Kontamuru
-
అగ్నిప్రమాదంలో 145 గుడిసెలు దగ్ధం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కొంతమూరులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్క గుడిసెలకు వ్యాపించడంతో సుమారు 145 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో వాళ్లంతా కూలీ పనులకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమండ్రి నుంచి రెండు, కోవూరు నుంచి రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 145 కుటుంబాలు సర్వం కోల్పోయి వీధిన పడ్డాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేదల బతుకులు అగ్గిపాలు
‘తూర్పు’లో భారీ అగ్నిప్రమాదం - కాలి బూడిదరుున 95 తాటాకు ఇళ్లు - ప్రమాదంపై ఆరా తీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సాక్షి, రాజమహేంద్రవరం: రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజల బతుకులు బుగ్గిపాలయ్యారుు. సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వారిని కట్టుబట్టలతో మిగిలేటట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామ పంచాయతీలోని జంగాల కాలనీలో సోమవారం ఉదయం 8:30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో 95 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యారుు. దాదాపు రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. కాలనీ శివార్లలోని మైదాన ప్రాంతంలో ఉండటం, బాధితులు వెంటనే అప్రమత్తమవడంతో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కాలనీలో ప్రమాదవశాత్తూ తాటాకుల ఇళ్ల పైకప్పునకు మంటలు అంటుకున్నారుు. క్షణాల్లో పక్క ఇళ్లకు వ్యాపించారుు. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగారుు. దీంతో ప్రజలు భయాందోళనలతో పొలాల్లోకి పరుగులు తీశారు.50 మంది అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. వెంటనే పక్కా ఇళ్లు నిర్మించాలి: వైఎస్సార్సీపీ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోరుున బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. బాధితులకు అండగా ఉండాలని జక్కంపూడి రాజాకు సూచించారు. -
సర్వం అగ్గి పాలు
కొంతమూరులో 11 తాటాకిళ్లు దగ్ధం నిరాశ్రయులుగా 13 కుటుంబాలు రూ.8 లక్షల ఆస్థి నష్టం పొయ్యి వెలిగిస్తుండగా గ్యాస్‌బండ నుంచి మంటలు చెలరేగి.. రాజమహేంద్రవరం రూరల్: రెక్కాడితే గాని డొక్కాడని పేదల బతుకులు బుగ్గయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం, కొంతమూరు గ్రామంలోని కల్యాణనగర్లో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో 11 ఇళ్ల పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో 13 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు రూ.ఎనిమిది లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. ఇక్కడి మొసళ్ల చెరువు గట్టుపై 42 తాటాకిళ్లు వేసుకుని పేదలు జీవిస్తున్నారు.ఉదయం 8.30 గంటల సమయంలో గుల్లా భవానీ అనే గృహిణి టీ కాచేందుకు తన ఇంట్లోని గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా బండ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భవానీ భయంతో అక్కడ నుంచి బయటకు పరుగులు తీసింది. మంటలు కొద్ది నిముషాల్లోనే చుట్టుపక్కల ఉన్న తాటాకిళ్లకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 11 గృహాలు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని సామాన్లు బయటకు తెచ్చుకునే అవకాశం కూడా లేకపోవడంతో 13 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ప్రమాద ప్రాంతాన్ని అగ్నిమాపకశాఖాధికారి పార్థసారథి, తహసీల్దార్ జి.భీమారావు, తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి విజయరెడ్డి సందర్శించి బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి ఒక్కో బాధిత కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. తామందరికీ ఈ ప్రాంతంలోనే స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని బాధితులు ఆయనను కోరారు. పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని, అయితే చెరువు గట్టుపై మాత్రం శాశ్వత గృహాల నిర్మాణం చేపట్టవద్దని ఎమ్మెల్యే వారికి సూచించారు. వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్‌ారజు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. -
కర్షకుడి కన్నెర్ర
కొంతమూరు (రాజమహేంద్రవరం రూరల్): కళ్లముందే ఆకు మడులు ఎండిపోతున్నాయి ... వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత రైతుల్లో అసహనం పెల్లుబికింది. సుమారు గంటపాటు రైతులు ఆందోళన చేపట్టడంతో ఇరు వైపులా 20 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిది. ఆదివారం నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి... కొంతమూరు గ్రామంలోని రైతులకు వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో వేసిన ఆకుమడులు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులకు రైతులు పలుమార్లు ఈ పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం నాలుగో వంతెన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసిన నారు ఎండిపోకుండా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు విడుదల చేసినప్పుడే వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌కు కూడా నీరు విడుదల చేసి ఉంటే రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంచుకుని ఇలా చేయడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి రైతులతో చర్చించి నీరు విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ఈఈ వాసుదేవ్, ఏఈలు రైతులతోను, ఆకులవీర్రాజు, గ్రామ పెద్దలు దండమూడి ప్రసాద్, చెరుకూరి రత్నాజీ, చెరుకూరి బాలాజీలతో మాట్లాడారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని సరిదిద్ది రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నీటిని విడుదల చేస్తామని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని రైతులు పట్టుబట్టగా అధికారులు అదే పని చేయడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ నాయకులు యామనరామకృష్ణ, నెరుసు వెంకట్రావు,వంకా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.