పేదల బతుకులు అగ్గిపాలు
‘తూర్పు’లో భారీ అగ్నిప్రమాదం
- కాలి బూడిదరుున 95 తాటాకు ఇళ్లు
- ప్రమాదంపై ఆరా తీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజల బతుకులు బుగ్గిపాలయ్యారుు. సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వారిని కట్టుబట్టలతో మిగిలేటట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామ పంచాయతీలోని జంగాల కాలనీలో సోమవారం ఉదయం 8:30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో 95 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యారుు. దాదాపు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. కాలనీ శివార్లలోని మైదాన ప్రాంతంలో ఉండటం, బాధితులు వెంటనే అప్రమత్తమవడంతో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కాలనీలో ప్రమాదవశాత్తూ తాటాకుల ఇళ్ల పైకప్పునకు మంటలు అంటుకున్నారుు. క్షణాల్లో పక్క ఇళ్లకు వ్యాపించారుు. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగారుు. దీంతో ప్రజలు భయాందోళనలతో పొలాల్లోకి పరుగులు తీశారు.50 మంది అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు.
వెంటనే పక్కా ఇళ్లు నిర్మించాలి: వైఎస్సార్‌సీపీ
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోరుున బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. బాధితులకు అండగా ఉండాలని జక్కంపూడి రాజాకు సూచించారు.