న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు.
ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్‌లో యూరి సెక్టార్‌లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment