petrolbunks
-
పెట్రోల్‌బంక్ వద్ద లారీలో మంటలు.. తప్పిన ముప్పు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం -
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్
-
పెట్రోల్ బంకులో చొరబడి మందుబాబుల హల్చల్..
గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్ బంకులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వ్యాన్‌ను జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?
లండన్: మనం టీవిలో అడ్వర్టైస్మెంట్లలో చూసు ఉంటాం మీ కురులు ధృడంగా ఉండాలంటే అంటూ ఒకామె తన జుట్టుతో కారుల్ని లాక్కుపోతున్నట్లు చూపిస్తారు. పైగా ఈ షాంపు వాడితే మీ కురులు అంత ధృడంగా అవుతాయంటూ పలు అడ్వర్టైస్మెంట్లు చూశాం గానీ నిజమైన అనుభవం ఎవరికీ ఎదురై ఉండదు కదూ...కానీ లండన్‌కి చెందిన అనస్తాసియా అనే మహిళ ఇలాంటి విన్యాసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. (చదవండి: ప్రవాసి దుర్గా మాతలు) వివరాల్లోకెళ్లితే అనస్తాసియా అనే మహిళ ఒక పెట్రోల్ బంక్ వద్ద తన కురులతో వ్యాన్ని లాక్కెళ్లిపోతుంది. అసలే పెట్రోల్ సంక్షోభంతో దేశాన్ని సతమతమవుతుంటే ఆమె చేసిన ఈ ఫీట్‌కి అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. ఇది చమురు కొరత తెలియజెప్పటం కోసం ఇలా చేస్తుందని కొందరూ భావించారు. ఇది పెట్రోల్ ధరల ఎఫెక్టేనా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అనస్తాసియా అందుకోసం ఈ విధంగా చేయలేదు. ఆమె ఒక ప్రఫెషనల్ 'హెయిర్-హాంగ్ ఏరియలిస్ట్'. ఆమె సర్కస్ వృత్తిలో భాగంగా ఈ ఫీట్ చేస్తుంది. ఆమె కురులతో ఈ విన్యాసలు చేయడం కోసం చదువును కూడా మధ్యలోనే వదిలేసింది. ఆమె ఎక్కువ సమయం ఎయిర్‌కి సంబంధించిన రకరకాల విన్యాసలతోనే గడుపుతుందట. ఈ మేరకు అనస్తాసియా మాట్లాడుతూ.....ఈ విన్యాసలు చేయడం చాలా కష్టం. నాకు కురులతో వ్యానులు లాగినపుడు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఈ విన్యాసం చూడటానికి ఆశ్యర్యం కలిగించినప్పటికీ చాలా కష్ట నష్టాలకి ఓర్చుకోవాలి. నేను రోజు రెండు బాటిళ్ల కండిషనర్‌ని వాడటం వల్లే నా కురులు ఇంతా బలంగా ధృడంగా ఉన్నాయి" అని చెబుతోంది. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) -
గుంటూరులో ఆకతాయిల హల్చల్
-
పెట్రోల్ బంక్‌లోకి చొరబడి పిడిగుద్దుల వర్షం.. సీసీటీవీలో దృశ్యాలు
సాక్షి, గుంటూరు: గుంటూరులో కొందరు ఆకతాయిలు హల్చల్ చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్‌లోకి చొరబడి హంగామా చేశారు. వివాదం ఏంటో తెలియదు గానీ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తోటి సిబ్బంది ఆ యువకులకు ఎంత నచ్చ జెప్పినా వినకుండా మళ్లీ మళ్లీ బాధితుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు బంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై బంక్ యాజమాని పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఘటనపై రాజీకి రమ్మంటూ బంక్ యజమానిపై కొందరు రాజకీయ నేతలు ఒత్తిడి తెస్టున్నట్టు సమాచారం. చదవండి: యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు -
Telangana: లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ను మే 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది. వ్యవసాయ ధాన్యం తరలింపు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు లాక్డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్డౌన్ సడలింపుల అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చదవండి: టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి -
బంక్‌ల భారీ దగా.. తక్కువే పోస్తున్నారు
న్యూఢిల్లీ: పెట్రోల్ బంక్‌ల విషయంలో అనుమానం కలిగి ఉండటం తప్పులేదని మరోసారి రుజువైంది. ఇప్పటి వరకు కల్తీకి మాత్రమే పాల్పడే అవకాశం ఉందని బంక్‌లపై ఆరోపణలు ఉన్నప్పటికీ చెల్లించిన దానికంటే తక్కువ పెట్రోల్, డీజిల్ పోస్తున్నారని తాజాగా స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌లో దీనికి సంబంధించి పెద్ద రాకెట్టు గుట్టు వీడింది. వినియోగదారుడు చెల్లించే ధరకు పోయాల్సిన పెట్రోల్, డీజిల్ కన్నా 10 నుంచి 15శాతం తక్కువ పోస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ పోలీసులు వివిధ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయగా ఈ గుట్టు రట్టయింది. నకిలీ పెట్రోల్ పంపులను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇలా ఏడాదికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.250 కోట్లు వెనుకేసుకుంటున్నారని తేల్చేశారు. దేశంలో కనీసం నిబంధనలు పాటించకుండా కస్టమర్లను మోసం చేసే డీలర్లు ఓ పదిశాతంమంది ఉన్నట్లు ఇప్పటికే ఓ అంచనా ఉంది. ఆయిల్ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ప్రతి ఏడాది రూ.2,500కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్‌ను 59,595 పెట్రోల్ బంకుల్లో యూపీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారట. అయితే, ప్రజలను చాలామంది రిటెయిలర్లు దారుణంగా మోసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రత్యేక టాస్క్ పోర్స్ బృందం అప్పటికప్పుడు శుక్రవారం ఏడు పెట్రోల్ బంక్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించగా నకిలీ పంపులను ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. రవీందర్ అనే వ్యక్తి దీనిని ప్రధానంగా నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 1000 పెట్రోల్ బంకుల్లో నకిలీ పంపులను పెట్టి నడిపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మరింత అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక టీంను సిద్ధం చేసి ఇప్పుడు తనిఖీలు చేయిస్తోంది. ఈ సందర్భంగా ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన అభినందనలు తెలియజేశారు.