
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త మార్గాని భరత్ రామ్ విమర్శించారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చరా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారని, రాజమండ్రిలో జయహో బీసీ సభ నిర్వహించే అర్హత టీడీపీకి లేదన్నారు.
బీసీల ఓట్లు కావాలి.. కానీ సీట్లు మాత్రం ఇవ్వరా? అని నిలదీశారు. జన్మభూమి కమిటీలతో అట్టడుగు వర్గాలు నలిగిపోతున్నాయని, టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో ప్రతి పేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడని మండిపడ్డారు. నవరత్నాలను కాపీ కొడుతు చంద్రబాబు గొప్పలు చెప్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్తారని మార్గాని భరత్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment