రాజమండ్రి: వార్డు స్థాయి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఐక్యంగా కృషి చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో-ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) పిలుపునిచ్చారు. రూరల్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం ధవళేశ్వరంలో వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ జూలై 8 నుంచి జరగనున్న గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అనంతరం వడ్డెర కాలనీలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జేగురుపాడు, దామిరెడ్డిపల్లి గ్రామాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులను వీర్రాజు (బాబు) శనివారం రాత్రి కలిశారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జూలై ఎనిమిదో తేదీ నుంచి గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట పార్టీ బీసీసెల్ ప్రధాన కార్యదర్శి దాసరి శేషగిరి ఉన్నారు.
8 నుంచి గడప గడపకూ వైఎస్సార్సీపీ
Published Mon, Jun 27 2016 9:26 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement