
టీఆర్‌ఎస్‌కు 20సీట్లకు మించవ్: కాకా
మంచిర్యాల, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 20కి మించి సీట్లు రావని కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పడం, దళితుడిని తెలంగాణకు తొలి సీఎంను చేస్తానని చెప్పి.. ఇప్పుడు సీఎం సీటు కోసం ఆరాటపడడంతో కేసీఆర్‌పై విశ్వసనీయత తగ్గిం దన్నారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌కు సీట్లు తగ్గుతున్నాయని చెప్పారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, మోడీ ప్రభంజనం ఎక్కడా లేదన్నారు.