగింది. ఆయుధాల ప్యాకేజీలో 1.05 శాతం తగ్గుదల నమోదైంది. పైలట్, సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం 2.68 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. అయితే ధరల వివరాలు వెల్లడించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యం గెలిచింది: బీజేపీ కాగ్ నివేదికపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సత్యం గెలిచిందని, ప్రతిపక్షాల కుట్రలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇకలైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని పేర్కొన్నారు. -
యూపీఏ కన్నా 9 శాతం చౌకకే
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విధంగా యూపీఏ ప్రభుత్వం డస్సాల్ట్‌తో కుదుర్చుకున్న ప్రాథమిక ధర, మేం అంగీకరించిన ధరను ఇంతకుముందే వెల్లడించాం. ధరల పెరుగుదల, ఇతర అంశాలను పోల్చి చూసినప్పుడు యూపీఏ హయాంలో ధర కంటే మా ప్రభుత్వం నిర్ణయించిన ధర 9% తక్కువ’ అని ఆమె చెప్పారు. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలన్న డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చారు. 2016లో కేంద్రం, ఫ్రెంచి ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాస్తవాలను దాస్తున్నారు: ఏకే ఆంటోనీ రాఫెల్ ఒప్పందం వివరాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దాస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆరోపించారు. ‘ఈ డీల్‌పై వాస్తవాలను వెలికితీసేందుకు సంయుక్త పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ వేయకుండా ప్రభుత్వం ఎందుకు ముఖం చాటేస్తోంది? జాతీయ భద్రతపై రాజీ పడి ఫ్రెంచి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. తక్కువకే ఒప్పందం కుదిరింటే 126 బదులు 36 విమానాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. -
రోజూ పెట్రో వాతలే!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయనే నెపంతో కేంద్రం ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుతోంది. క్రూడాయిల్ ధరలకు తోడు రూపాయి మారక విలువ పడిపోతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదల అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్షానికోసారి పెట్రో ధరలను సమీక్షించేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజు వారి సమీక్షకు తెరతీసింది. కొన్ని సందర్భాల్లో మినహా ధరలు తగ్గిన సందర్భం లేదు. ప్రస్తుతం పెట్రోలు రూ.85లకు చేరుకుంది. ఇలాగే పెరుగుతూ పోతే మరో మూడు నెలల్లో రూ.వంద చేరకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా ముడిఇంధన ధరలు పెరుగుతున్నాయని, రూపాయి మారక విలువ పడిపోతుండటంతో ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయని ఇంధన కంపెనీలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణభూతమవుతోంది. తామెలా బతకాలని చిరుద్యోగులు, ఆటో వాలాలు, వాహనాల యజమానులు వాపోతున్నారు. పన్నుల మోత...: కొత్త విధానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నారు. మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నారు. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ.6.50 , తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 తక్కువగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్ రూపంలో 28శాతం పన్ను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెట్రో ధరలు ఇక్కడ మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపం లో దాదాపు రూ.28 వరకు చెల్లించాల్సి వస్తోంది. అందులో ఏపీ వ్యాట్ రూ.6 నుంచి 8వరకు ఉంటోంది. ఎక్సైజ్ సుంకం తగ్గినా..: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 74 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు రోజూ 20 పైసల వరకు మార్పులు, చేర్పు లు చేస్తూ వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని లీటరకు రూ.2 తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ రేటు తగ్గించాలని సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్ వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ధరలు భరించలేం తమిళనాడు, కర్ణాటకతో పోలి స్తే రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతూ పోతే భరించడం కష్టం. – కృష్ణమోహన్, ప్రభుత్వ ఉద్యోగి ధరలను నియంత్రించాలి పెట్రోల్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. రోజువారి ధరల మార్పుతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. పదిహేను రోజులకోసారి ధర నిర్ణయించాలి. – రమణ, ఉపాధ్యాయుడు, కర్నూలు -
యూపీఏలో ‘ఫోన్కో లోన్’
న్యూఢిల్లీ: ఇష్టమొచ్చినట్లుగా రుణాలు మంజూరుచేసి గత యూపీఏ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. నిరర్థక ఆస్తుల పాపం మన్మోహన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. నామ్‌దార్(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి)లు ఫోన్లు చేసిన వెంటనే, వారి సన్నిహిత వ్యాపారులకు భారీగా రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. ఇలా ‘ఫోన్కొక లోన్’ చొప్పున యూపీఏ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని, దీంతో మొండిబకాయిలు పెరిగాయన్నారు. రుణ ఎగవేతదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని హామీనిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌మైన్‌పై ఉంచిన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో శనివారం ఇండియా పోస్ట్ పేమెంట్స్æ బ్యాంక్(ఐపీపీబీ)ని ప్రారంభించాక మోదీ మాట్లాడారు. సుమారు రూ.1.75 లక్షల కోట్ల నిర్థరక ఆస్తులుగా మిగిలిపోయిన రుణాల్లో ఏదీæ ఎన్డీయే హయాంలో మంజూరు కాలేదని తెలిపారు. బ్యాంకులను దోచుకున్నారు.. తిరిగిరాని మొండిబకాయిలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని, తామొచ్చి వాటిని గుర్తించి రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేశామన్నారు. నిరర్థక ఆస్తులను యూపీఏ రూ.2.5 లక్షల కోట్లుగా ప్రకటించి దేశాన్ని మోసం చేసిందని, వాటి విలువ రూ.9 లక్షల కోట్లని తెలిపారు. 2008–14 కాలంలో బ్యాంకు రుణాలు రూ.52 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకుముందు ఈ రుణాలు రూ.18 లక్షల కోట్లేనన్నారు. ‘నిబంధనలు పాటించకుండా రుణాలిచ్చారు. రుణాల పునర్ వ్యవస్థీకరణ పేరిట మరిన్ని రుణాలిచ్చారు. నామ్దార్ల నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌తో వారి సన్నిహిత వ్యాపారవేత్తలు భారీగా రుణాలు పొందారు. బ్యాంకుల ఉన్నతాధికారులను నియమించేది నామ్దార్లే కాబట్టి, వారి మాటకు తిరుగేలేద’ అని మోదీ అన్నారు. ఎమ్మెల్యే అయ్యాకే ఖాతా తెరిచా.. ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు క్రియాశీల బ్యాంకు ఖాతా లేదని మోదీ అన్నారు. చిన్నతనంలో బ్యాంకులో వేసేందుకు తగినంత నగదు లేకపోవడమే అందుకు కారణమన్నారు. పాఠశాల రోజుల్లో విద్యార్థులకు దేనా బ్యాంకు ఖాతా ఇచ్చిందని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో ఆ ఖాతాను ఖాళీగా ఉంచినట్లు గుర్తుచేసుకున్నారు. చివరకు 32 ఏళ్ల తరువాత బ్యాంకు అధికారులు తన వద్దకు వచ్చి ఖాతాను మూసేసేందుకు సంతకం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అయ్యాక జీతం తీసుకునేందుకు ఖాతాను తెరిచానన్నారు. ముంగిట్లోకి బ్యాంకింగ్ న్యూఢిల్లీ: సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్‌లతో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ప్రారంభించినదే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ). ఈ బ్యాంకు సేవలు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్డ్ లోన్స్), క్రెడిట్ కార్డుల వంటి సేవలు లేవు. రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు. ఐపీపీబీ విశేషాలు.. ► ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్ చెల్లింపులు, ట్రాన్స్ఫర్స్, ఏటీఎం, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్‌పార్టీ ఫండ్ ట్రాన్స్ఫర్స్ తదితర సేవలు అందిస్తాయి. ► డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ► వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరుస్తాడు. ► రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్జ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు. ► కౌంటర్ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజింగ్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఆధార్ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు, లావాదేవీలకు క్యూఆర్ కోడ్, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. ► లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్మార్ట్ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను సమకూరుస్తారు. ► ఈ బ్యాంకులో వంద శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లతో పోటీపడేలా ఐపీపీబీ మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది. ► ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిచివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్ పాయింట్లు నెలకొల్పనున్నారు. ► 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఎమర్జెన్సీ’ని గుర్తు చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛ గురించి మీరా మాట్లాడేది? వాహ్.. రాహుల్ జీ!. స్వతంత్ర భారతావనిలో విధించిన ఏకైకఅత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని మీకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామికవాదుల గొంతులను నొక్కింది ఎవరు? ప్రజాస్వామిక విలువలను మంటగలిపింది ఎవరు? మీ స్కాంగ్రెస్ పార్టీ కాదా?’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్లో ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు మంగళవారం కేటీఆర్ వరుస ట్వీట్లతో బదులిచ్చారు. తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద నువ్వు ఎవరికి నివాళులు అర్పించావో నీకు తెలుసా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. ‘‘తొలి దశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 1969లో ఇందిరా గాంధీ నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన 369 మంది యువకులతోపాటు తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించడంతో 2009–14 మధ్యలో ఆత్మబలిదానం చేసుకున్న యువకులు వారు’’అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మరణాలకు క్షమాపణ చెప్పరా? అని రాహుల్‌ను నిలదీశారు. ‘‘అవినీతి గురించి మాట్లాది నువ్వా? నీతో వేదిక పంచుకున్న సగం మంది కాం గ్రెస్ నేతలు సీబీఐ, ఇతర అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వారే. ఓహ్.. నేను మర్చిపోయా.. ఇది స్కాంగ్రెస్ పార్టీ కదా. ఆంగ్ల అక్షరం ‘ఏ’ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్..’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ నేతలు వేసిన, వేయించిన వందలాది కేసులు ఉపసంహరించేలా వారిని ఆదేశించాలని రాహుల్‌కు సూచించారు. లేకుంటే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే ముద్రపడుతుందన్నారు. -
విద్యుదీకరణలో యూపీఏ విఫలం
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం వల్లే దేశంలో సంపూర్ణ విద్యుదీకరణ లక్ష్యాలు ఆలస్యమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఇప్పటి వరకు విద్యుత్‌కు దూరంగా ఉన్న 2.67 కోట్ల కుటుంబాలకు కూడా ఈ ఏడాది చివరి నాటికి ఆ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకం లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇటీవల చిట్టచివరగా విద్యుదీకరణ జరిగిన మణిపూర్‌లోని లీసాంగ్ గ్రామస్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మోదీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఇది పదోది. 2009 నాటికే దేశంలోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢాంబికాలకు పోయారని మోదీ ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి 2005లో ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనను చదివి వినిపించారు. ఎప్పుడో పూర్తవ్వాల్సింది.. తాము అధికారంలోకి వచ్చే సరికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 18 వేలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘ప్రజలకు మంచి చేయాలనుకునే వారు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలి. నివేదికలు తయారుచేయాలి. పౌర సమాజాలతో మాట్లాడాలి. అలా చేస్తే 2010–11 నాటికే సంపూర్ణ విద్యుదీకరణ జరిగేది. కానీ అప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు లేకపోవడం వల్ల ఆ వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయి. మేము ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, తప్పు లు వెతకడానికి విపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. వాళ్లకు వెలుగుంటేనే ఉపాధి.. విద్యుత్ సౌకర్యం లేని ఇళ్ల గురించే ప్రతిపక్షాలు మాట్లాడటం తమను విమర్శించడం కాదని, వారిని వారే విమర్శించుకోవడమని మోదీ అన్నారు. ‘70 ఏళ్లు దేశాన్ని నడిపిన వారిదే ఈ వైఫల్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. 4 కోట్ల కుటుంబాలకు వి ద్యుత్ సౌకర్యం లేదంటే.. దాని అర్థం గతంలో వారికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను మా ప్రభుత్వం తొలగించిందని కాదు. సున్నా నుంచి మొదలుపెట్టి విద్యుదీకరణకు మౌలిక వసతులు సమకూరుస్తున్నాం. రోజులో మొత్తం సమయా న్ని 12 గంటలకు కుదిస్తే అన్ని పనులు పూర్తవుతాయా? మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యే వారికి ఉపాధి దొరుకుతోంది. పగటిపూ ట వెలుగును ఆధారంగా చేసుకునే వారి పని గంటలను నిర్ణయిస్తున్నారు’ అని అన్నారు. -
బయ్యారం ఉక్కు భిక్ష కాదు.. హక్కు
రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుప ర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పిం చడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్ హామీనిచ్చిన కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురౌతున్నం దున ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా ఉక్కు పరిశ్ర మను ఇస్తామని చట్టంలో చేర్చింది. విభజన చట్టం లోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటిం చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటినుంచి టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. త్వరలో బయ్యారానికి తీపి కబురు చెపుతామని కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి మీడియా ముందు ప్రకటించటం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసర మైన వనరులన్నీ సమకూర్చుతామని, ముడి ఖనిజం రవాణా కోసం జగదల్పూర్ నుంచి రైల్వే లైన్ నిర్మా ణానికి పరిశీలన కోసం 2 కోట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఇలా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వాలు 4 ఏళ్ల నాటకానికి తెర వేస్తూ తాజాగా పరిశ్రమ పెట్టే అవకాశమే లేదని స్పష్టీక రిం చారు. ఇది విభజన హామీని తుంగలో తొక్కి తెలం గాణ ప్రజలను మోసం చేయడమే. యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పొందుపర్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల నిర్మాణంపై మొదటినుండి సాకులు చెపుతూ కాలం గడుపుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడం లేదని, బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమ నిర్విఘ్నంగా నడవడానికి సరిపోదని తదితర సాకులు చెబుతూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమేనను కున్నా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా నుంచి నాణ్యత కలిగిన ఇనుప ఖనిజాన్ని దిగుమని చేసుకుంటామని, అందుకు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంది. అయినా, పరిశ్రమ పెట్టడానికి అభ్యంతరమేమిటి? 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిన ఉక్కు పరిశ్రమ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నదే నిజం. అప్పుడప్పుడు మాట వరసకు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి వల్లెవేయడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్, ఆయన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. పైగా సెయిల్ ముందుకు రానందున బయ్యారం స్టీల్స్‌ను జిందాల్‌కు ఇస్తామని, సిద్ధంగా ఉండమని ఆ కంపెనీ అధికారులకు మీడియా ముందే చెప్పారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరి శ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చట్ట బద్ధంగా రావల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది.బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ, దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడి ఉక్కును పాలకులు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా ఉద్య మాల ద్వారా అడ్డుకున్న చరిత్ర ఉంది. 1 లక్షా 46 వేల ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నది. తెలంగాణ ఉద్యమ శక్తులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధ హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఈ హక్కు సాకారం అయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించాలి. గౌని ఐలయ్య, కన్వీనర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి, జడ్పీటీసీ ‘ 94907 00955 -
సీఎంలిద్దరూ ‘భరత్ అనే నేను’ చూడాలి
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులపై బీజేపీ అసత్యప్రచారం చేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో స్కామ్‌లను కూడా కమ్యూనిస్టులకు అంటకడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయట పెడతామని, విదేశాల నుంచి డబ్బు తెస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీయిచ్చారని కానీ అధికారంలోకి వచ్చి చేసిందేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారన్నారు. యూపీఏ హయాంలో జైళ్లలో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన అనుచరులు 9 మందికి, తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారని తెలిపారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘బాబు, కేసీఆర్ భరత్ అనే నేను సినిమా చూడాలి’ ‘భరత్ అనే నేను’ సినిమాను చంద్రబాబు, కేసీఆర్ జనంలో కూర్చోని చూడాలని, ముఖ్యంగా ఏపీ సీఎం చూడాలని రామకృష్ణ సూచించారు. ‘కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. బాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న భూములు 7 ప్రైవేట్ కాలేజీలకు దోచిపెట్టారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఎన్నికలు పెట్టడంలేద’ని మండిపడ్డారు. కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. బాబు సూటు బూటు ఉంటేనే కలుస్తారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారా లేక రాచరికం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా కేంద్రానికి నిరసనగా రాత్రి 7 గంటలకు అరగంట పాటు బ్లాక్ డే పాటిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని అరగంట లైట్లు బంద్ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. అందరూ బ్లాక్ డేకు సహకరించి స్వచ్చందంగా నిరసన తెలపాలని కోరారు. -
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్‌కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
2జీ తీర్పుపై మన్మోహన్ కామెంట్స్..!
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన 2జీ స్పెక్టం కుంభకోణంపై పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పందించారు. 2జీ స్కాం నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2జీ స్కాం యూపీఏ సర్కారును అతలాకుతలం చేసింది. ఈ స్కాంలో నిందితుడిగా ఉన్న అప్పటి టెలికం మంత్రి ఏ రాజా, యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 'తీర్పు చాలా సుస్పష్టంగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్రస్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తీర్పు స్పష్టం చేసింది' అని మన్మోహన్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులు, కామన్వెల్త్ క్రీడల వంటి విషయాల్లో జరిగిన కుంభకోణాలు యూపీఏ సర్కారును తీవ్రంగా కుదిపేశాయి. -
మెండిబకాయిలు యూపీఏ నిర్వాకమే
-
ఫుట్బాల్లా ఆడేసుకుంటున్నారు: మాల్యా
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా మరోమారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ఫుట్‌బాల్ గేమ్ లాగా ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండానే తాను టీమ్ యూపీఏకు, టీమ్ ఎన్డీయేకు ఓ ఫుట్బాల్లాగా మారినట్టు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్‌కు రప్పించాలని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేతగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద నుంచి వేలకోట్ల రుణాలు తీసుకొని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కావాలనే వక్రీకరించిన ఈ-మెయిల్స్‌ను మీడియాకు విడుదల చేసిందని, తనకు, యూపీఏ పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలకు పాల్పడిందని మాల్యా శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్‌మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సాయడ్డారని బీజేపీ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉందని తెలిసి కూడా కింగ్ఫిషర్కు రుణాలు ఇప్పించారని విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించిన పత్రాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా ముందుకు తీసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన మాల్యా తాను ఒక ఫుట్బాల్నని, న్యాయనిర్ణేత ఎవరూ లేకుండానే ఎన్డీయే, యూపీఏ టీమ్‌లు తనను ఆడుకుంటున్నాయని విమర్శించారు. సీబీఐ ఆరోపణలపై తాను షాక్ కి గురయ్యానని, బిజినెస్, ఎకనామిక్స్ గురించి పోలీసులకు ఏమి తెలుసని మాల్యా మండిపడ్డారు. -
అప్పుడు ఎలా చేశారు?
2012 బడ్జెట్ ఆలస్యంపై కేంద్రాన్ని కోరిన ఈసీ న్యూఢిల్లీ: 2012లో కేంద్ర బడ్జెట్ ఆలస్యంగా ప్రవేశపెట్టడానికి ఎటువంటి విధానాలు పాటించారో తెలపాలని ఎన్నికల కమిషన్ కేబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది. దీనిపై శుక్రవారం ఉదయంలోగా వివరాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం. దీంతోపాటు బడ్జెట్ రూపకల్పనలోనూ, ప్రవేశపెట్టడంలోనూ ఉండే వివిధ దశలకు సంబంధించిన సమగ్రసమాచారాన్నికూడా అందజేయాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. 2012లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలని విపక్షాలు ఎన్నికల కమిషన్ ను కోరాయి. దీనిపై ఈసీ కేంద్రాన్ని వివరణ కోరింది. -
కాంగ్రెస్‌కు మాజీ సైనికాధికారి షాక్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని.. కాకపోతే అప్పట్లో తమ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ నాయకుల్లా ప్రచారం చేసుకోలేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు... మాజీ డీజీఎంఓ పెద్ద షాకిచ్చారు. గతంలో కేవలం సరిహద్దుల వెంబడి మామూలు దాడులే జరిగాయని, అసలు ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కు, వాటికి ఏమాత్రం సంబంధం లేదని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా బాంబు పేల్చారు. ''ఇవి చాలా సున్నితమైనవి, పక్కా లక్ష్యం కేంద్రంగా చేసినవి, మన దేశ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఇంతకుముందు నియంత్రణ రేఖ వెంబడి జరిగిన దాడులకు వీటికి అన్ని రకాలుగా చాలా తేడా ఉంది'' అని భాటియా వెల్లడించారు. ఆయన 2012 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌గా వ్యవహరించారు. 2011 సెప్టెంబర్ 1, 2013 జూలై 28, 2014 జనవరి 14 తేదీలలో కూడా యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ వాదిస్తోంది. సర్వసాధారణంగా జరిగే దాడులను కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఎన్డీయే ప్రభుత్వం తెగ గుండెలు బాదేసుకుంటోందని విమర్శించింది. అయితే.. దీనిపై నడుస్తున్న రాజకీయాల జోలికి తాను పోనని, అప్పట్లో జరిగిన ఆపరేషన్స్‌ను, ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఏమాత్రం పోల్చలేమని మాత్రమే తాను చెబుతున్నానని లెఫ్టినెంట్ జనరల్ భాటియా అన్నారు. ఇంతకుముందు జరిగిన దాడులకు కూడా మంచి ముందస్తు ప్రణాళిక ఉన్నా.. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా మన జాతీయ శక్తిలోని అన్ని అంశాలూ ఒక్కటిగా కలిశాయని తెలిపారు. దౌత్య, ఆర్థిక, సమాచార యుద్ధతంత్రం.. ఇలా అన్నీ కలిశాయని చెప్పారు. ఉడిలో ఉగ్రదాడి జరిగి 19 మంది సైనికులు మరణించిన తర్వాత.. భారత దేశ సహనం చచ్చిపోయిందని, అందుకే మనం గీత దాటామని ఆయన తెలిపారు. ఒకేసారి నియంత్రణ రేఖకు అవతల పలు లక్ష్యాల మీద దాడులు జరిగాయని, బంబెర్ నుంచి పీర్ పంజల్‌కు రెండువైపులా కూడా మన బలగాలు మోహరించాయని, సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని లెఫ్టినెంట్ జనరల్ భాటియా వివరించారు. -
'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షా 93 వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 9 లక్షల 35వేల ఇళ్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసినట్టు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వెంకయ్య స్పష్టం చేశారు. -
దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను హత్య చేయించినా చేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు పక్కన పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్యస్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌తోనే మొదలు కాలేదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘నన్ను ఖతం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చింది’ అని మోదీ 2010లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను వివిధ కేసుల్లో కేంద్రం ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కేజ్రివాల్ అసహనం వ్యక్తంచేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాష్ర్ట ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలాగా సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లే అవకాశం లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఏనాడూ లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కీలుబొమ్మ ముఖ్యమంత్రులనే పెట్టుకొంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా కొనసాగిన రోజుల్లోనూ ఇదే కొనసాగింది. స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నీరుగార్చేందుకే ప్రయత్నించింది. ‘కోఆపరేటివ్ ఫెడరలిజమ్ (సహకార సమాఖ్యవాదం)’ తమ ప్రభుత్వ విధానాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు హర్షించారు. ఇప్పుడు వివిధ కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగమని అదే ప్రజలు భావిస్తున్నారు. మాటలు వల్లించడమే కాదు, చేతల్లో చూపించినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు. --ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
'మేం రెండేళ్లలో అవినీతిని దూరం చేశాం'
ఢిల్లీ: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. కాగా, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. -
మసూద్‌పై మళ్లీ రెడ్‌కార్నర్
పఠాన్‌కోట్ కేసులో ఎన్ఐఏ సాక్ష్యాల ఆధారంగా ఇంటర్‌పోల్ జారీ న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి నిషిద్ధ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌పై ఇంటర్‌పోల్ మంగళవారం తాజా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈదాడికి మసూద్, రవూఫ్‌లు కుట్రపన్నారన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు పొందిన నేపథ్యంలో ఈ తాజా నోటీసును జారీ చేశారు. నాటి ఉగ్ర దాడిలో దాదాపు 80 గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మసూద్, రవూఫ్‌లపై ఇంతకుముందు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ల విషయంలో పాక్ స్పందించలేదు. దీంతో తాజా రెడ్ కార్నర్ నోటీసులను లాంఛనంగానే పరిగణిస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న అజహర్‌పై.. భారత పార్లమెంటుపై, జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడికుట్ర ఆరోపణల్లో గతంలో రెడ్‌కార్నర్ నోటీసులు ఉన్నాయి. రవూఫ్‌పై 1999లో విమానం హైజాక్‌కు సంబంధించి అదే తరహా వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఉగ్రవాదులకు, జైషే నేతలైన జాన్, లతీఫ్‌లకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు, ఆ దాడి తమ పనేనంటూ రవూఫ్ పేర్కొన్న వీడియో దృశ్యాలను ఎన్ఐఏ సమర్పించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు నేతృత్వం వహించిన కాషిఫ్, షాహిద్ లతీఫ్ పైనా రెడ్ కార్నర్ నోటీసులను ఎన్ఐఏ కోరింది. 2010లోనే లతీఫ్విడుదల న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్‌లో ఎలా చొరబడ్డారన్న దానిపై దర్యాప్తు అధికారులు సమాచారాన్ని వెలికితీశారు. ఆదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మద్దతు అందించిన జైషే నేత షాహిద్ లతీఫ్(47)ను 2010లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం విడుదల చేసింది. పాక్కుచెందిన లతీఫ్.. 1996లో జమ్మూలో అరెస్టయ్యాడు. పాక్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే చర్యల్లో భాగంగా లతీఫ్‌ను, మరో 20 మంది పాక్ ఉగ్రవాదులను ఆరేళ్ల కిందట నాటి యూపీఏ ప్రభుత్వం విడుదల చేసింది. -
వాడుకలో లేని పీఎఫ్ ఖాతాలకూ వడ్డీ
ఏప్రిల్ 1 నుంచి అమలు న్యూఢిల్లీ: వాడుకలో లేని (ఇనాపరేటివ్) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోనూ ఏప్రిల్ 1 నుంచి వడ్డీ జమచేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. ఇది దాదాపు రూ. 32వేల కోట్ల మేర డి పాజిట్లున్న సుమారు 9 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలోని ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వాడుకలో లేని ఖాతాలకు వడ్డీ చెల్లింపులను నిలిపివేసిందని, తాము ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ఇకపై వాడుకలో లేని ఖాతాలంటూ ఉండబోవన్నారు. 36 నెలల పాటు చందాలు జమ కాని ఖాతాలను ఇనాపరేటివ్ ఖాతాలుగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ ఆశతో ఖాతాల నుంచి డబ్బు తీసుకోకుండా, ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండటాన్ని అరికట్టే ఉద్దేశంతో యూపీ ఏ ప్రభుత్వం ఇనాపరేటివ్ ఖాతాలపై వడ్డీ ఇవ్వరాదని నిర్ణయిం చింది. తదనుగుణంగా 2011 ఏప్రిల్ 1 నుంచి ఇటువంటి వాటికి వడ్డీ చెల్లింపులు నిల్చిపోయాయి. పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరం 8.8 శాతం వడ్డీ రేటు ఇచ్చే ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు దత్తాత్రేయ తెలిపారు. -
బొగ్గు స్కాంలో తొలి తీర్పు
జేఐపీఎల్, ఆ సంస్థ ఇద్దరు డెరైక్టర్లను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ♦ నేరపూరిత ఉద్దేశంతో భారత ప్రభుత్వాన్ని మోసం చేశారని స్పష్టీకరణ ♦ ఈ నెల 31న శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు న్యూఢిల్లీ: ఒకరకంగా యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైన బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు వెలువడింది. మోసపూరితంగా, నేరపూరిత కుట్రతో, అక్రమంగా బొగ్గు క్షేత్రం కేటాయింపును పొందారని జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్(జేఐపీఎల్) సంస్థను, ఆ సంస్థ డెరైక్టర్లు ఆర్సీ రుంగ్తా, ఆర్ఎస్ రుంగ్తాలను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టుహాల్లోనే ఉన్న దోషులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు వినేందుకు జడ్జి భరత్ పరాశర్ విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను పొందేందుకు జేఐపీఎల్, ఆ సంస్థ డెరైక్టర్లు భారత ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా రుజువైందని ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన 132 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 420 సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ఫోర్జరీ ఆరోపణల సెక్షన్లను మాత్రం మినహాయించింది. ‘నిందితులు ఉద్దేశపూర్వకంగా, నేరపూరిత కుట్రతో తప్పుడు పత్రాలను.. సంస్థ అర్హతలు, సామర్ధ్యాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి స్క్రీనింగ్ కమిటీని, బొగ్గుమంత్రిత్వ శాఖను తద్వారా భారత ప్రభుత్వాన్ని మోసం చేశారు. తప్పు అని తెలిసీ, నిజాలుగా ఆ వివరాలను స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు’ అని కోర్టు తేల్చిచెప్పింది. ‘నిందితులు తమ ముందుంచిన సమాచారాన్ని వాస్తవమని నమ్మడం వల్ల జేఐపీఎల్‌కు బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలంటూ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు ఆధారంగా బొగ్గు శాఖ జార్ఖండ్‌లోని ‘నార్త్ ధాతు కోల్ బ్లాక్’ను మరో మూడు సంస్థలతో పాటు జేఐపీఎల్‌కు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు నమ్ముతోంద’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాము సేకరించిన భూమికి సంబంధించిన వివరాలను కూడా నిందితులు సమయానుకూలంగా మార్చినట్లుగా తేలిందన్నారు. భూ సేకరణకు సంబంధించిన ఒప్పంద పత్రం కూడా నకిలీదేనని గట్టి అనుమానాలున్నాయన్నారు. పరిమితంగా లభ్యమయ్యే సహజ వనరైన బొగ్గు విలువను దృష్టిలో పెట్టుకుని.. నిందితులు తమ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన బొగ్గును ఎక్కువగా చూపారన్నారు. తమ దరఖాస్తుకు అధిక ప్రాధాన్యం లభించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారన్నారు. ఈ కేసులో బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులను నిందితులుగా చేర్చకపోయినంత మాత్రాన, వీరి నేర తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు. ఈ కేసు కాకుండా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు చేసిన మరో 19 కేసులు, ఈడీ పరిథిలో ఉన్న మరో రెండు కేసులు ప్రస్తుతం ప్రత్యేక కోర్టు విచారణలో ఉన్నాయి. -
మోదీని ఇబ్బంది పెట్టేందుకే!
న్యూఢిల్లీ: ఇషత్ర జహాన్ ఎన్కౌంటర్ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మాయం చేసి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని ఇబ్బందులు పెట్టేందుకే ప్రయత్నించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో తెలిపారు. ఇషత్ లష్కరే తోయిబా ఉగ్రవాది అనివిచారణలో వెల్లడైనా.. మోదీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాస్తవాలను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇషత్ర కేసుపై సావధాన తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం వాస్తవాలను మరుగున పడేసిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఓ పక్క విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా.. చిదంబరంపై దాడిని కొనసాగించారు. ‘ఉగ్రవాదానికి రంగు, మతం, జాతి ఉండవు. కానీ సెక్యులర్ అని చెప్పుకునే వాళ్లు ఉగ్రవాదానికి రంగు పూస్తారు.’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ముంబై కోర్టు ముందు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం, యూపీఏ సర్కారు ఆగస్టు6, 2009న గుజరాత్ హైకోర్టు ముందు దాఖలు చేసిన తొలి అఫిడవిట్ వంటి వాటిని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘హెడ్లీ వెల్లడించింది.. ఇషత్ర లష్కరే ఉగ్రవాదని తేల్చి చెప్పిన రెండో ఆధారం. మొదటిది.. యూపీఏ తొలి అఫిడవిట్లోనే స్పష్టమైంది’ అని అన్నారు. అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి.. మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై రాసిన లేఖ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. దీనిపై తమ శాఖలో అంతర్గత విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై సరైన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. -
టార్చర్ పెట్టి సంతకం చేయించుకున్నారు!
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ వ్యవహారంలో గత యూపీఏ ప్రభుత్వం మళ్లీ ఇరకాటంలో పడింది. అత్యున్నతస్థాయిలో వచ్చిన రాజకీయ ఒత్తిడుల కారణంగానే ఇష్రత్ జహాన్ కేసు రెండో అఫిడవిట్లో మార్పులు చేసినట్టు మాజీ బ్యూరోక్రాట్ ఒకరు వెల్లడించారు. ఇష్రత్ జహన్ ఎన్కౌంటర్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇష్రత్ జహాన్, జావేద్ షైక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై, జీషాన్ జోహర్, అంజద్ అలి రాణాలు ఉగ్రవాదులేనని మొదటి అఫిడవిట్లో పేర్కొన్న యూపీఏ సర్కారు సరిగ్గా రెండు నెలల్లోనే యూ టర్న్ తీసుకొంది. ఆ నలుగురు ఉగ్రవాదులు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ రెండో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. అయితే తనను భౌతికంగా హింసించడంతోనే ఆ రెండో అఫిడవిట్ తాను సంతకం చేశానని ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్గత భద్రత విభాగం అండర్ సెక్రటరీగా పనిచేసి రిటైరైన ఆయన.. రాజకీయ ఒత్తిడుల కారణంగానే తాను రెండో అఫిడవిట్‌పై సంతకం చేసినట్టు చెప్పారు. ఇష్రత్ కేసులో ఆధారాలను కల్పితంగా సృష్టించారని, అంతేకాకుండా గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల పేర్లను కూడా ఈ కేసులో ఇరికించాలని సిట్ తనపై ఒత్తిడి చేసిందని ఆయన వెల్లడించారు. ఇష్రత్ జహాన్ కేసులో పత్రాల ఆధారంగా స్పష్టమైన అఫిడవిట్ రూపొదిస్తుంటే అప్పటి సీబీఐ అధికారి సతీశ్ శర్మ జోక్యం చేసుకొని తనను భౌతికంగా వేధించాడని, తన తొడలపై సిగరెట్ పీకలతో కాల్చేవాడని ఆయన వెల్లడించారు. తొలి అఫిడవిట్ ను తాను ఆమోదించలేదని చెప్తున్న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. మాజీ బ్యూరోక్రాట్ ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఇష్రత్ జహాన్ కేసు ద్వారా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని టార్గెట్‌గా చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. -
‘ఇష్రత్’రెండో అఫిడవిట్ సరైనదే
♦ తనే బాధ్యత తీసుకుంటానన్న చిదంబరం ♦ పిళ్లైకీ అందులో భాగముందని వ్యాఖ్య ♦ 2009 నాటి నివేదికను పరీక్షించనున్న హోంశాఖ న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2004నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో రెండో అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు వందశాతం వాస్తవమని కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు చేస్తున్నా.. తన మాటకు కట్టుబడి ఉన్నట్లు చిదంబరం వెల్లడించారు. ‘ఆ ఘటన నివేదిక వచ్చినపుడు (2009లో) కేంద్ర హోం మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. నాకెంత బాధ్యత ఉందో హోం శాఖ కార్యదర్శిగా ఆయన (జీకే పిళ్లై) బాధ్యత కూడా అంతే. కానీ ఆయన తన వివాదం నుంచి తప్పించుకుంటున్నారు. ఆయన వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసింది’ అని చిదంబరం అన్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి అఫిడవిట్ అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నందునే రెండో అఫిడవిట్‌ను కోరాల్సి వచ్చింది. నిఘా వర్గాలు సేకరించిన సమాచారంపైనే కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేసిందని.. ఇలాంటి నివేదికలను సాక్ష్యంగా పరిగణించలేమని చిదంబరం అన్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనికి కేంద్రం బాధ్యత వహించదన్నారు. ‘నా ప్రమేయం లేకుండానే తొలి అఫిడవిట్ సిద్ధమైంది. అందులో వాస్తవాలు లేవనిపించింది. హోం సెక్రటరీ, ఐబీ డెరైక్టర్, ఇతర అధికారులతో కలసి చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే రెండో అఫిడవిట్ సిద్ధమైంది’ అని చిదంబరం తెలిపారు. అయినా రెండో అఫిడవిట్‌లోని ఏ విషయం తప్పుగా ఉందో తనకర్థం కాలేదన్నారు. ఇది వందశాతం సరైనదే. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకుని పూర్తిగా సమీక్షించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2009లో తొలి అఫిడవిట్ దాఖలు చేసినపుడు ఇషత్‌త్రో సహా చనిపోయిన వారంతా లష్కరే ఉగ్రవాదులని పేర్కొనగా.. రెండు నెలల తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్లో వారు ఉగ్రవాదులనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు, అఫ్జల్ గురు ఉరితీత తమ ప్రభుత్వ హయాంలోనే జరిగినా.. అది సరైన నిర్ణయం కాదని తనకు అనిపించిందన్నారు. అఫ్జల్‌ది దేశవ్యతిరేకం.. రాజద్రోహం కాదని చిదంబరం పునరుద్ఘాటించారు. మరోవైపు, ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్లో యూపీఏ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్, ఇతర పత్రాలను కేంద్ర హోం శాఖ పరిశీలించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు లభించలేదని.. అవి ఎక్కడున్నాయో తెలియటం లేదని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌కు కట్టుబడి ఉన్నాం
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సందర్భంలో బీజేపీ ఇచ్చిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ హామీకి కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో ఏడాదికి రూ.7,483 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకానికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వం 21 శాతం ఎక్కువ కేటాయించిందని వివరించారు. ఇదే కాకుండా రూ.10,500 కోట్ల బకాయిలను నాలుగు విడతల్లో అందజేస్తామని తెలిపారు. పాకిస్తాన్‌ను ఐఎఫ్ఆర్కు ఆహ్వానించామని, ఎందుకు రాలేదో తెలియదని ఆయన చెప్పారు. సర్‌క్రీక్ వివాదం మినహా పాకిస్తాన్‌తో ఎలాంటి సమస్యలు ప్రస్తుతానికి లేవన్నారు. సియాచిన్ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఇంతవరకూ అక్కడ వెయ్యిమంది సైనికుల్ని కోల్పోయామన్నారు. ఇకమీదట ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సముద్ర వివాదాల పరిష్కారానికి ఓ ఏజెన్సీ ఉండాలన్నారు. ఐఎఫ్ఆర్కు బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, కంగనా రనౌత్‌లను ఆహ్వానించడం నేవీ తీసుకున్న నిర్ణయమని ఓ ప్రశ్నకు సమాధానంగా పారికర్ చెప్పారు. ఐఎఫ్ఆర్కు వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తూ రక్షణ శాఖ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. వారు కేవలం నేవీ ఆహ్వానం మేరకు అతిథులుగానే వచ్చినట్లు భావిస్తున్నానన్నారు. సముద్ర వివాదాలు సమసిపోవాలి ప్రపంచ దేశాల మధ్య సముద్ర వివాదాలు సమసిపోవాలని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆకాంక్షించారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ మారిటైమ్ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన పారికర్ దేశ, విదేశ నేవీ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. సముద్ర సరిహద్దులు మనుషులు పెట్టుకున్నవేనని, గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి, సరిహద్దులు మారుతున్నాయని అన్నారు. ఆర్థిక ముఖచిత్రం కూడా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర వనరుల్ని సమగ్రంగా వినియోగించుకోవాలని, వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పెరిగిపోతున్న సముద్ర దొంగల బెడద, ఉగ్రవాదాన్ని నౌకాదళాలు ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నౌకాదళాలన్నీ సమష్టిగా వాటిని ఎదుర్కోవాలన్నారు. ఇందులో భాగంగా నౌకాదళాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. భారత్ ఇప్పటికే అనేక దేశాలతో సమాచార మార్పిడి ప్రక్రియ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో మరిన్ని దేశాలతో సమాచార మార్పిడి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
మోదీకి ఆ విషయం తెలియదా?
అనంతపురం: పార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ పైనే ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లి బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. ప్రధాని మోదీకి ఈ విషయం తెలియదా? అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకు మోదీ హామీ నిలబెట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి కేంద్రం హామీ ఇచ్చి నిలబెట్టుకోలేక పోవడం ఇదే ప్రథమమని రాహుల్ దుయ్యబట్టారు. -
‘ఉపాధి హామీ’ దేశానికే గర్వకారణం
మోదీ సర్కారు ప్రశంసలు ♦ పథకానికి నేటితో పదేళ్లు పూర్తి ♦ బలోపేతం చేస్తామని ప్రకటన ♦ నేడు ఎంజీఎన్ఆర్ఈజీఏ సమ్మేళన్ న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ పేదలకు ఏటా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించేందుకు గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ చీఫ్(జాతీయ సలహా మండలి చైర్పర్సన్ హోదాలో) సోనియా గాంధీ లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును తొలుత విమర్శించిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం మాత్రం పొగడ్తలతో ముంచెత్తింది. పథకం సాధించిన దశాబ్ది ఫలితాలు దేశానికే గర్వకారణమని, సంబరాలు చేసుకోదగ్గవని ప్రశంసించింది. పథకం నిబంధనలను భవిష్యత్తులో తాము సరళీకరించడంతోపాటు దాని అమలును బలోపేతం చేస్తామని...పేదల లబ్ధికి దోహదపడే ఆస్తుల నిర్మాణం చేపట్టడంపై దృష్టిసారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించనున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ సమ్మేళన్-2016లోఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించి ఆయన పలు ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు వంద రోజుల పని దినాలకు అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. కాగా ఈ పథకం కోసం అదనంగా రూ.5వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రావ్ బీరేంద్ర సింగ్.. జైట్లీకి లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 45.88 కోట్లు, మూడో క్వార్టర్లో 46.10 కోట్ల పనిదినాలు సృష్టించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. 57 శాతం మిహ ళలే పథకం కింద లబ్ధి పొందారంది. నేడు బండ్లపల్లి గ్రామానికి రాహుల్ ఉపాధి హామీ పథకం పదేళ్ల సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. ఉపాధి హామీ పథకం అమలు వివరాలు ఇప్పటి వరకూ ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించిన వేతనాలు రూ. 3,13,844 కోట్లు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు17శాతం, మహిళలు 57శాతానికి పెరుగుదల. కార్మికులకు లభించిన పనిదినాలు 1980కోట్లు. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పనులు 65 శాతం. -
మోదీ సర్కారు కొత్తగా చేసిందేంటి?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రవేశపెట్టిన తయారీ విధానంను 'మేకిన్ ఇండియా'గా మార్చారని తెలిపారు. నిర్మల్ భారత్ కు స్వచ్ఛ భారత్ గా నామకరణం చేశారని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకం పేరును స్కిల్ ఇండియా మార్చారని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇతర పథకాల పేర్లు కూడా ఇలాగే మార్చేశారని చెప్పారు. మోదీ సర్కారు కొత్తగా ప్రజలకు చేసిందేముందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోని వచ్చిన 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. 26/11 దాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తైన నేపథ్యంలో తీవ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. -
అన్నదాతకు మరో వెన్నుపోటు!
స్వామినాథన్ సిఫారసుల అమలుపై కేంద్రం దొంగాట సాక్షి, హైదరాబాద్: ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి.. వీటికితోడు పాలకుల నిర్లక్ష్యం! ఆరుగాలం కష్టపడ్డా అప్పుల కుప్పలు.. వెరసి వ్యవసాయంలో సంక్షోభం.. పంటచేనులో మరణ మృదంగం! ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుస్థితిని మార్చేందుకు రైతు సమస్యలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కారాలను ప్రతిపాదించిన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదికను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ సర్కారు దాన్ని పూర్తిగా అటకెక్కించింది. స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ రైతు కమిషన్ (ఎన్సీఎఫ్) సిఫార్సులను ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించడం రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్సీఎఫ్ నివేదికను మొత్తంగా తిరస్కరించారా లేక ఒక్క కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) విధానాన్ని మాత్రమే పక్కన బెట్టారా అనేది తెలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నివేదిక అమలు కోరుతూ పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంఎస్పీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని నినదిస్తున్నాయి. రైతుకు మార్కెట్ ధర రానప్పుడు రక్షణగా ఉండాల్సిన ఎంఎస్పీ విధానం అన్నదాతల్ని మోసం చేసే లా ఉందని మండిపడుతున్నాయి. కమిషన్ ఏం చెప్పిందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంతో దిక్కుతోచక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం 2004 నవంబర్ 1న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన రైతు జాతీయ కమిషన్ (ఎన్సీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన అనేక అంశాలపై అది అధ్యయనం చేసింది. రైతు క్షోభకు కారణాలను విశ్లేషించింది. భూ సంస్కరణల ఆవశ్యకతను, బంజరు భూముల పంపిణీని నొక్కిచెప్పింది. జాతీయ భూ వినియోగ సలహా సర్వీసును ఏర్పాటు చేయాలని కోరింది. వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రత, రుణ పరపతి విధానం, బీమా సౌకర్యం, రైతు ఆత్మహత్యల నివారణ చర్యలు సూచిస్తూ సమగ్ర నివేదికను రూపొందించింది. చిన్నచిన్న కమతాలున్న వ్యవసాయదారుల్లో సమర్థతను పెంచి దిగుబడులను పెంచేందుకు సూచనలు చేసింది. వాటిల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం. వరి, గోధుమలే కాకుండా ఇతర ధాన్యాలనూ ఎంఎస్పీ పరిధిలోకి తీసుకురావాలని, పోషక విలువలున్న చిరు, తృణ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలోకి శాశ్వతంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది. పంటలకు అయ్యే సగటు ఉత్పత్తి వ్యయంతో పాటు అదనంగా కనీసం 50 శాతాన్ని కలిపి ఎంఎస్పీని నిర్ణయించాలని పేర్కొంది. ఈ కమిషన్ నివేదికను కొన్ని సవరణలతో యూపీఏ ప్రభుత్వం 2007లో ఆమోదించినా అమలు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెబుతోంది?: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున రాహుల్ శర్మ అనే అధికారి గతనెల 31న ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ఎంఎస్పీ నిర్ణయించే విషయంలో స్వామినాథన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించలేదు. వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) ఎంఎస్పీని సిఫార్సు చేస్తున్నందున స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం లేదు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఎంఎస్పీ, ఉత్పత్తి వ్యయాన్ని ఆటోమేటిక్‌గా అనుసంధానం చేస్తే మార్కెట్ దెబ్బతింటుంది. వ్యవసాయ రంగ దీర్ఘకాలిక సమతుల్యాభివృద్ధికి ఇది దోహదపడకపోవచ్చు’ అని కోర్టుకు నివేదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన నివేదికను తిరస్కరిస్తున్నట్టు ఇంతవరకు కేంద్రం ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాలకు మాత్రమే తెలిపింది. అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ, టీడీపీ స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తామని చెప్పాయి. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. రైతు ఆత్మహత్యలపై స్పందించినప్పుడు సైతం సుప్రీంకోర్టు.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఏసీపీ విధానమే లోపభూయిష్టం ధర నిర్ణయానికి సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే 12 అంశాలలో 8 రైతులకు వ్యతిరేకం. మూడేళ్ల కిందటి నాటి ధరలు, ఖర్చుల ఆధారంగా ఒక హెక్టారు సాగు ఖర్చును లెక్కిస్తారు. దేశవ్యాప్తంగా 9,84,485 చోట్ల దిగుబడి నమూనాలు సేకరించాల్సి ఉండగా 5,800 కేంద్రాలలో సేకరించిన దిగుబడుల ఆధారంగా 20 శాతం అధిక దిగుబడి నమోదు చేస్తున్నారు. సీఏసీపీ పెద్ద బోగస్ సంస్థ. దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. - అతుల్ కుమార్ అంజన్, స్వామినాథన్ కమిషన్ తాత్కాలిక సభ్యులు ఎంఎస్పీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉండాలి ఎంఎస్పీని నిర్ణయించే సీఏసీపీ పాత్ర అనుమానాస్పదం. రైతులపై లేని శ్రద్ధ మార్కెట్ శక్తులపై చూపుతోంది. ఉత్పత్తి ఖర్చు కంటే ఎంఎస్పీ తక్కువగా ఉంది. ఈ మాత్రానికి ఎంఎస్పీ ఎందుకు? రాష్ట్రాలే ఎంఎస్పీని నిర్ణయించుకునే అధికారం ఉండాలి. కేంద్రం వాదన, పనితీరు రైతులను దగా చేసేలా ఉంది. - డాక్టర్ డి.నరసింహారెడ్డి, చేతన ఎన్జీవో రైతును భూమి నుంచి దూరం చేసే కుట్ర స్వామినాథన్ కమిషన్ నివేదిక అటకెక్కినట్టే. వాస్తవ వ్యయం ఆధారంగా నిర్ణయించాల్సిన ఎంఎస్పీని డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయించడం రైతును దగా చేయడమే. రైతులు వ్యవసాయాన్ని వదిలేలా చేసి ఆ భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్నదే మోదీ, చంద్రబాబు ధ్యేయం. అందుకే లక్షలాది ఎకరాలతో భూ బ్యాంకులు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. - వంగల సుబ్బారావు, ఏపీ రైతు సంఘం -
ఈ శతాబ్దం భారత్‌దే!
ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించింది ఐరాస నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు ఇప్పటికైనా ఆ దిశగా యూఎన్ చర్యలు తీసుకోవాలి ♦ నా జీవితంలోని ప్రతీక్షణం దేశసేవకే అంకితం ♦ శాన్‌జోస్‌లోని సాప్ సెంటర్లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం శాన్‌జోస్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో మరోసారి రాక్‌స్టార్ ప్రదర్శన ఇచ్చారు. శాన్ జోస్ సాప్ సెంటర్లో సోమవారం ఉదయం(భారతీయ కాలమానం ప్రకారం) దాదాపు 18,500 మంది భారతీయ అమెరికన్లను తన ట్రేడ్‌మార్క్ ప్రసంగంతో ఉర్రూతలూగించారు. 21వ శతాబ్ది భారత్‌దేనని తేల్చి చెప్పారు. తన జీవితంలోని ప్రతీక్షణం దేశ సేవకే అంకితమని, ‘ఈ దేహం దేశానిదే’నని ఉద్వేగపూరిత వ్యాఖ్య చేశారు. నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయిందంటూ ఐక్యరాజ్యసమితిపై నిప్పులు చెరిగారు. నిర్వచించడానికే ఇంత సమయం తీసుకుంటే ఉగ్రవాద భూతాన్ని అంతం చేసేందుకు ఇంకెంత సమయం పడ్తుందని సూటిగా ప్రశ్నించారు. మోదీ ప్రసంగానికి సభికులు పలుమార్లు హర్షధ్వానాలతో స్పందించారు. యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులపై ప్రశంసలు.. భారత్ భవిష్యత్‌పై భరోసా.. కాంగ్రెస్‌పై నర్మగర్భంగా అవినీతి ఆరోపణలు.. డిజిటల్ ఇండియా, జన్‌ధన్ యోజన తదితర ప్రభుత్వ పథకాలు.. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆహూతులను ఆకట్టుకున్నారు. గత పర్యటనలో తూర్పుతీర నగరం న్యూయార్క్‌లో భారతీయులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన మోదీ.. ఈ పర్యటనలో పశ్చిమతీరంలోని ప్రపంచ ఐటీ రాజధాని సిలికాన్ వ్యాలీ(కాలిఫోర్నియా) కేంద్రంగా అమెరికాలోని భారతీయుల మనసు గెల్చుకున్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 125 కోట్ల భారతీయుల పట్టుదల 21వ శతాబ్ది భారత్‌ది. భారతీయులది. గత 16 నెలలుగా భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో గొప్ప మార్పు వచ్చింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను కొత్త దృష్టితో, కొత్త ఆకాంక్షలతో చూస్తోంది. ఈ సానుకూల మార్పునకు ప్రధాన కారణం 125 కోట్లమంది భారతీయుల కృషి, పట్టుదల, నిబద్ధత. భారత్ భవిష్యత్తుపై ఇక నాకేం ఆందోళన లేదు. భారత్ జనాభాలో 80 కోట్లమందిది 35 ఏళ్లలోపున్న ఉత్సాహపూరిత యువరక్తమే. అందుకే కచ్చితంగా చెప్పగలను భారత్‌కు ఇక వెనకడుగు లేదు. 15 నెలల్లోనే భారత్ నూతన శిఖరాలకు చేరుకుంది. ఆర్థిక సుస్థిరత సాధించింది. గత ఆర్నెల్లుగా దాదాపు అన్ని రేటింగ్ సంస్థలు ఒకే మాట చెబ్తున్నాయి. పెద్ద దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతేనని తేల్చిచెబ్తున్నాయి. ప్రమాదకర సవాలు.. ఉగ్రవాదం! ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాదకర సవాళ్లు రెండు. ఒకటి ఉగ్రవాదం. రెండోది వాతావరణ మార్పు. పటిష్ట కార్యాచరణ, సమైక్య నిబద్ధతతోనే వాటిని ఎదుర్కోగలం. భారత్ గత 40 ఏళ్లుగా ఉగ్రవాదంతో బాధపడ్తోంది. ఐరాస ఇప్పటివరకు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయింది. ఈ అంశాన్ని రేపు ఐరాస భేటీలో లేవనెత్తనున్నాను. 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదంపై స్పష్టమైన నిర్వచనం ఇవ్వాల్సిన బాధ్యత ఐరాసపై ఉంది. అప్పుడే ఉగ్రవాదం వైపు ఎవరు?.. మానవత్వం వైపు ఎవరు? అన్నది తేలుతుంది. వారికి తమ మార్గాన్ని ఎన్నుకునేందుకు స్పష్టత లభిస్తుంది. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో మంచి టైజం, చెడ్డ టైజం అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి మాటలతో మానవత్వాన్ని కాపాడలేం. ఉగ్రవాదం ఉగ్రవాదమే. పాశ్చాత్య దేశాలు తమ దేశంపై ఉగ్రవాద దాడులు జరిగాకే మేలుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలి. ఐరాసపై ఒత్తిడి తేవాలి. భారతదేశం గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటి మహనీయుల గడ్డ. భారత్ శాంతిని, అహింసను కోరుకునే దేశం. ఐటీలో భారతీయుల అసమాన సేవ ఐటీలో మీ సామర్థ్యం ద్వారా ప్రపంచం దృష్టిలో భారత్‌ను సమున్నతంగా నిలిపారు. కీబోర్డ్‌పై మీరు చేసిన మ్యాజిక్‌తో భారత్‌కు కొత్త గుర్తింపునిచ్చారు. మీ సామర్థ్యం, నిబద్ధత, సృజనాత్మకతతో ప్రపంచాన్ని మార్పునకు సిద్ధం చేస్తున్నారు. అమెరికన్లు కూడా భారతీయ అమెరికన్ల పట్ల గర్వంగా ఫీల్ అవుతుంటారు. అది గొప్ప విషయం. ఇందుకు మీకు సెల్యూట్ చేస్తున్నా. ఇది మేధో వలస కాదు.. మేధో సంపద. ఇది బ్రెయిన్ డిపాజిట్. ఇది అవసరమైనప్పుడు మాతృభూమికి సేవ చేస్తుంది. ఇప్పుడా సమయం వచ్చింది. భారతీయుల ఐక్యశక్తిని చూపాలి. ఈ రోజు భగత్‌సింగ్ జయంతి.. ఇక్కడ ఈ రోజు సెప్టెంబర్ 27 కానీ భారత్‌లో సెప్టెంబర్ 28. అది షహీద్ భగత్‌సింగ్ జయంతి. ఆ అమరవీరుడికి సెల్యూట్ చేస్తున్నా. (సభికులతో వీర్ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేయించారు) కాలిఫోర్నియాతో అనుబంధం భారత్‌తో కాలిఫోర్నియాకు చరిత్రాత్మక అనుబంధం ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా గదర్ పార్టీ పనిచేసింది. ఇక్కడి ప్రజలకు భారతీయులంటే ఎంతో అభిమానం. భారతీయ చేతన ఇక్కడ నాకు కనిపిస్తోంది. ప్రముఖుల హాజరు.. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నాన్సీ పెలోసి(అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్), ఎడ్ రాయిస్(అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్) తదితరులున్నారు. నిరసనలు.. కార్యక్రమం సందర్భంగా సాప్ సెంటర్ వెలుపల ప్రత్యేక ఖలిస్తాన్ మద్దతుదారులైన సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా బ్యానర్‌ను ప్రదర్శించారు. కాగా, గురువారం మినాలో హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో వెయ్యిమందికిపైగా మృతిచెందడంపై మోదీ సంతాపం తెలుపుతూ మినా అధికారులు సందేశం పంపారు. నా మిషన్ ‘జామ్’ నా మిషన్ ‘జామ్’. అంటే జనధన్ యోజన.. ఆధార్.. మొబైల్ గవర్నెన్స్. వీటివల్ల అవినీతి తగ్గుతుంది. జనధన యోజన కింద కేవలం 100 రోజుల్లో 18 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లను ప్రారంభింపజేశాం. వాటిలో రూ. 32వేల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు విదేశీ గడ్డపై కాంగ్రెస్‌పై, గత యూపీఏ ప్రభుత్వంపై మోదీ మళ్లీ విమర్శలు గుప్పించారు. గతంలో భారత్‌లో రాజకీయ నేతలు, వారి కుటుంబాలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్కడ రాజకీయ నేతలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు రావడం సాధారణమే. ప్రభుత్వంలో ఉండగా ఒకరు రూ. 50 కోట్లు, మరొకరి కుమారుడు రూ. 100 కోట్లు, ఒకరి కూతురు రూ. 500 కోట్లు, ఇంకొకరి అల్లుడు రూ. 1,000 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపణలు వచ్చాయి’ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా.. సోనియాగాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి.. పరోక్ష విమర్శలు చేశారు. అలాగే, తన ప్రభుత్వంపై, తనపై ఇంతవరకు ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదని గుర్తు చేశారు. ‘నాపై అలాంటి ఆరోపణలేమైనా వచ్చాయా?’ అంటూ మోదీ వేసిన ప్రశ్నకు సభికులు పెద్ద పెట్టున ‘లేదు’ అంటూ నినదించారు. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని దేశసేవకే వినియోగిస్తున్నానన్నారు. ‘నా 16 నెలల పాలనపై మీ నుంచి సర్టిఫికెట్ కోరుకుంటున్నా. నా హామీలను నెరవేర్చానా? లేదా? రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నానా? లేదా?’ అని సభికులను ప్రశ్నించారు. భారత్‌లోని వాస్తవ పరిస్థితులపై అక్కడివారి కన్నా అమెరికాలోని వారికే ఎక్కువ అవగాహన ఉందన్నారు. -
చేతిలో పనైనా చేయరేం!
యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావుడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! ‘‘స్పెషల్ కేటగిరి స్టేటస్’’ ప్రత్యేక హోదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ‘పదం’. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు ‘స్పెషల్ స్టేట స్’ అని అంటే చాలు బీజేపీ, టీడీపీ వాళ్లకి చిర్రెక్కిపోతోంది. రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్ వాళ్లకూ, సోనియా గాంధీ వెనకాల నక్కిన జగన్మోహన్రెడ్డికీ మాట్లాడే అర్హతే లేదని అధికార పక్షం వారి వాదన... నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ‘పార్టీ ఫీలింగులు’ లేనే లేవు. ఆంధ్రా సీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్ర తినిధులందరూ విభజనను వ్యతిరేకించిన వారే... కొంచెం అటూ ఇటుగా! అటూ ఇటూ అని ఎందుకన్నానంటే, కొందరు కాంగ్రెస్‌కు చెందిన పార్ల మెంట్ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూనే, హైకమాండ్ నిర్ణయానికి కట్టు బడి ఉంటామన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన అభిప్రాయాన్నే చెప్పలేదు! ‘సమన్యాయం’ అంటే ఆయన ఉద్దేశమేమిటో, ఇప్పటి వరకూ చెప్పనేలేదు!! ఏది ఏమైనప్పటికీ... పార్లమెంట్లో రాష్ర్ట విభజన బిల్లు ‘పాసయిపో యింది’ అన్నారు. విభజన జరిగిపోయింది. (బిల్లు నిజానికి లోక్‌సభలో పాస వ్వలేదు. పార్లమెంట్ వారు ప్రచురించిన 18.2.14 లోక్‌సభ డిబేట్స్ చదివిన వారికెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది. అది వేరే సంగతనుకోండి...) యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావిడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! పదేళ్లు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వకపోతే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అతీగతీ లేకుండా పోతుందని వాపోయారు వెంకయ్యనాయుడు. ఉత్తరా ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకిచ్చినట్లు పన్ను రాయితీలు ఇవ్వాలనీ, ఉత్త రాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర సబ్సిడీలు ఇవ్వాలనీ, యావద్భా రత దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను కోల్పోతున్న కార ణంగా ఆంధ్రప్రదేశ్‌కు నష్టపరిహారంగా ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇచ్చి తీరా లని... కోరారు వెంకయ్యనాయుడు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు గురించి, లోక్ సభలో ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న యావదాంధ్ర ప్రజానీకం 20-2-14న రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలకి అతుక్కుపోయారు. స్వతహాగా మంచి వక్త అయిన వెంకయ్యనాయుడు ఆ రోజు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడి... ‘‘మన గురించి మాట్లాడుతున్న ఏకైక మొనగా డురా...’’ అనిపించుకున్నారు. ‘‘పొద్దున్న అయిదేళ్లకి ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ పదేళ్లు అంటా వేంటి..?’’ అని చిరాకుపడ్డారు హోంమంత్రి షిండే గారు. దాంతో రెచ్చిపోయిన వెంకయ్యనాయుడు గారు ‘రెండు మూడు నెలల్లో మేం అధికారంలోకి వస్తున్నాం. మేము ఇవ్వాళ ‘డిమాండ్’ చేస్తున్నవన్నీ, రేపు మేము చేసి చూపెడతాం’’ అని తెలుగులో మనకందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పారు. 2014 జనరల్ ఎలక్షన్లలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి ప్రధాన కారణం ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’! మోదీగారు ప్రధానమంత్రి అయ్యారు. వెంకయ్యనాయుడు గారు అత్యంత కీలకమైన మంత్రి అయ్యారు. మోదీకి చాలా దగ్గరయ్యారు (మోదీ తన మంత్రివర్గ సహచరులలో ఎప్పుడైనా, ఎవరినైనా పొగిడారూ అంటే... అది ఒక్క వెంకయ్యనాయుడు గారినే). ఇక్కడ చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామ్య పార్టీ అయింది. ఇక ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ వెంటనే ప్రకటించటానికి అభ్యం తరం ఏముంటుంది?! మన్మోహన్సింగ్ ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ ఆఖరి కేబినెట్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానం కూడా చేసి దిగిపోయింది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలనే కొత్త సూత్రం ప్రతిపాదిస్తున్నారు కొం దరు విజ్ఞులు. ఎవరొప్పుకున్నారని రాష్ట్ర విభజన బిల్లు తెచ్చారు? ములా యంసింగ్, డీఎంకే, ఏడీఎంకే, అకాలీదళ్, బీజేడీ, జేడీయూ, సీపీఎం, తృణ మూల్... ఏ పార్టీ ఒప్పుకుంది!? కాంగ్రెస్ వారు, బీజేపీ వారు అనుకున్నారు... అయిపోయిందన్నారు. ఈ రోజు కొత్త రూల్స్ మాట్లాడితే ఎలాగ?! ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ అనేది బీజేపీ+టీడీపీల వాగ్దానం. వాగ్దాన భంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రతిపక్షాలని లెక్క పెట్టక్కర్లేదన్న ‘అహంకారం’ తలకెక్కినప్పు డు ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి... ‘మైండ్ సెట్’ అవుతుంది. ఎన్నో అటుపోట్లు, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ‘ఓటు బ్యాంక్’ కలిగియున్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ‘చావు దెబ్బ’ తినేయటానికి కారణం ఏమిటో అన్ని పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వ్యాసకర్త: లోక్‌సభ మాజీ సభ్యులు, - ఉండవల్లి అరుణ్ కుమార్ మొబైల్: 9868180171 -
ఇప్పటికీ వాళ్లేనా?
నెహ్రూ కుటుంబం స్మృతిలో దశాబ్దాలుగా వివిధ రకాల పోస్టల్ స్టాంపులను ముద్రించడంపై కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా వివాదాలకు దారితీయడం గర్హనీయం. చూడబోతుంటే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది ఆ కుటుంబంలోని వారే తప్ప మరె వ్వరూ కాదన్నట్లుగా ఇన్నాళ్లూ ప్రభుత్వాలు వ్యవహరించాయి. సోనియా గాంధీ పరోక్ష నేతృత్వంలో యూపీఏ పదేళ్ల పాలనలో 400 స్కీములు, విద్యా సంస్థలు, ప్రాజెక్టులు, సంక్షేమ చర్యలకు రాజీవ్, ఇందిర, నెహ్రూల పేర్లు మాత్రమే పెడుతూ వచ్చారు. ఇంతకూ రాజీవ్ ఘనత ఏమిటి? ప్రధానమంత్రిగా ఆయన పనిచేసిన ఐదేళ్ల కాలంలోనే కాంగ్రెస్‌ను అటు లోక్‌సభలోనూ, పలు రాష్ట్రాల అసెంబ్లీలలోనూ శాశ్వత మైనారిటీలోకి దిగజార్చివేశారు. సొంతపార్టీకి ఆయన కట్ట బెట్టిన మహా గొప్ప విజయం అదేమరి. అలాంటిది.. ఆయన గతించిన తర్వాత అంత ప్రాధాన్యత నిచ్చి దేశంలో ప్రతి పథకానికీ ఆయన పేరును తగిలించడం సమంజసం మాట అటుంచి హాస్యాస్పదం. రాజీవ్ విషయం అలా ఉంచితే దేశంలో అనేకమంది కాంగ్రెసేతర, నెహ్రూ కుటుం బేతర నేతలు, జాతి నిర్మాతలు, దేశభక్తిపరులు ఉనికిలోకూడా లేకుండా అనామకులుగా ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి వారిని పార్టీలకు అతీతంగా గుర్తించి పోస్టల్ స్టాంపులు వంటి వాటి ద్వారా వారిని వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది. డాక్టర్ టి.హెచ్. చౌదరి కార్ఖానా, సికిందరాబాద్ -
ప్రతిష్టంభన వెనుక ప్రతీకారేచ్ఛ
సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మాణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. పార్లమెంటు లోపలా, బయటా సాగుతున్న పెనుగులాటలో గెలిచేది ఎవరో తెలియదు కానీ ఓడేది మాత్రం ప్రజలే. వానాకాల సమావేశాలు ప్రతీకార రాజ కీయాల వెల్లువలో కొట్టుకుపోయినట్టే లెక్క. యూపీఏ హయాంలో ప్రతిపక్ష బీజేపీ ఏ విధంగా చర్చకు అంతరాయం కలిగించిందో అదే విధంగా ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ పాలనలో సర్వోన్నత చట్టసభలో చర్చ చట్టుబండలు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నది. ‘తానాషాహీ నహీ చెలేగీ’ (నియంతృత్వం సాగదు) అంటూ పార్లమెంటు భవనం బయట కాం గ్రెస్ అధినేత సోనియాగాంధీ నినాదాలు చేయడం, ఒకవైపు రాహుల్‌గాంధీ, మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా చెలరేగడం వెనుక పాతకక్ష లేకపోలేదు. యూపీఏ హయాంలో బీజేపీ సృష్టించిన ప్రతిష్టంభనకు మాత్రమే ప్రతీకారం కాదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు సంభవించిన నాటకీయ పరిణామాలలో ప్రధాని పదవికీ, సోనియాగాంధీకీ మధ్య నిలిచిన నాటి ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్పైన ఇది కక్షసాధింపు. సుష్మాపైనే ఎందుకు గురి? విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగబోదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ముగ్గురిలో తక్కువ తీవ్రత ఉన్నది సుష్మాస్వరాజ్పైన వచ్చిన ఆరోపణలలోనే. ఐపీఎల్ క్రికెట్ సృష్టికర్త లలిత్మోదీకీ, వసుంధర రాజే కుమారుడికీ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో 35మందికి పైగా వ్యక్తులు మరణించినట్టు రుజువులు ఉన్నాయి. లలిత్‌మోదీ పోర్చుగల్ వెళ్ళడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిస్తే దాని వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేదని పూచీ ఇవ్వడం సుష్మాస్వరాజ్ చేసిన తప్పిదం. ఈ విషయం మంత్రివర్గంలోని ఇతర బాధ్యులకు తెలియకుండా గోప్యంగా జరగడం నిశ్చయంగా అసాధార ణమే. అక్రమమే. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలలోని తీవ్రత సుష్మాపైన చేస్తున్న ఆరోపణలలో లేదు. గురి సుష్మాపైనే ఎందుకు పెట్టారు? 2004లో ఎన్నికలైన తర్వాత తన నాయకత్వంలోని కూటమికి లోక్ సభలో సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సభ్యుల మద్దతు ఉన్నదంటూ అబ్దుల్ కలాంను కలుసుకునేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత త్యాగం సీనుకు తెరలేపారు. తాను స్వయంగా ప్రధాన మంత్రి పదవిని స్వీకరించకుండా మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ను గద్దెపైన కూర్చోబెడుతున్నట్టు ప్రకటించారు. దీనికి నేపథ్యం ఏమిటో చాలా మందికి తెలుసు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీని కనుక ప్రధానిగా నియ మిస్తే తాను శిరోముండనం చేయించుకొని, తెల్లచీర కట్టుకొని జన్‌పథ్‌లో నిరా హార దీక్ష చేస్తానంటూ సుష్మాస్వరాజ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి ఆగ్రహం సొనియాగాంధీ హృదయంలో రగులుతూనే ఉంది. ఇప్పుడు సుష్మాను బోనె క్కించే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ప్రయాణానికి అవసరమైన పత్రాలు లలిత్ మోదీకి అందేందుకు దోహదం చేయడమే కాకుండా సుష్మా భర్త, కుమార్తె క్రికెట్ మాయావికి న్యాయసలహాదారులుగా ఉండటం కాంగ్రెస్ దాడికి పదును పెట్టింది. ‘లలిత్‌మోదీ సుష్మా భర్తకూ, కుమార్తెకూ ఎంత చెల్లించారో వెల్లడిం చాలి’ అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాటుదేలుతున్న రాహుల్ కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీఇరానీ సవాలు చేసినట్టు ఒకటిన్నర నిమి షం మాత్రమే కాకుండా గంటన్నర సేపు మాట్లాడటం సోనియాకు కానీ రాహు ల్కి కానీ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చును కానీ, కొన్ని ఘాటైన మాటల (పంచ్ లైన్ల)తో మోదీని వేధించడంలో రాహుల్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ‘ న ఖావూంగా, న ఖానేదూంగా’ (తినను, తిననివ్వను) అంటూ చేసిన వాగ్దానాన్ని పదేపదే ఉటంకించడం ద్వారా అవినీతి వ్యవస్థకు మోదీ అధ్యక్షత వహిస్తున్నారనే భావనను రాహుల్ జయప్రదంగా ప్రచారంలో పెట్టగలిగారు. మోదీకి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కార ణాలు ప్రధానంగా మూడు. ఒకటి, మోదీ అవినీతికి ఆమడ దూరం. రెండు, మోదీ సమర్థ పాలకుడు. మూడు, అభివృద్ధి సాధకుడు. రాహుల్ సుదీర్ఘ విరా మం ముగించుకొని వస్తూనే మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ కీ సర్కార్’ అంటూ దుయ్యపట్టారు. పేదలకు వ్యతిరేకిగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలు డుగా అభివర్ణించారు. ‘అటు అంబానీ, ఇటు అదానీ, మధ్య ప్రధాని’ అంటూ తెలుగులో సైతం చలోక్తులు వినిపించాయి. ఈ మచ్చ మాపుకోవడం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారు. కొర్పొరేట్ రంగ ప్రతినిధులను కలుసుకోవడానికి సైతం సంకోచిస్తున్నారు. అందుకే ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు’ అంటూ బజాజ్ ఆటో అధిపతి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ లాగా రాహుల్ బజాజ్ రాజకీయవాది కాదు. పైగా మోదీ అభిమాని. మోదీ తన ప్రత్యే కతలనూ, స్వశక్తిని విస్మరించి పేదలకు వ్యతిరేకి కాదనే పేరు తెచ్చుకునే ప్రయ త్నంలో గట్టి పనులు చేయలేకపోతున్నారని బజాజ్ ఫిర్యాదు. పారిశ్రామికవేత్తలతో, వణిక్ప్రముఖులతో సమాలోచనలు జరిపి పరిశ్రమ లనూ, వ్యాపారాన్నీ విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించాలనీ, నిరు ద్యోగాన్ని తగ్గించాలనీ మోదీ అభిమానులు కోరుకుంటున్నారు. వెనకటి నుంచి పన్ను కట్టించుకునే చట్టాన్ని (రెట్రాస్పెక్టివ్ టాక్స్ లా) ఉపసంహరించుకోవా లనీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)చట్టాన్ని తీసుకురావాలనీ అభిల షిస్తున్నారు. మోదీ మరింత సమర్థంగా, శక్తిమంతంగా పరిపాలన నిర్వహిం చాలనీ, శషభిషలు లేకుండా బాణంలాగా దూసుకుపోవాలనీ 2014లో అరు దైన అవకాశం ప్రసాదించిన దేశప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని అరుదైన విజయాలు ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు లేకపోలేదు. గత ప్రభుత్వాలు ఆరం భించిన కొన్ని విధానాలను కొనసాగించడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ బలంగా ముందుకు తీసుకొని వెడుతున్నారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం చరిత్రాత్మకమైనది. 1974లో ఇందిరాగాంధీ, ముజీబుర్ రెహ్మాన్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని, బీజేపీ దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ వచ్చిన నిర్ణయాన్ని మోదీ అమలులోకి తేగలిగారు. ముయ్వావర్గంతో ఇటీవల కుదుర్చుకున్న శాంతి ఒప్పందం నాగభూమిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి దోహదం చేస్తుంది. దౌత్యరంగంలో భారత్‌కు గుర్తింపు సాధించడంలో మోదీ కృషి కొంత వరకూ ఫలించింది. పార్లమెంటులో ప్రతిష్టంభన కారణంగానూ, తన పార్టీలోని ప్రముఖులపైన అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగానూ మోదీ మౌనం వహించడం ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడుగా, ప్రజలతో నేరుగా సంభాషించే నేర్పు కలిగిన రాజకీయవేత్తగా పేరున్న మోదీ స్వపక్షీయులపైన వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేక, ఒప్పుకో లేక మౌనాన్ని ఆశ్రయించడం బలహీనతగానే ప్రజలకు అనిపించింది. ఎన్నికల సమయంలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అనేకం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపైన చర్చ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సమస్య క్రమంగా రగులుతోంది. శనివారంనాడు తిరుపతిలో ఒక యువకుడు ఆత్మ హత్యాయత్నం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 సార్వత్రిక ఎన్నికలలో గెలిపించడానికి రెండు వాగ్దానాలు కారణం. ఒకటి, రైతుల రుణ మాఫీ. రెండు, ప్రత్యేక హోదా. రెండూ ఆచరణకు నోచుకోలేదు. ఈ వైఫల్యానికి తెలుగుదేశం ఎంత కారణమో బీజేపీ సైతం అంతే కారణం. చర్చ ఎవరికి కావాలి? పార్లమెంటులో చర్చను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక కార ణం అంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో సమాలోచనలు జరిపి ఆ పార్టీ సహకారం పొందడానికి నరేంద్రమోదీ ఎందుకు ప్రయత్నించలేదు? పార్లమెంటులో చర్చ జరగకుండా సమయం వృధా అవుతున్నా నిమ్మకు నీరె త్తినట్టు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? గులాం నబీ ఆజాద్‌నూ, మల్లికార్జున్ ఖార్గేనూ బీజేపీ నాయ కులు సంప్రతించారు. చర్చను అడ్డుకోవాలన్నదే తమకు అధిష్ఠానం నుంచి అం దిన ఆదేశమని వారు చెప్పడంతో బీజేపీ నాయకులు అంతటితో వదిలివేశారు. మోదీ స్వయంగా చొరవ తీసుకొని సోనియాగాంధీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరో సంవత్సరంపాటు రాజ్యసభలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగు తుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68. ఎన్డీఏకి 64 మంది ఉన్నారు(బీజేపీకి 48 మంది, మిత్రపక్షాలకు 16). 2016లో మొత్తం 76 మంది సభ్యుల పదవీ విరమణ ఉంటుంది. వారిలో 21 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. వీరిలో అత్యధికులు రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి కాంగ్రెసేతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారు. సగం సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కవు. పదవీ విరమణ చేయనున్న 17 మంది బీజేపీ సభ్యులు, ఏడుగురు మిత్రపక్షాల సభ్యుల స్థానంలో ఆ పార్టీలకి చెందినవారే ఖాయంగా ఎన్నికై సభకు తిరిగి వస్తారు. 2016 మార్చిలో 12 మంది నామి నేటెడ్ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా అధికార కూటమి సూచించినవారినే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కనుక వారు బీజేపీకి అను కూలురే ఉంటారు. పరిస్థితులు అనుకూలించే వరకూ వేచి ఉండాలని మోదీ నిర్ణయించుకొని ఉంటారు. ప్రస్తుతానికి బిహార్ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి నిలిపింది. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే ముందు బిహార్‌కు ఆ వరం మోదీ ప్రసాదించేవారు. 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో పని లేదు. బిహార్ తర్వాత కేరళ, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరు గుతాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరుణ్ గగోయ్‌కి అస్సాంలో వ్యతిరేకత ప్రబలంగా ఉంది. 1985 నుంచి కేరళలో అధికారంలో ఉన్న కూటమిని గెలిపించే ఆనవాయితీ లేదు. అక్కడ బీజేపీ విజయం సాధించ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణించే వరకూ ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం సాధ్యం కాదని మోదీ గ్రహించి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కంటే, ప్రజాహితం కంటే ప్రతీకార రాజ కీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా మోదీ చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించడానికి బీజేపీ గత లోక్‌సభలో అనుసరించిన అనుచిత ధోరణే కారణం. నాడు అడ్డుకున్న జీఎస్టీ బిల్లును ఇప్పుడు సభ చేత ఆమోదింప జేయాలని ప్రయత్నించడం కపట రాజ కీయాలకు నిదర్శనం. సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మా ణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సత మతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. సామరస్య వాతావరణానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. పదవీ రాజకీయాల పతనావస్థకు మనం ప్రత్యక్ష సాక్షులం. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ - కె.రామచంద్రమూర్తి -
ఎస్బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!
ఆర్థికశాఖ పరిశీలనలో కీలక ప్రతిపాదన ముంబై: కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 2013లో ‘మహిళల కోసం’ ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) త్వరలో తెరమరుగుకానుందా? ఈ బ్యాంకును దేశీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తుది నిర్ణయం ఏదీ ఇప్పటివరకూ తీసుకోకపోయినా... విలీన ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.1,000 కోట్ల తొలి మూలధనంగా బీఎంబీ ప్రారంభమైంది. నాకు తెలియదు: ఎస్బీఐ చీఫ్ కాగా ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను క్యాబినెట్లో చర్చించివుండవచ్చని సైతం అభిప్రాయపడ్డారు. ఈ విలీనం జరిగితే ఎస్బీఐకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సైతం ఆమె వ్యాఖ్యానించారు. అతి చిన్న బ్యాంక్ అయినప్పటికీ, అది విలీనానికి ఎటువంటి అడ్డంకీ కాబోదన్నారు. బీఎంబీ గురించి... ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో దాదాపు 60 శాఖలు ఉన్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో బీఎంబీ అన్‌లిస్టెడ్ సంస్థ. మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటయ్యింది. 2013-14లో ఆదాయం రూ.45.29 కోట్లు. 2014 మార్చి నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.175 కోట్లు. -
36 రాఫేల్ యుద్ధ విమానాలే కొంటాం
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు ఫ్రాన్స్ నుంచి 126 రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, అది ఆర్థికంగా కూడా సాధ్యపడదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 36 రాఫేల్ జెట్లను మాత్రమే కొనుగోలు చేస్తుందని, వీటిని వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ఆదివారమిక్కడ చెప్పారు. వాయు సేన అవసరాల మేరకే వీటిని కొనుగోలు చేస్తున్నామని, అంతకుమించి కొనుక్కోబోమని అన్నారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రారంభించిన టెండర్ ప్రక్రియను కూడా తప్పుపట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను, రక్షణ సేకరణ మండలిని నిర్వీర్యం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. -
రాజకీయ కారణాలతోనే..
* అఫ్జల్ గురుకు ఉరిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ * ఉరికి కొద్దిగంటల ముందే నాకు సమాచారం ఇచ్చారు న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును యూపీఏ ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ఉరి తీసిందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఉరికి కొద్ది గంటల ముందుగా మాత్రమే సమాచారం ఇచ్చారని చెప్పారు. ‘‘ఆరోజు నేను నా సోదరితో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం అఫ్జల్‌గురును ఉరి తీస్తున్నారని, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేశానని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఏవైనా ఉద్రిక్త పరిణామాలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు’’ అని ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. అఫ్జల్ ఉరి నిర్ణయాన్ని ముమ్మాటికి రాజకీయ కారణాల వల్లే తీసుకున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తమపై విమర్శలు గుప్పించే అవకాశం ఇవ్వకూడదనే యూపీఏ సర్కారు గురుతోపాటు కసబ్‌ను ఉరితీసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిందన్నారు. కాగా, ప్రధాని మోదీ విదేశీ గడ్డపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించడాన్ని ఒమర్ తప్పుపట్టారు. అంతా తానే చేస్తున్నాన్న భావనలో మోదీ ఉన్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో తాను ప్రధానిగా వచ్చానని, బీజేపీ ప్రతినిధిగా రాలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాహుల్‌లో ప్రస్తుతం అద్భుతమైన మార్పు వచ్చిందని కొనియాడారు. -
ఏడాది పాలనపై ప్రజల్లోకి..
విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని బీజేపీ నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనను, సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. దేశంలో సహాకార పూర్వక సమాఖ్య వ్యవస్థ, సమ్మిళిత అభివృద్ధి దిశగా మోదీ అడుగులు వేస్తున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని ప్రచారం చేయాలని భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి ‘జన్ కల్యాణ్ పర్వ్’ పేరిట వారం పాటు వేడుకలు నిర్వహించే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా గత ఏడాదిలో సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దేశంలో పేదరికం కొనసాగాలని కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయని.. తాము అలా జరగనివ్వబోమని, పేదరికాన్ని నిర్మూలిస్తామని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తమ అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనతో దేశం ఆర్థికంగా దూసుకుపోతుందన్నారు. మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని.. పేదల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమానికి పాటు పడదాం.. గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనతో పోలిస్తే.. తమ ఎన్డీయే పది నెలల పాలనలో ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయాలను గర్వంగా ప్రజల ముందుకు తీసుకెళదామని ఎంపీలకు సూచించారు. -
'మద్దతు ఉపసంహరించాల్సింది కాదు'
న్యూఢిల్లీ: యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్ష పార్టీలు మద్దతు ఉపసంహరించకుండా ఉండాల్సిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి అభిప్రాయడ్డారు. భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. యూపీఏతో సర్కారుతో బంధాలు తెంచుకున్న నాటి నుంచి వామపక్షాల బలం తగ్గుతూ వచ్చింది. అణు ఒప్పందంపై కాకుండా ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై మద్దతు ఉపసంహరించివుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఏచూరి అభిప్రాయపడ్డారు. అయితే అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం కరెక్టేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో లేనప్పటికీ యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య వంతులను చేయలేకపోయామని చెప్పారు. -
తప్పనిసరి పరిణామం
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని శాపాలై వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతృత్వంవహించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిందితుడిగా బోనెక్క బోతున్నారు. ఈ స్కాంను ఆదినుంచీ గమనిస్తున్నవారంతా ఇలాంటి పరిస్థితి ఏర్పడు తుందని ముందే ఊహించారు. దర్యాప్తు చేసిన సీబీఐ మాత్రమే మరోలా భావిం చింది. ఇప్పుడు మన్మోహన్‌సింగ్‌కు సమన్లు అందిన తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటా యింపు కేసుపై ఆ సంస్థ సుదీర్ఘకాలం దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఎవరూ నేరానికి పాల్పడలేదంటూ ప్రత్యేక న్యాయస్థానానికి నిరుడు ఆగస్టులో ముగింపు నివేదికను సమర్పించింది. ప్రత్యేక న్యాయస్థానం ఆ నివేదికను తిరస్కరించి, దర్యాప్తులోని లొసుగులను ఎత్తిచూపింది. కేసులో ఉన్న కొన్ని అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదని ప్రశ్నించింది. ముఖ్యంగా మన్మోహన్సింగ్ను ప్రశ్నించవలసి ఉండగా ఆ పని చేయలేదేమని నిలదీసింది. ఆ తర్వాతే సీబీఐలో కదలిక వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని మూడేళ్ల క్రితం తొలిసారి కాగ్ వెల్లడించింది. మొత్తం 195 క్షేత్రాల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలిపింది. ఇందువల్ల ఖజానాకు లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. స్కాం జరిగిందంటున్న సమయంలో కొంతకాలం బొగ్గు శాఖను స్వయంగా మన్మోహన్సింగే పర్యవేక్షించారు. కనుక ఆ స్కాంపై మన్మోహన్‌ను ప్రశ్నించడం తప్పనిసరి. అయినా సీబీఐ ఏ దశలోనూ ఆయనను పిలవలేదు. మన్మోహన్సింగ్ వరకూ అవసరం లేదు... ఆ సమయంలో ప్రధాని కార్యాలయం (పీఎంఓ)లో పని చేసిన వారినే ప్రశ్నించలేదు. తలబిరా-2 బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హిందాల్కో అధిపతి కుమార మంగళం బిర్లా మన్మోహన్‌తో సమావేశమయ్యారని, అటుతర్వాత ఆయనకు రెండు లేఖలు రాశారని వెల్లడైంది. ఇవన్నీ జరిగాక ఆ బొగ్గు క్షేత్రాలను హిందాల్కోకు కేటాయించాలని పీఎంఓనుంచి ఒత్తిళ్లు వచ్చాయని బొగ్గు శాఖ అధికారులు దర్యాప్తులో చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు తలబిరా-2 బొగ్గు క్షేత్రాలను కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ చేసిన సిఫార్సును తొలుత ఒప్పుకున్న మన్మోహన్ ఆ తర్వాత హిందాల్కోవైపు మొగ్గు చూపారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో నిజానిజాలేమిటన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలే. కుమార మంగళం బిర్లా ప్రధానిని కలవడంలోగానీ, ఆయనకు లేఖలు రాయడంలో గానీ తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే, ఆ కారణాలవల్లనే ఆ సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించారా, ఇతరత్రా ఆ సంస్థకు ఎలాంటి అర్హతలూ లేవా అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిజానిజాలేమిటో తెలుసుకుని సందేహాతీతంగా న్యాయస్థానానికి వివరించి ఉంటే వేరుగా ఉండేది. ఆ పనిచేయాలంటే మన్మోహన్‌ను పిలిచి ప్రశ్నించాలి. పీఎంఓలోని ఇతర అధికారులనుంచీ విషయాలు రాబట్టాలి. కానీ, సీబీఐ ఆ పనిచేయలేదు. సందేహాలన్నిటినీ అలాగే మిగిల్చి కేసు మూసేస్తున్నట్టు నివేదిక ఇస్తే ఏ న్యాయ స్థానమైనా ప్రశ్నించకుండా ఎందుకుంటుంది? మన్మోహన్ బోనెక్కాల్సిరావడం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు విచారకరమైన విషయమే. కానీ అందుకు బాధ్యులెవరు? ఆ స్కాంపై ఎన్నోసార్లు పార్లమెంటు స్తంభించిపోయింది. అనేకసార్లు వాయిదా పడాల్సివచ్చింది. ఏ దశలోనూ మన్మోహన్ సందేహ నివృత్తికి ప్రయత్నించలేదు. తన సచ్ఛీలతను నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. అసలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకే ఆ రోజుల్లో యూపీఏ సర్కారు ముందుకు రాలేదు. విపక్షాల ఒత్తిడి తట్టుకోలేక చివరకు దాన్ని నియమించినా ఆ సంఘం ముందుకొచ్చి మన్మోహన్ వివరణనిచ్చే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల కేటాయింపు సరైంది కాదని, వేలం విధానం ద్వారానే దాన్ని అప్పగించడం మంచిదని స్వయంగా మన్మోహనే ప్రతిపాదించారు. ఆనాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ సలహా మేరకు అలాంటి ప్రతిపాదన చేసినా... ఆయనే దాన్ని ఎందుకు పాటించలేకపోయారో, పీఎంఓనుంచి బొగ్గు శాఖపై ఎందుకు ఒత్తిళ్లు వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈ సందేహాలన్నిటికీ మన్మోహన్ మౌనమే సమాధానమైంది. విపక్ష రాష్ట్రాల సీఎంల ఒత్తిడి వల్లనే తాము వేలం విధానాన్ని ప్రారంభించలేక పోయామని ఒక దశలో మన్మోహన్ అన్నారు. కానీ అది బలహీనమైన వాదన. ఎవరో ఒత్తిడి చేశారని ఖజానాకు నష్టం కలిగించే పద్ధతిని కొనసాగిస్తారా? నిజానికి ప్రధానిగా ఆయన అన్ని శాఖల పర్యవేక్షణనూ చూస్తూ, అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేయాలి. అలాంటిది తానే స్వయంగా చూసిన శాఖలో అవకతవకలు జరుగుతుంటే ఆయన ఎందుకు మిన్నకుండిపోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సిమెంటు, ఉక్కు, విద్యుత్తువంటి ఎన్నో పరిశ్రమలకు బొగ్గు కీలకమైన ముడి సరుకు. దాని సరఫరా అంతంతమాత్రంగా ఉన్నందువల్ల విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సివస్తున్నది. ప్రధాన సరఫరాదారు కోల్ ఇండియా లిమిటెడ్ డిమాండుకు తగ్గ స్థాయిలో అందించలేక పోతున్నదన్న కారణంతో అవసరమైన పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానం ప్రారంభించారు. అయితే అందుకు వేలం పద్ధతిని ఎంచుకోకపోవడంవల్ల, పారదర్శకత పాటించనందువల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొగ్గు క్షేత్రాలను అందుకున్న సంస్థలు భారీయెత్తున లాభపడ్డాయి. మన్మోహన్‌ను నిందితుడిగా పరిగణిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేయడం అనేకులకు మింగుడుపడని విషయమే. కానీ స్కాం జరిగిన సమయంలో ఆయన బొగ్గు శాఖను చూడటం, ఎన్నో సందేహాలకు సమాధానాలు లభించకపోవడం వంటి కారణాలవల్ల మన్మోహన్ ఈ పాపభారం మోయకతప్పదు. -
ఎన్నాళ్లీ వెనుకబాటు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద బీఆర్జీఎఫ్(బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్) స్కీమ్‌ను యూపీఎ1 ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఆ స్కీమ్‌కి విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.25కోట్ల నిధులు విడుదల చేస్తూ వస్తోంది. వాటితో జిల్లా పరిషత్ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తోంది. ఈ నిధులొచ్చాక జిల్లాలో వేల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. మించిపోయిన సమయం 2014-15కి సంబంధించి సకాలంలో వెళ్లిన జిల్లాల ప్రతిపాదనలకు గత కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలయ్యాయి. కానీ, అవి మన జిల్లాకొచ్చే సరికి జెడ్పీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతల మెప్పు కోసం కొత్తగా ఏర్పడే జిల్లా పరిషత్ పాలకవర్గం చేత ప్రతిపాదిద్దామని వ్యూహాత్మక జాప్యం చేశారు. అనుకున్నట్టే పాలకవర్గం కొలువు తీరాక తీర్మానం చేసి పంపించారు. కానీ, ఈలోపే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. ఆలస్యంగా వచ్చాయన్న కారణంగా జిల్లా ప్రతిపాదనలను ముందే తెలిపిన ‘సాక్షి’ఇంతలోనే కేంద్రప్రభుత్వం వైఖరి కూడా మారింది. బీఆర్‌జీఎఫ్‌కు నిధులు సమకూర్చుతున్న ప్రణాళికా సంఘాన్ని ఏకంగా రద్దు చేసింది. దాని స్థానే నీతి అయోగ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పణాళిక సంఘమే లేనప్పుడు బీఆర్జీఎఫ్ కింద నిధులెలా వస్తాయన్న అనుమానం అప్పుడే మొదలయ్యింది. ఇదే విషయవై ‘సాక్షి’ దినపత్రికలో ఫిబ్రవరి 17వ తేదీన ‘‘బీఆర్జీ నిధులపై నీలినీడలు’’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. కథనం ప్రకారం వెల్లువెత్తుతున్న సందేహాలకు తగ్గట్టుగానే కేంద్రం బీఆర్జీఎఫ్పై ఆసక్తి చూపలేదు. ఏకంగా ఆ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. దీంతో జిల్లా ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకుండా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో వెనుకబడిన విజయనగరం జిల్లా పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి యూపీఎ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు ప్రస్తుతం అధికార బీజేపీ కూడా వంతు పాడింది. దీంతో ఈ ప్యాకేజీతోనైనా జిల్లా వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు అవకాశం ఉంటుందని మేధావులు భావించారు. కొత్త రాగం.. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.500కోట్లు చొప్పున వచ్చే అవకాశం ఉందని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించారు. ఇయతే ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యేక నిధులంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఆమేరకు ఇటీవల జిల్లాకు రూ.50కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇలా ఎన్నేళ్లు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా పేర్కొనలేదు. వెనుకబడిన జిల్లాలో భాగంగా విజయనగరం జిల్లాకు సంవత్సరానికి రూ.500కోట్లుచొప్పున ఐదేళ్లు వస్తాయనుకుంటే ప్రత్యేక నిధుల పేరుతో కేవలం రూ.50కోట్లతో కేంద్రం చేతులు దులుపుకోవడాన్ని తెలుసుకుని జిల్లా ప్రజలు తట్టు కోలేకపోయారు. ఇదే తరహాలో ఐదేళ్ల పాటు ఇచ్చినా రూ.250కోట్లు దాటవు. జిల్లా అభివృద్ధికి ఎటూ సరిపోవు. ఇప్పటికే నిధుల్లేమి, లోటు బడ్జెట్ కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ నిధులతోనైనా గట్టెక్కుతామనుకుంటే కేంద్రం ప్రత్యేక నిధుల పేరుతో సరిపెట్టింది. -
నీలిట్.. అవుట్!
ఎచ్చెర్ల: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం.. ప్రభుత్వాలు మారడం సహజం. వాటితోపాటు కొన్ని విధానాలూ మారుతుంటాయి. అంతేకానీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజె క్టులు అటకెక్కుతాయా?.. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు ఆగిపోవలసిందేనా??.. గత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు పరిస్థితి ఈ సందేహాలను రేపుతోంది. ఆందోళన కలిగిస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నీలిట్ ప్రాజెక్టు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడి విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి అవుతున్నా దాని గురించి ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు మనుగడప అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వం చివరినాళ్లలో శ్రీకాకుళం జిల్లాకు నీలిట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సంస్థను మంజూరు చేసింది. రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టే దీని నిర్మాణానికి ఎచ్చెర్ల మండలం కుశాలపురం సమీపంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శంకుస్థాపన చేశారు. అదే ప్రాజెక్టుకు తిరిగి అదే ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత కోటబొమ్మాళి మండలం తర్లికొండపై మరోసారి శంకుస్థాపన చేయించారు. అయితే తర్లికొండ గ్రామీణ ప్రాంతం కావడం, జిల్లా కేంద్రం సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని భావించి శ్రీకాకుళం పాలిటెక్నిక్ సమీపంలోని స్థలాన్నే ఖరారు చేశారు. దేశంలో 24వ ప్రాజెక్టు దేశంలో ప్రస్తుతం 23 నీలిట్ సంస్థలు ఉన్నాయి. 24వ సంస్థను శ్రీకాకుళానికి కేంద్ర ఐటీ శాఖ మంజూరు చేసింది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేటు రంగంలో ఉఫాది కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం వంటి గ్రామీణ జిల్లాల యువతకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ సంస్థ నిర్మాణం పూర్తి అయ్యి శిక్షణలు ప్రారంభమైతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత ఆశతో ఎదురుచూస్తుండగా ఎన్నికలు జరిగి కేంద్రా, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయే తప్ప శిలాఫలకం పడిన నీలిట్ ప్రాజెక్టు గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు సైతం లభించాయని శంకుస్థాపన సమయంలో కృపారాణి ప్రకటించినా.. ఏడాది గడుస్తున్నా దీని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దాంతో ఆ ప్రాజెక్టు దాదాపు అటకెక్కినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ, జిల్లా మంత్రి చొరవ తీసుకొని జిల్లాకు మంజూరైన ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విద్యావంతులు కోరుతున్నారు. -
కాంగ్రెస్‌కు జయంతి షాక్
-
కాంగ్రెస్‌కు జయంతి షాక్
* నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు.. పార్టీకి రాజీనామా * పర్యావరణ అనుమతుల్లో రాహుల్ జోక్యం చేసుకునేవారు * కీలక ప్రాజెక్టులపై ‘సూచనలు’ పంపేవారు * పార్టీ సేవల కోసమని మంత్రి పదవికి రాజీనామా చేయించారు చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు! కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూపీఏ హయాంలో కీలకమైన ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల విషయంలో రాహుల్ జోక్యం చేసుకునేవారని గుట్టును బయటపెట్టారు. దీంతో అటు కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ పడగా.. ఇటు అధికార బీజేపీ చేతికి కొత్త అస్త్రాలు అందాయి. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై సమీక్ష జరుపుతామని కేంద్రం సంకేతాలు పంపగా.. సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముంగిట జయంతి ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. రాహుల్ వల్లే తప్పుకుంటున్నా... రాహుల్‌గాంధీ తీరు వల్లే మనస్తాపానికి గురై పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జయంతి నటరాజన్ చెప్పారు. అనుమతులపై రాహుల్ నుంచి వచ్చిన ‘సూచనలు’ పాటించానని, అయినా పార్టీ తనను అవమానాలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లుగా తెలిపారు. శుక్రవారం ఆమె చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. తమిళనాడు కాంగ్రెస్ ట్రస్టీ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నా. నేను మంత్రిగా ఏ తప్పూ చేయలేదు. దీనిపై ఎలాం టి విచారణ ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినట్టు తేలితే జైలుకెళ్లడానికైనా, ఉరిశిక్షకైనా సిద్ధమే’’ అని స్పష్టంచేశారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలను కలిసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. యూపీఏ-2 లో పర్యావరణ, అటవీశాఖ మంత్రి(ఇండిపెండెంట్)గా పనిచేసిన జయంతి, 2013, డిసెంబర్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘పర్యావరణ అనుమతులపై నేను చట్టాలు, పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యవహరించా. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. వేదాంత ప్రాజెక్టు విషయంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నా. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో స్వచ్ఛంద సంస్థలు లేవనెత్తిన అభ్యం తరాలను ప్రముఖంగా పేర్కొంటూ రాహుల్ నుంచి సందేశాలు అందాయి’’ అని జయంతి నటరాజన్ వివరించారు. పార్టీ ఆదేశాల మేర కు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాహుల్ కార్యాలయం కేంద్రంగా తనను ఇబ్బంది పెట్టే చర్యలు కొనసాగాయన్నారు. కొందరు బడా పారిశ్రామిక వేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి రాహుల్ ఫిక్కీలో తనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్నారు. తన తప్పేంటో తెలుసుకునేందుకు సోనియాను, రాహుల్‌ను కలిసేం దుకు అనేకసార్లు ప్రయత్నించినా వారు భేటీకి నిరాకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న తనను... పార్టీ సేవల పేరుతో మంత్రి పదవి నుంచి తొలగించారని, తర్వాత 11 నెలలపాటు పార్టీకి దూరంపెట్టడం ఆవేదనకు గురిచేసిందన్నారు. రాహుల్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ జయంతి ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ను కాంగ్రెస్ వెనకేసుకొచ్చింది. అమె అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఆమె అవినీతికి పాల్పడ్డారంటూ ‘జయంతి ట్యాక్స్’ పేరుతో లోక్‌సభ ఎన్నికల ముంగిట బీజేపీ విమర్శలు గుప్పించడంతోనే రాజీనామా చేయించాల్సి వచ్చిందన్నారు. పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలను జయంతి నటరాజన్‌కు ముందు అదే శాఖకు మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్, ఆమె తర్వాత మంత్రి గా కొనసాగిన ఎం.వీరప్పమొయిలీ ఖండించారు. రాహుల్‌గానీ, సోనియాగానీ ఏనాడూ తమ విధులు, నిర్ణయాల్లో జోక్యం చేసుకునేవారు కాదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘కొత్త రాజకీయ బాసులు’ చెప్పినట్టు ఆమె నడుచుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు. ఆమెపై చట్టపరం గా చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాలు లేనందునే చివరికి మంత్రి పదవి నుంచి తొలగించాల్సి వచ్చిందన్నారు. దురుద్దేశంతోనే రాహుల్‌పై జయంతి ఆరోపణలు చేశారని, ఈ అంశాలను ఏడాది కాలంగా పార్టీ వేదికలపై ఎందుకు ప్రస్తావించలేదని అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రశ్నించారు. సోనియాకు జయంతి రాసిన లేఖలోని ముఖ్యాంశాలివీ.. పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణం-పరిశ్రమల మధ్య సమతూకం పాటించాలన్న దివంగత ఇందిర, రాజీవ్‌ల స్ఫూర్తికి అనుగుణంగానే నేను నా శాఖ విధులు నిర్వర్తించాను. ఎన్ఏసీ చైర్‌పర్సన్‌గా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై మీరు లేఖలు రాశారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి ‘ప్రత్యేక వినతులు’ వచ్చేవి. వాటిని నేను గౌరవించాను. పర్యావరణ, అటవీశాఖలకు స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. 2013, డిసెంబర్ 20న ప్రధాని మన్మోహన్సింగ్ నన్ను పిలిచారు. నేను వెళ్లగానే ఆయన లేచి నిలబడ్డారు. కాస్త ఆందోళన, వ్యాకులతతో కనిపించారు. ‘జయంతి, మీ సేవలు పార్టీకి అవసరమని పార్టీ అధ్యక్షురాలు సోనియా నాతో చెప్పారు’ అని అన్నారు. నాకు అర్థం కాలేదు. ‘‘సరే సర్, అయితే నేనేమి చేయాలి’ అని అడిగా. ‘ఆమె(సోనియా) మిమ్మల్ని రాజీనామా చేయాలన్నారు’ అని ప్రధాని అన్నారు. నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ‘రాజీనామా..?ఎప్పుడు సర్?’ అని అడిగా. ‘ఈరోజే’ అని ప్రధాని బదులిచ్చారు. నేను ఒక్కమాట మాట్లాడలేదు. ‘అయితే సరే’ అని నవ్వుతూ చెప్పా. మీపై పూర్తి విశ్వాసంతో రాజీనామా చేశా. ఈలోగానే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాలో నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. నేను రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్‌గాంధీ ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఫిక్కీలో రాహుల్ ఆ మాటలు చెప్పేందుకే మీతో రాజీనామా చేయించారా అని మీడియా నన్ను అడిగింది. అనుమతుల విషయంలో నేను ఎప్పుడూ అవరోధంగా నిలవలేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతుల జాప్యంలో నేను బాధ్యురాలిని కాదు. ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై జరుగుతున్న దాడితో తీవ్రంగా కలత చెందా. నా రాజీనామా, ఫిక్కీలో ప్రసంగంపై నేను రాహుల్‌కి ఒక మెసేజ్ పంపా. ఇలా చేయడానికి నేను చేసిన తప్పేమిటని అడిగా. నేనేమైనా తప్పు చేసి ఉంటే.. వివరణ అడగాల్సిందని వేడుకొన్నా. ఆయనను కలుసుకునేందుకు సమయం కావాలని అడిగా. ‘నేను కాస్త బిజీగా ఉన్నా. మళ్లీ కలుద్దాం’ అని రాహుల్ బదులిచ్చారు. ‘స్నూప్‌గేట్’ విషయంలో ఇప్పటి ప్రధాని మోదీపై దాడి చేయాల్సిందిగా నాకు సూచించారు. తొలుత నేను అం దుకు నిరాకరించా. నేను అప్పడు మంత్రిగా ఉన్నందున ప్రభుత్వం తరఫున దీనిపై మాట్లాడేందుకు తిరస్కరించా. ఇది ‘ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయం’ అని పార్టీ నాయకత్వం చెప్పటంతో. తప్పనిసరై దానిపై మాట్లాడాల్సి వచ్చింది. (ఈ లేఖను జయంతి నటరాజన్ 2014 నవంబర్ 5న సోనియాకు రాశారు) -
పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష: జైట్లీ
న్యూఢిల్లీ: పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం యూపీఏ పాలనపై గురి పెట్టింది! వివిధ ప్రాజెక్టులకు యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని ప్రకటించింది. నాడు పర్యావరణ శాఖలో రాహుల్ జోక్యం చేసుకోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటోంది. ‘పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఆరోపణలు చూస్తుంటే.. యూపీఏ సర్కారు శాడిస్టు ఆర్థిక విధానాలు అవలంబించినట్లు స్పష్టమవుతోంది. చట్టాలతో నిమిత్తం లేకుండా వారి అనుంగులకే అనుమతులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో ప్రాజెక్టులకు ఇచ్చిన లేదా నిరాకరించిన పర్యావరణ అనుమతులపై ప్రస్తుత పర్యావరణ శాఖ సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం విలేకరులతో అన్నారు. అనుమతుల విషయంలో ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే యూపీఏ హయాంలో వృద్ధిరేటు కుంటుపడిందన్నారు. -
పెట్రో నిరసన
పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెన్నై:యూపీఏ హయూంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయూయి. నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో చమురు ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ధర నిర్ణయూనికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల పదిహేనో తేదీ, నెలాఖరులో చమురు ధరల్ని సమీక్షించి ధర నిర్ణయించే పనిలో చమురు సంస్థలు పడ్డాయి. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు నుంచి ఈనెల 14 వరకు పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే, ఈ తగ్గుదల కారణంగా తాము నష్ట పోవాల్సి వస్తున్నదని పెట్రోల్ బంక్, చిల్లర వర్తక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అధిక ధరకు తాము కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండగానే, ధరను తగ్గించడం వలన తాము నష్టాన్ని చవి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చమురు సంస్థలు పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్ల గోడును పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. దీంతో చమురు సంస్థలపై కన్నెర్ర చేస్తూ ఒక రోజు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి యజమానుల సంఘాలు నిర్ణయించాయి. 31న కొనుగోళ్ల బంద్ పెట్రోల్ బంక్, చిల్లర వర్తక డీలర్ల సంఘం అధ్యక్షుడు కేపీ మురళి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రధాని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక పలు మార్లు ధరల్ని తగ్గించారని వివరించారు. ఐదు సార్లు పెట్రోల్, నాలుగు సార్లు డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్నారు. ధరల తగ్గింపు గురించి ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చిన పక్షంలో కొనుగోళ్లు తగ్గించి స్టాక్ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 15న ధర తగ్గింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉందని, ఆ రోజున సెలవు దినం కావడంతో 16న ప్రకటించారని వివరించారు. ఈ కారణంగా తమకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ధర తగ్గడంతో నిల్వ ఉన్న స్టాక్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు యజమానులు రూ.150 కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశారని తెలిపారు. రాష్ట్రంలో ఒక రోజుకు రెండు కోట్ల 40 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని, ఒక రోజు కొనుగోళ్లను నిలిపి వేసిన పక్షంలో నష్టం చమురు సంస్థలకు, పన్ను రూపంలో కేంద్రానికి తప్పదని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లోని ట్యాంకుల్ని సకాలంలో శుభ్రం చేయకుంటే తొలి హెచ్చరికగా రూ.పది వేలు, రెండో హెచ్చరికగా రూ.20 వేలు చొప్పున జరిమానా విధించబోతున్నట్టుగా పెట్రోలియం శాఖ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2012 క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం తమ మీద చర్యలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం చర్యల్ని వ్యతిరేకిస్తూ, ధరల వ్యవహారంలో తమకు ఎదురవుతున్న నష్టం భర్తీతోపాటుగా పలు రకాల డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించామని ప్రకటించారు. ఒక్క రోజు తాము కొనుగోలు చేయని పక్షంలో రూ.50 కోట్ల మేరకు పన్ను నష్టం తప్పదని హెచ్చరించారు. తమ పిలుపునకు రాష్ట్రంలో 4590 పెట్రోల్ బంక్ యజమానులు కదిలారని, తమ డిమాండ్ల మీద కేంద్ర, చమురు సంస్థలు దృష్టి పెట్టని పక్షంలో తమ నిరసన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వీరి నిరసన పుణ్యమా అని ఫిబ్రవరి ఒకటో తేదీ పెట్రోల్, డీజిల్ కొరత రాష్ర్టంలో ఏర్పడే అవకాశాలున్నాయి. పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
కొనసాగుతున్న కష్టాలు
వేలాది మంది గ్యాస్ వినియోగదారులకు అందని సబ్సిడీ సొమ్ము బ్యాంక్‌లు, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న జనం ఏమీ చేయలేమని చేతులెత్తేసిన బ్యాంకర్లు, డీలర్లు నగరంలోని సూర్యారావుపేటకు చెందిన మహాలక్ష్మి డిసెంబర్లో గ్యాస్ కొనుగోలు చేశారు. సబ్సిడీ డబ్బు ఆమె బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఆమె బ్యాంక్ ఖాతాలో మాత్రం పేమెంట్ హోల్డ్ అని ఉంది. సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో సంప్రదించగా తమకు సంబంధం లేదని బదులిచ్చారు. బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లగా ఆమె కొనుగోలు చేసిన గ్యాస్‌కు సంబంధించి ఎటువంటి నగదు రాలేదని చెప్పారు. దీంతో తాను ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ఆర్థంకావడం లేదని మహాలక్ష్మి వాపోతున్నారు. కంకిపాడుకు చెందిన ఓ వినియోగదారునికి కూడా ఈ నెల మొదటి వారంలో కొనుగోలు చేసిన సిలిండర్‌కు సంబంధించిన సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. బ్యాంక్ అధికారులను సంప్రదించగా ‘ఫెయిల్డ్’ అని వస్తోందని, సబ్సిడీ డబ్బు వచ్చి వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారని ఆయన తెలిపారు. తన అకౌంట్లో జమ కాకుండా డబ్బు వచ్చి వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరిగి తనకు సబ్సిడీ మొత్తం రావాలంటే ఏంచేయాలో తెలియడం లేదని లబోదిబోమంటున్నాడు. విజయవాడ : గ్యాస్ వినియోగదారులను ఆధార్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆధార్ అనుసంధానం పూర్తయినప్పటికీ వేలాది మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమకావడం లేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 11లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్యాస్‌కు ఆధార్‌తో లింకును తొలగించింది. అయితే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ మళ్లీ మూడు నెలల క్రితం గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు నేరుగా సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. ఆధార్ సీడింగ్ పూర్తయిన వారికి ప్రత్యేక సంస్థ ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమచేస్తోంది. ఆధార్ అనుసంధానం కాని వారు ఫిబ్రవరి 14 నుంచి నుంచి గ్యాస్ సిలిండర్‌ను రూ.778లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆధార్ సీడింగ్ పూర్తయినా తప్పని కష్టాలు బ్యాంక్ ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీలో ఆధార్ నంబరు అనుసంధానం చేయించుకున్న వేలాది మందికి సబ్సిడీ సొమ్ము అందడం లేదు. గ్యాస్ సిలిండర్‌కు రూ.778 చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ధర రూ.441.50 కాగా, సబ్సిడీ సొమ్ము రూ.336.50 వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఒక్కో గ్యాస్ ఏజెన్సీ, బ్యాంక్ చుట్టూ వందలాది మంది వినియోగదారులు తిరుగుతున్నారు. కొందరి ఖాతాల్లో ఫెయిల్డ్ అని, మరికొందరి ఖాతాల్లో పేమెంట్ హోల్డ్ అని మెసేజ్ నమోదవుతోంది. కొందరికి సబ్సిడీ జమ అయి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఆధార్ అనుసంధానం కోసం బ్యాంక్ ఖాతాలు తెరచి, ఆ తర్వాత మూడు నెలలు వాడకపోతే అవి రద్దయ్యాయని కొన్ని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఆధార్ నంబరును తమ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులకు ఏమి చెప్పాలో కూడా అర్థంకావడం లేదని గ్యాస్ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ వెంటనే చమురు కంపెనీల అధికారులు, గ్యాస్ డీలర్లు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఆర్డినెన్స్ పాలన!
ఎన్నిసార్లు ఎంత ఘనంగా సంకల్పం చెప్పుకున్నా మన పార్లమెంటును సజావుగా నడపడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదని మళ్లీ రుజువైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేసరికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఉంది. సమావేశాలు ముగిసే రోజున జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో సైతం ఆ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ ఎన్నికలన్నిటా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఆ రకంగా కేంద్రంలో పాలకపక్షం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు పార్లమెంటును నడపడం దానికి కష్టం కాకూడదు. లోగడ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు వాయిదాల ప్రమేయం లేకుండా ఒక్కరోజు కూడా పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోయింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండు కోసం ఒక సందర్భంలో మొత్తంగా సమావేశాలే చాపచుట్టుకుపోయాయి. ఇప్పుడు సైతం అవే దృశ్యాలు కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఎవరినో తప్పుబట్టడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి తక్షణావసరం. ఆ సంగతలా ఉంచి...నరేంద్ర మోదీ సర్కారు ఈ సమావేశాల్లో ఆమోదం పొంది ఉండాల్సిన రెండు ప్రధాన బిల్లుల స్థానంలో శుక్రవారం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. ఒకటి బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 26 శాతంనుంచి 49 శాతానికి పెంచడానికి వీలు కల్పించేదైతే...రెండోది రద్దయిన బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చట్టసభలు ఉన్నతమైనవనీ... వాటిని విస్మరించి ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిద్దామని భావించడం రాజ్యాంగ విరుద్ధమనీ 1986లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాల్సింది శాసనవ్యవస్థే తప్ప కార్యనిర్వాహకవ ర్గం కాదని ఆ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చట్టసభల నిర్వహణ సాధ్యపడని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని రాజ్యాంగంలోని 123వ అధికరణం కూడా సూచిస్తున్నది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూనే... ఆర్డినెన్స్ జారీ అత్యవసరమన్న అంశంలో ఆయన ముందుగా సంతృప్తి చెందాల్సి ఉంటుందని కూడా అన్నది. వాస్తవానికి ఆర్డినెన్స్‌లు జారీచేయడం దొడ్డిదారి పాలనతో సమానం. బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆర్డినెన్స్ విధానాన్ని చట్టబద్ధం చేశారు. ఏ ప్రజాస్వామిక దేశంలోనూ ఇలాంటి పద్ధతి ప్రస్తుతం అమలులో లేదు. కాలం చెల్లిన చట్టాలను తొలగించడానికి నడుం బిగించిన మోదీ సర్కారు ఇలాంటి అప్రజాస్వామిక చట్టాల ఆధారంగా ఆర్డినెన్స్‌లను జారీచేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల పునఃవేలం అత్యవసరమైనదే. వాటి కేటాయింపులో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్నందున రెండేళ్లనుంచి అనేక పరిశ్రమలు అనిశ్చితిలో పడ్డాయి. మార్చి 31లోగా బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని, అందులో మళ్లీ ఆ క్షేత్రాలను సొంతం చేసు కున్న సంస్థలకే చోటుంటుందని, మిగిలినవాటికి అవి రద్దవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక వేలం ప్రక్రియ ప్రారంభించడం ముఖ్యమే. బీమా బిల్లుకు సంబంధించినంత వరకూ వామపక్షాలు మినహా ఇతర పార్టీలేవీ దాన్ని వ్యతిరేకిం చడంలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక అవగాహనకొచ్చాయి. అయితే, మత మార్పిళ్ల వ్యవహారంలో ప్రధాని హామీ ఇవ్వాలన్న విపక్షాల డిమాండును అంగీకరించని కారణంగా ఏర్పడ్డ పరిణామాలవల్ల ఇలా అంగీకారం కుదిరిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం పడింది. బొగ్గు క్షేత్రాల వేలం గురించి అయితే ఆర్డినెన్స్ అవసరం ఉన్నదనుకున్నా బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు విషయం దాదాపు ఆరేళ్లుగా నానుతున్న సమస్య. అది మరికొన్ని నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తగ్గబోమని ప్రపంచానికి చాటడం కోసమే బీమా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం అంటున్నది. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు వివాదాస్పదమైన అంశం. దాన్ని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జీవిత బీమా, ఇతరత్రా బీమా రంగాల్లో ప్రస్తుతం 52 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో 5 మాత్రమే ప్రభుత్వరంగసంస్థలు. భారత్‌లో 36 కోట్లమంది జీవిత బీమా పాలసీదారులున్నారని ఈమధ్యే సిగ్మా నివేదిక వెల్లడించింది. బీమా రంగంలో సంస్కరణలు మొదలై దశాబ్దం దాటుతున్నా ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీదే అందులో ఆధిపత్యం. ఈ మార్కెట్లో దాని వాటా 71 శాతం. పార్లమెంటులో బీమా బిల్లును పెట్టి చర్చలు సాగనిస్తే ఈ విషయంలో ఎవరి వాదన ఏమిటో దేశ ప్రజలకు తెలుస్తుంది. ఆ నిర్ణయంలోని మంచిచెడ్డలపై కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాలను పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తీసుకురావడం ప్రజా స్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఏర్పాటు కాదని... ఒకవేళ ఆర్డినెన్స్ మురిగి పోతే తమ పెట్టుబడులు అనిశ్చితిలో పడతాయని విదేశీ సంస్థలకు తెలియదా? నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో చర్చించడం ద్వారా, అందరినీ కలుపుకొని వెళ్లడంద్వారా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సత్సంప్రదాయానికి శ్రీకారం చుడితే బాగుండేది. అలా చేయకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమని పాలకులు గ్రహించాలి. -
వివాదాలతో కాలక్షేపం!
పదేళ్ల యూపీఏ పాలన తీరుతెన్నులు చూశాక దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీకి పట్టంగట్టారు. సర్వేలన్నీ విజయం ఖాయమని చెబుతున్నా రాష్ట్రాల్లో కలిసొచ్చిన వారందరినీ కలుపుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా జనం ముందుకు వెళ్లినా సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల సంఖ్యాబలాన్ని బీజేపీ పొందగలిగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అందరిలోనూ నెలకొన్న విశ్వాసమే అందుకు కారణం. ధరలను అదుపు చేస్తామని, ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తిరిగి రప్పిస్తామని ఆ పార్టీ ఇచ్చిన హామీలు అందరినీ ఆకట్టుకున్నాయి. కుల, మత, ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా జనం ఒక్కటై బీజేపీకి ఓటేశారు. మోదీ ప్రభుత్వం ఏదో చేస్తున్నదనీ, వాటి ఫలితాలు అందబోతాయని వారందరూ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ విషయమై చర్చలు జరిగి తమ నుంచి జనం ఆశిస్తున్నదేమిటో, ఈ విషయంలో తాము ఇంకా చేయాల్సిందేమిటో బీజేపీ తెలుసుకోగలిగితే ఆ పార్టీ బలం మరింతగా ఇనుమడిస్తుంది. అలాంటిదేమీ జరగకపోగా ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, మాట్లాడుతున్న మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ‘మోదీ అంటే ఇష్టంలేనివారు పాకిస్థాన్ పొండ’ంటూ వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్ తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యారు. అయినా ఆయన తన బాణీని మార్చుకోలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను బంగారు జింక రూపంలో ఉన్న రాక్షసుడంటూ అభివర్ణించారు. మరో మంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీలో పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోవాల’ంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభలూ స్తంభించాక స్వయంగా నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఆమె వ్యాఖ్యలు తప్పేనని వివరణనివ్వాల్సి వచ్చింది. ఆ గొడవ సద్దుమణగకముందే మరో ఎంపీ సాక్షి మహరాజ్ రంగంలోకొచ్చారు. ఆయన మహాత్ముడి హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించారు. అతను ‘పొరపాటున’ ఏమైనా చేసి ఉండొచ్చుగానీ దేశద్రోహి మాత్రం కాడంటూ వెనకేసుకొచ్చారు. జాతిపితగా ఈ దేశ ప్రజల మన్ననలందుకుంటున్న మహాత్ముడిని కాల్చిచంపడం ఆయన దృష్టిలో నేరం కాదు... కేవలం ‘పొరపాటు’ మాత్రమే! తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన తర్వాత వివరణ ఇచ్చి ఉండొచ్చుగానీ కెమెరాలు అబద్ధం చెప్పవు. ఆ విషయంలోనూ రాజ్యసభలో వివాదం చెలరేగాక మహాత్ముడి హంతకుడిని పొగిడే ఎలాంటి అంశాలకైనా ప్రభుత్వం వ్యతిరేకమని ప్రభుత్వం వివరణనిచ్చుకోవాల్సివచ్చింది. ఇదంతా ఇట్లా సాగుతుండగానే ఆగ్రాలో జరిగిన మత మార్పిళ్లు లోక్‌సభలో వివాదాన్ని రేపడం, దానిపై కూడా సర్కారు వివరణనివ్వడం తప్పలేదు. మరోపక్క అయోధ్యలో సాధ్యమైనంత త్వరగా రామమందిరం నిర్మించాలని ఈ దేశ పౌరులు కోరుకుంటున్నారని యూపీ గవర్నర్ రాంనాయక్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా కోర్టు విచారణలో ఉన్న ఈ వివాదంపై రాజ్యాంగ పదవిలో ఉన్న రాంనాయక్ ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థంకాని విషయం. అభివృద్ధి నినాదంతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఆర్థికరంగంలో అందుకు దోహదపడగల అనేక సంస్కరణలు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఆ అంశాలకు సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పింది. ఆ బిల్లులు సజావుగా ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పక్షాల మద్దతూ అవసరం. బీజేపీ ఆ దిశగా చేస్తున్న కృషి ఏమిటో తెలియదుగానీ ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు మాత్రం కావలసినన్ని వివాదాలను నెత్తికెక్కించుకుంటున్నారు. నిరంజన్ జ్యోతి విషయంలో తల బొప్పికట్టాకైనా తమ ఎంపీలను, తమకు మద్దతుగా నిలుస్తున్న సంఘ్ పరివార్ సంస్థలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో మోదీ ఎందుకున్నారో అర్థంకాదు. చెదురుమదురుగా సాగుతున్నట్టు కనబడుతున్న ఈ వ్యాఖ్యల వెనక ఒక పకడ్బందీ పథకం ఉన్నదనీ... ఈ దేశంలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న సెక్యులర్ భావజాలాన్ని దెబ్బతీయడమే దాని లక్ష్యమని కొందరు చేస్తున్న విశ్లేషణల్లో వాస్తవం ఉన్నదని ఎవరైనా అనుకుంటే అందుకు ప్రధాన బాధ్యత బీజేపీదే అవుతుంది. సుపరిపాలన అందిస్తామని, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన పార్టీ... ఆ విషయంలో తమ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమిటో ప్రజలకు చెప్పవలసిన తరుణంలో ఇలా ఇతరేతర విషయాలపై తన శక్తియుక్తులన్నీ ధారపోయడం, నిత్యం సంజాయిషీలతో కాలక్షేపం చేయడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచదని బీజేపీ నాయకగణం గుర్తించాలి. ఒకపక్క మోదీ ‘మేకిన్ ఇండియా’ అని పిలుపునిస్తారు. కానీ, దేశంలో ప్రశాంత వాతావరణం లేకుండా ‘మేకిన్ ఇండియా’ విజయవంతం కావడం సాధ్యమేనా? సార్వత్రిక ఎన్నికల ముందు ఈ తరహా వివాదాలను రేకెత్తించి ఉంటే, అభద్రతను పెంచే వ్యాఖ్యలు చేసివుంటే అంతటి ఘనవిజయం సాధ్యమయ్యేదా? అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ నరేంద్ర మోదీ పూర్తిగా తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నారు. తాను అనుకున్నవారికే కీలక పదవులిచ్చారు. వద్దనుకున్నవారిని ఎంతటి సీనియర్లయినా పక్కనబెట్టారు. రెండుచోట్లా పూర్తి పట్టు సాధించిన నాయకుడన్న అభిప్రాయం కలిగించారు. కానీ ఇలాంటి వివాదాలు ఆ అభిప్రాయాన్ని పలచనచేస్తాయి. అధికారంలోకొచ్చి ఆర్నెల్లు పూర్తవుతున్న తరుణంలో ఇప్పటికైనా పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని... అనవసర వివాదాలకూ, ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని బీజేపీ గుర్తించడం అవసరం. -
బొగ్గు ప్రైవేటీకరణకు కుట్ర
ప్రధాని మోదీపై సోనియా ధ్వజం పటాందా: బొగ్గు రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు వేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజలను బలిచేసి జార్ఖండ్‌లోని బొగ్గును కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు మోదీ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని పటాందాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోనియా మాట్లాడారు. గిరిజనులు, దళితుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం, భూసేకరణ, ఉపాధి హామీ చట్టాలను మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల అక్కడి గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, దీనివల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారని విమర్శించారు. ఖనిజ సంపద అపారంగా ఉన్న జార్ఖండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు లూటీ చేశాయని, అందువల్ల ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కాగా, సోనియా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె 90 నిమిషాలపాటు విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమె వేరే విమానంలో పటాందాకు వెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కిశోర్ చెప్పారు. జార్ఖండ్‌లో డిసెంబర్ 2న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
‘గ్యాస్’ మాటలేనా!
ఇన్ బాక్స్: గతంలో యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అప్పట్లోనే అయోమయంగా మారింది. మళ్లీ ఇప్పుడు తాజాగా గ్యాస్‌కు నగదు బదిలీ పథ కం అమలు చేస్తామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటిం చింది. పథకాలను ప్రవేశపెట్టిన తరు వాత దాని అతీగతీ పట్టించుకోరు. దీని వల్లే అనేకమంది సమిథలుగా మారు తున్నారు. గ్యాసును తీసుకోవడానికి పని మానేసి ఉద్యోగులు, కూలిపను లకు వెళ్లేవాళ్లు నిరీక్షిస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేసి సబ్సిడీని బ్యాంకులో వేస్తామని చెప్పి వారం రోజు లు గడువు విధిస్తూ వినియోగదారులకు మొబైల్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. సబ్సిడీలు బ్యాం కులో వేయడంకన్నా, ఇప్పుడు ఉన్న పద్ధతిని అవలం బిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సబ్సిడీలు తప్పుదారి పట్టకుండా పకడ్బందీగా గ్యాస్‌ను అందిం చేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జైని రాజేశ్వర్ గుప్త కాప్రా, హైదరాబాద్ -
ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
గండేపల్లి : రుణమాఫీని తప్పక చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం ప్రకటించారు. శుక్రవారం మండలంలోని మురారి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందని అయినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేయగా, రాష్ట్రంలో 13 జిల్లాలకు కలిపి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్ల రుణమాఫీకి ముందుగా 20 శాతం ఇచ్చి, మిగిలిన 80 శాతానికి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ చైతన్యరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పి.చిట్టిబాబు, ఎంపీపీ డి.సుశీల, వైస్ ఎంపీపీ పోతుల మోహనరావు, జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ బులి వీరమ్మ, కందుల కొండయ్యదొర, గోదావరి డైయిరీ చైర్మన్ కొడాలి చంటిబాబు, జ్యోతుల చంటిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ కె. రమేష్, తహశీల్దార్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 36 కొత్త పింఛన్లు అందజేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగపర్చుకోవాలి బ్యాంకు సేవలను సద్వినియోగపరచుకోవాలని గండేపల్లి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ కొక్కిరి మహాలక్ష్మి జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులకు తెలిపారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. పింఛను లబ్ధిదారుల ఇబ్బందులు ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఉపాధికి ఎసరుతెచ్చే పథకం!
పల్లెసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసమంటూ తొమ్మిదేళ్లక్రితం అమల్లోకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఏ)అటకెక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. పనిచేసే హక్కునూ, జీవనభద్రతనూ కలగజేసే ఉద్దేశంతో 2006లో ఈ పథకానికి పురుడు పోసి, చట్టబద్ధతనుకూడా కల్పించిన యూపీఏ సర్కారే... క్రమేపీ దాని ఊపిరి తీసే ప్రయత్నం చేయగా, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు స్పష్టమవుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 650 జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ఇకపై వెనకబడిన 200 జిల్లాలకే పరిమితం చేసేందుకు పథకరచన సిద్ధమైందన్న కథనాలు ఇటీవలికాలంలో వెలువ డుతున్నాయి. దానికితోడు వేతనం, ఆస్తుల నిర్మాణ సామగ్రి నిష్పత్తిని ఇప్పుడున్న 60:40నుంచి 51:49కి మార్చదల్చుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి ఆలోచన మంచిదికాదని...పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చేయ త్నాలు చేయడంవల్ల పల్లెసీమలు మళ్లీ ఆకలితో నకనకలాడతాయని ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో ఇప్పటికే హెచ్చరించారు. ఉపాథి హామీ పథకం సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగ లిగారు. ఉన్న ఊరునూ, అయినవారినీ విడిచిపెట్టి పొట్టచేతబట్టుకుని ఎక్కడె క్కడికో వలసపోవలసివచ్చే దిక్కుమాలిన రోజులుపోయి ఉన్నచోటనే వారికి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్లో ఆసరాగా నిలిచింది. లబ్ధిదారుల్లో సగంకంటే ఎక్కువమంది దళిత కులాలకు చెందినవారుగనుక ఆ వర్గాలకు ఎంతో ప్రయోజ నకరంగా మారింది. పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు రెట్టింపయ్యాయి. రోజుకు రూ. 120 వచ్చేచోట రూ. 250 వరకూ రావడం మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది. పథకానికయ్యే వ్యయంలో కేంద్రానిది 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతంకాగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఈ పథకం వాటా 0.3 శాతం. అయితేనేం ఇది ఏటా 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా మూడు నెలలపాటు భరోసా కల్పించింది. శ్రమదోపిడీనుంచి వారిని కాపాడింది. పథకం కింద చేసే పనుల్లో వేతనాల వాటా ఖచ్చితంగా 60 శాతం ఉండాలన్న నిబంధనవల్ల శ్రామికులకుఎంతగానో మేలు కలిగింది. బెంగళూరు ఐఐఎం 2009లో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ప్రభావంపై సర్వే చేసినప్పుడు అక్కడ వలసలు గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. గ్రామ సభల ద్వారా గుర్తించిన పనుల్ని చేపట్టడంలో, అవతవకలు జరిగినచోట రికవరీలు చేయడంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముందుందని సర్వే తేల్చింది. ఈ పథకంవల్లనే యూపీఏ 2009లో వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత యూపీఏ సర్కారు దీని పీకనొక్కడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఎన్నికలు లేవుగదానన్న భరోసాతో కేటాయింపులను కత్తిరించడం ప్రారంభించింది. బకాయిల చెల్లింపులో అలవిమాలిన జాప్యమూ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పేద జనానికి ప్రభుత్వం రూ. 4,800 కోట్లు బకాయిపడిందని ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్ చెబుతున్నదంటే పరిస్థితి ఎక్కడికొచ్చిందో సులభంగానే అర్థమవుతుంది. అంతేగాదు...ఈ ఎనిమిదేళ్లలోనూ ఆ పథకానికి రూ. 33,000 కోట్ల మేర కేటాయింపులు తగ్గిపోయాయి. బకాయి పడితే శ్రామికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్న చట్ట నిబంధన తర్వాత కాలంలో ఎగిరిపోయింది. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది. మరోపక్క అనేక రాష్ట్రాల్లో భారీయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు దారిమళ్లించాయి. ఈ ఎనిమిదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 2.60 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్ల రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే. పథకం అమలులో తగినంత జవాబుదారీతనం, పారదర్శకత ప్రవేశపెడితే ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా అనుత్పాదక పనులు చేపట్టిన పక్షంలో గట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరిస్తే మంచిదే. వ్యవసాయ పనులకు దాన్ని అనుసంధానించడం ఎలాగో ఆలోచించవచ్చు. సామాజిక ఆడిట్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయొచ్చు. ఇంకేమి సంస్కరణలు చేస్తే అది మరింతగా మెరుగుపడుతుందో చర్చించవచ్చు. కానీ, ఎలుకలు జొరబడ్డాయని కొంపకు నిప్పెట్టుకున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి మూలనపడేయాలని చూస్తున్నట్టు కనబడుతున్నది. అసలు దీన్ని చట్టంగా చేయడమేమిటి, పథకంగా ఉంచితే నష్టమేమిటని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ప్రశ్నించారు. పథకం మొదలైననాటినుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాబల్య వర్గాలు సణుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఆలోచనలు అలాంటి వర్గాల ప్రయోజనాలను నెరవేర్చేలా ఉన్నాయి. ఉపాధి హామీ పథకం చట్టరూపంలో ఉన్నది గనుక పార్లమెంటులో చర్చ తర్వాతే దానికి సవరణలు సాధ్యమవుతాయి. పథకానికి పరిమితులు విధించడం లేదా నీరుగార్చడం చేయక దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడమెలాగో ప్రభుత్వం ఆలోచించాలి. -
బడి చదువుకూ ‘ఆధార్’ ని‘బంధనం’
సాక్షి, రాజమండ్రి :యూపీఏ-2 సర్కారు ఏ లక్ష్యంతో దేశప్రజలకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేసినా.. దాని పర్యవసానంగా జనం- ముఖ్యంగా బడుగు జనం ముప్పుతిప్పలు పడుతున్నారు. వంటగ్యాస్‌కు ఆధార్‌ను లంకె పెట్టి, సబ్సిడీ ఎక్కడ గల్లంతవుతుందోనని కోట్లమంది కంటికి కునుకు కరువు చేసింది కేంద్రంలోని గత ప్రభుత్వం. అనంతరం ఆ లంకెను తెంచినా.. ఇప్పుడు మళ్లీ ముడిపెట్టనున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా..ఒక ప్పుడు ఆధార్ ప్రక్రియను విమర్శించిన టీడీపీ అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా అన్నింటికీ ఆధార్‌ను జోడిస్తూ పోతోంది. రేషన్‌కు, పింఛన్‌కు ఆధార్‌ను జోడించడంతో అవి లేని వారు, వాటిలోని వివరాలు సరిపోలని వారు సర్కారుపరంగా పొందే లబ్ధికి నీళ్లు వదులుకునే బెడదను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చదువులకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో కొత్తగా చేరే వారే కాదు బడిలో చదువుతున్న పిల్లలు సైతం ఆధార్ సంఖ్యతో తమ ప్రవేశ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలని ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 20 శాతం విద్యార్థుల ఆధార్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. వీరిలో సగం మంది తల్లిదండ్రులకు ఆధార్ కార్డున్నా వారి పిల్లలకు లేదు. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఉంటేనే స్కూళ్లలో ప్రవేశం అన్నది ఒక నిబంధన కానుందని, అది లేనిదే సర్కారుపరంగా అందే రాయితీలు అందవని విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నారు. అయితే దీన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు. ఆన్లైన్లో అనుసంధానం కోసమట.. విద్యార్థి వివరాలు ఆన్లైన్లో ఉంచేందుకు ఆధార్ సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఆధార్ కార్డు జిరాక్సు కాపీని పాఠశాలలో అందించాలని నెల్లాళ్లుగా ఉపాధ్యాయులు ఆదేశించారు. ఇంకా ఇవ్వని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు లేని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. కొత్తగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నా ఆధార్ ఉండాల్సిందేనని అధికారులు ఇప్పటికే కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లేని విద్యార్థులు బడి మానేసే దుస్థితి ఎదురవుతుందని ఉపాధ్యాయ సంఘాలు నిరసిస్తున్నాయి. కార్డు లేకుంటే వివరాలు దూరం.. జిల్లాలో 90 శాతానికి పైగా ఆధార్ కార్డుల జారీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ విద్యార్థుల విషయంలో వాస్తవ పరిస్థితి అలా లేదు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేసే పాఠశాలలు 5,995 ఉన్నాయి. వీటిలో ప్రాధమిక పాఠశాలలు 3967, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 977, హైస్కూళ్లు 984, హయ్యర్ సెకండరీ స్కూళ్లు 67 ఉన్నాయి. వీటిలో 7.72 లక్షల మంది ఒకటి నుంచి పదవ తరగతి వరకూ చదువుతున్నారు. వారిలో అనేకులకు ఆధార్ కార్డులు లేవు. ఉన్నా పేర్లు తప్పుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు కార్డున్నా పిల్లలకు లేవు. జిల్లాలో ఇలాంటి కారణాలతో 20 శాతం విద్యార్థులు ఆధార్ సమర్పించలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టంపై ఆధారపడ్డ కుటుంబాల వారే. తల్లిదండ్రులు ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం రావడం, పగలు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం.. ఈ క్రమంలో పలువురు పిల్లలకు ఆధార్ నమోదు చేయించలేదు. పిల్లలకు ఆధార్ అవసరం కాదన్న కొందరు నమోదు చేయించలేదు. మరి కొందరు పిల్లల అసలు పేర్లు కాక వాడుక పేర్లు ఆధార్‌లో నమోదు చేయించడంతో అవి చెల్లుబాటు కావడం లేదు. ఆధార్ కార్డు లేక పోతే విద్యార్థుల వివరాలు ఆన్లైన్ డేటా బేస్‌లో కనిపించవు. ప్రభుత్వపరంగా స్కాలర్ షిపు్పులు తదితర రాయితీలు ఆధార్ కార్డు లేనిదే వర్తించవు. ఏ కార్యక్రమానికైనా విద్యార్థుల వివరాలు కావాలనుకున్నప్పుడు ఆధార్ కార్డులు సమర్పించని వారి పేర్లు కనిపించవు. ఇందువల్లే ఆధార్ కార్డులు తప్పనిసరి అని విద్యాశాఖ హుకుం జారీ చేస్తోంది. నమోదు బాధ్యతను సర్కారే తీసుకోవాలి.. ప్రస్తుతం రెండు మూడు రోజులు ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు పడి ఉంటే తప్ప నమోదు చేసుకోవడం వీలు కావడం లేదు. ఆధార్ లేని వారు పాఠశాల వదిలి తల్లిదండ్రులతో ఆధార్ సెంటర్లకు వెళ్లడం అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. విద్యార్థులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం వాటి నమోదు బాధ్యతను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాలలకు వచ్చి లేదా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్యార్థులందరికీ కార్డులు అందించాలంటున్నాయి. -
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'
న్యూఢిల్లీ : దమ్ముంటే నల్లకుబేరుల జాబితాలోని పేర్లు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. నల్లధనం జాబితాలో పేర్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరి పేర్లు లీక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారిస్తుందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇబ్బందులు తప్పవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరు ఆ జాబితాలో ఉందంటూ జైట్లీ ఈ సందర్భంగా సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ నల్లధనం జాబితాలో పేర్లు దమ్ముంటే బహిర్గతం చేయాలని జైట్లీకి సవాల్ విసిరారు. -
వంటకు తంటా
నగదు బదిలీ.. ఈ పేరు చెబితేనే సగటు లబ్ధిదారుల్లో గుబులు పుడుతోంది. వచ్చేనెల పదో తేదీ నుంచి వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయంపై సగటు వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు కారణం కాగా.. అందరూ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏలూరు: యూపీఏ సర్కార్ హయాంలో 2012 అక్టోబర్ నుంచి జిల్లాలో నగదు బదిలీ అమలు ప్రారంభమైంది. తీవ్ర ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆధార్ సీడింగ్ లేకపోవడంతో పేద వర్గాల వారు సైతం సబ్సిడీ లేకుండా రూ.800 నగదును చెల్లించి గ్యాస్ బండ భారాన్ని మోశారు. చివరకు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నగదు బదిలీని కేంద్రం నిలిపివేసింది. తాజాగా మళ్లీ అమలు చేయాలని నిర్ణయించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా కనెక్షన్లు జిల్లా 56 గ్యాస్ ఏజెన్సీల పరిధిల్లో 8,05,042 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్లు 3,79,222, డబుల్ 2,78,948, దీపం కనెక్షన్లు 1,45,914 మందికి ఉన్నాయి. ఇందులో అప్పట్లో 90 శాతం ఆధార్ సీడింగ్ ఉన్నవారికే నగదు బదిలీని అమలు చేశారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్‌ను 96 శాతంకు పెంచామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. లోపాలెన్నో! నగదు బదిలీ పథకంలో సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు సక్రమంగా జమకాకపోవడంతో తీవ్ర ఇక్కట్లపాలైన సంఘటనలతో ఈ విధానాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకుల పరంగా కూడా సబ్సిడీ సొమ్ము జమలో రూ.50ల వరకు వినియోగదారుడికి కోత పడేది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న వ్యక్తి ఖాతాకు 15 రోజుల తర్వాత కూడా సబ్సిడీ సొమ్ము జమ అయిన సందర్భాలు లేవు. గ్యాస్ సిలిండర్ ధర రూ.405 అయితే.. దీనికి అదనంగా రూ. 435 కలిపి కలిపి రూ.840 వరకు చెల్లించాల్సి వచ్చేది. చేతిలో డబ్బులు లేకపోయినా.. సిలిండరు తప్పనిసరికావడంతో ముందుగా అప్పుచేసి విడిపించుకున్నా.. సకాలంలో నగదు బదిలీ కాకపోవడంతో ప్రతినెలా ఇబ్బందులు తప్పేవి కావు. తప్పనిసరి అయితే ప్రత్యేక సెల్ అవసరం ఈ పథకం అమలు తప్పనిసరైతే లోపాలను సవరించుకునే దిశగా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిలిండర్ ధర చెల్లించిన ఒకటి రోజుల్లోనే వినియోగదారుని ఖాతాకు సొమ్ము జమ అయ్యేలా చూడాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేస్తేనే పథకం సజావుగా సాగే వీలుంది. అమలుకు సిద్ధం (అభిప్రాయం) జిల్లాలో నవంబర్ 10 నుంచి వంటగ్యాస్‌కు నగదు బదిలీ అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై త్వరలోనే గ్యాస్ ఏజెన్సీలతో చర్చించి వారిని సమాయత్తం చేస్తాం. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేకపోయినా కొంత కాలం పాత పద్ధతిలోనే చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. వంట గ్యాస్ సబ్సిడీ ఎంతనేది త్వరలోనే నిర్ణయం అవుతుంది. -శివశంకర్‌రెడ్డి, డీఎస్వో -
టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమే: పురందేశ్వరి
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తాజాగా హస్తానికి చేయిచ్చి, కమలం చేతబట్టిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి చూపు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీపై పడినట్లు సమాచారం. టీడీపీలోకి వచ్చేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని దగ్గుబాటి దంపతులు చెప్పటం విశేషం. ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఓ సమావేశంలో వారు ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని మరీ... కాషాయ కండువా కప్పుకున్న ఆమె అక్కడ గౌరవం ఉంటుందని ఆశించారు. దాంతో తాను ఆశించిన చోట టికెట్టు కూడా దక్కుతుందని భావించారు. అయితే ఆమె అంచనాలు తల్లకిందులయ్యాయి. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి. పొత్తుల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట లోక్‌సభ బరిలోకి దిగి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీకి కొంచెం దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నందమూరి, నారావారి కుటుంబంలో రాజకీయ పోరు రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చిన్నమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పిల్లనిచ్చిన బావమరిది బాలయ్య కోసం...పెద్ద బావమరిది హరికృష్ణను ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. హరికృష్ణ కోరుకున్న హిందుపురం అసెంబ్లీ సీటును బాలకృష్ణకు ఇవ్వటంతో...అలకబూనిన హరి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబుకు దూరంగానే మసలుతున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయేంతవరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిప్పలు పెట్టిన చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. బీజేపీ తరపున చిన్నమ్మ కోస్తాలో ఎక్కడ టికెట్టు దక్కించుకున్నా విజయావకాశాలు ఉంటాయనే ఉద్ధేశంతో బాబు చక్రం తిప్పారు. చివరకు రాజంపేట మినహా మరో గత్యంతరం లేని వాతావరణం కల్పించారు. దాంతో పురందేశ్వరి అయిష్టంగానే రాజంపేట నుంచి బరిలో నిలిచారు. చివరికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో బాబు పాచిక ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు.... దగ్గుబాటి దంపతుల్ని తిరిగి టీడీపీలోకి అడుగుపెట్టినిస్తారా అనేది అనుమానమే. తండ్రి పెట్టిన పార్టీ నుంచి కొడుకునే తరిమేసిన ఆయన...కోరి కోరి ప్రత్యర్థులను పక్కకు చేర్చుకుంటారా అంటే సందేహమే. చంద్రబాబు తర్వాత పార్టీలో కీలక పాత్ర ఎవరిది అనే విషయంలో ఇప్పటికీ ఆపార్టీలో స్పష్టత అనేది లేదు. చంద్రబాబు తన వారసుడు లోకేష్ ను తెరమీదకు తీసుకు వస్తున్నా ..... చినబాబుకు అంత సీన్ ఉందా అనేది భవిష్యత్‌లోనే తేలుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు... నందమూరి ఫ్యామిలీతో పాటు, చిన్నమ్మ దంపతుల్ని దగ్గరకు చేర్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దగ్గుబాటి దంపతులు వదిలిన ఫీలర్లపై ''మీరొస్తానంటే....నే వద్దంటానా?'' అని బాబు స్వాగతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
గిట్టుబాటు రేటు ఉంటేనే
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ధరను నిర్ధారించడాన్ని బట్టి గ్యాస్ ప్రాజెక్టుల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుల్లో ఆర్ఐఎల్ భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ తమ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయం వెల్లడించింది. ఎన్ఈసీ-25 బ్లాక్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్యాస్ రేటుపై సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఒడిషా తీరంలోని ఎన్ఈసీ-25, ఇటు కృష్ణా-గోదావరి బేసిన్‌లోని కేజీ-డీ6 బ్లాక్‌లలో ఆర్ఐఎల్ కొత్తగా మరిన్ని గ్యాస్ నిక్షేపాలను కనుగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ రేటును 8.4 డాలర్లకు పెంచే ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తడం, ఎన్నికలు నేపథ్యంలో వెనక్కి తగ్గింది. కొత్త ప్రభుత్వం సైతం సమగ్ర సమీక్ష జరపాలంటూ వాయిదా వేసింది. దీనిపై ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.