
రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
హైదరాబాద్ : దేశ రాజధానిలో సమైక్యవాణిని గొంతెత్తి చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తినకు దండు కడుతున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా యూపీఏ ప్రభుత్వం మూర్ఖంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ... ఈ నెల 17న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వైఎస్ఆర్ సీపీ రెండు ప్రత్యేక రైళ్లను వేశారు. శనివారం ఉదయం10 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరగా, సాయంత్రం 4:30 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనుంది.
రేణిగుంట నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు
గుత్తి మధ్యాహ్నం 3:30 గంటలకు
కర్నూలు సా. 5:20 గంటలకు
కాచిగూడ రా. 9:30 గంటలకు
ఖాజీపేట అర్థరాత్రి 12గం.లకు
రామగుండం తెల్లవారు జామున 2:15గంటలకు
రాజమండ్రి నుంచి బయల్దేరిన రైలు ఆగే ప్రాంతాలు
రాజమండ్రిలో సా.4:30 గంటలకు బయల్దేరనున్న రైలు
ఏలూరులో సా. 6:30 గంటలకు
విజయవాడలో రా. 7:40 గంటలకు
ఖమ్మంలో రాత్రి. 8:15 గంటలకు
మంచిర్యాలలో తెల్లవారుజామున 2:00 గంటలకు