అగ్నిప్రమాదంలో 145 గుడిసెలు దగ్ధం | east godavari district:145 huts gutted in fire | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో 145 గుడిసెలు దగ్ధం

Published Tue, Nov 8 2016 2:35 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అగ్నిప్రమాదంలో 145 గుడిసెలు దగ్ధం - Sakshi

అగ్నిప్రమాదంలో 145 గుడిసెలు దగ్ధం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కొంతమూరులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్క గుడిసెలకు వ్యాపించడంతో  సుమారు 145 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా  ప్రమాద సమయంలో ఇంట్లో వాళ్లంతా కూలీ పనులకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది.

అయితే ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమండ్రి నుంచి రెండు, కోవూరు నుంచి రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 145 కుటుంబాలు సర్వం కోల్పోయి వీధిన పడ్డాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement