
నేడు రేణిగుంటకు వైఎస్ జగన్ రాక
తిరుపతి (మంగళం): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 9.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సోమవారం మీడియాకు తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా నెల్లూరుకు వెళతారని తెలిపారు.
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళుతారన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.