యూపీఏ పాలనలో దేశం నాశనం | BJP releases 'chargesheet' against UPA government; accuses it of 'destruction of economy' | Sakshi
Sakshi News home page

యూపీఏ పాలనలో దేశం నాశనం

Published Sat, Apr 5 2014 2:00 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

యూపీఏ పాలనలో దేశం నాశనం - Sakshi

యూపీఏ పాలనలో దేశం నాశనం

యూపీఏ వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్
 ప్రధాని సహా సోనియూ, రాహుల్ దోషులే
 రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు
 సీబీఐని ప్రయోగించారు
 
 సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు బాధ్యతారహితంగా అధికారాన్ని ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు సైతం సమస్యలకు కారకులయ్యూరని ఆరోపించింది. యూపీఏ పాలనలో అవినీతి, కుంభకోణాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని పేర్కొంది. పదేళ్లలో 21 భారీ కుంభకోణాలు జరిగాయని, అవినీతికి అంతేలేకుండా పోయిందని తెలిపింది.

 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కార్యాలయం (పీఎంఓ) సోనియా, రాహుల్ చేతిలో రిమోట్ కంట్రోల్‌గా మారిందని విమర్శించింది. మన్మోహన్ ప్రధానిలా కాకుండా ఓ బోర్డుకు సీఈవో మాదిరి వ్యవహరించార ంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనపై రూపొందించిన 58 పేజీల అభియోగపత్రాన్ని బీజేపీ అధికార ప్రతినిధులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జె.పి.నడ్డా శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను చార్జిషీట్ ఎండగట్టింది. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు.
 
 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ నాశనమైందన్నారు.
 
స్వతంత్ర భారత దేశంలో అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా యూపీఏ హయూం గుర్తుండిపోతుంది.
 
భారత్ వంటి గొప్ప దేశానికి యూపీఏ ప్రభుత్వం.. సమస్యలు, అభద్రత, నిరాశా నిస్పృహలతో కూడిన భారతదేశాన్ని వారసత్వంగా ఇస్తోంది.
 
  ప్రభుత్వ తప్పుడు విధానాలు దేశ ప్రాథమిక పునాదినే కుదిపివేశారుు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి కీలక విభాగాన్నీ ప్రభుత్వం నాశనం చేసింది.
 
  2జీ, కోల్‌గేట్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, కేజీ బేసిన్ చమురు, రాబర్ట్ వాద్రా భూ కొనుగోళ్లు, ఎయిరిండియూ, ఓటుకు నోటు, అగస్టా తదితర 21 కుంభకోణాలు యూపీఏ హయూంలో చోటు చేసుకున్నారుు.
 
 అవినీతిని, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, రాజకీయంగా ప్రత్యర్థులను అణచివేయడానికి కాంగ్రెస్ సీబీఐని దుర్వినియోగం చేసింది.
 
 అంతరంగిక భద్రతలో వైఫల్యం వల్ల పాకిస్థాన్, చైనా నుంచి చొరబాట్లు అధికమయ్యారుు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని యూపీఏ పూర్తిగా విస్మరించింది.
 
2003-04లో వృద్ధి రేటు 8.5 శాతం ఉండగా, 2013-14 డిసెంబరు నాటికి 4.6 శాతానికి పడిపోరుుంది.
 
అవినీతి, కుంభకోణాలకు, ధరల నియంత్రణలో వైఫల్యానికి, నిరుద్యోగ సమస్య పెరగడానికి, ఆర్ధిక వ్యవస్థ నాశనమవడానికి, దేశం లోపల.. బయట ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రధాని, సోనియూ, రాహుల్ సమాధానం చెప్పాలి.
 
యూపీఏ హయూం దేశానికి విపత్తులా పరిణమించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement