
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.
వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.

ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment