యూపీఏ చెదరదు | UPA gathering To rebound | Sakshi
Sakshi News home page

యూపీఏ చెదరదు

Published Wed, Apr 23 2014 4:02 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

యూపీఏ చెదరదు - Sakshi

యూపీఏ చెదరదు

ఓడినా కలిసే ఉంటుంది:పవార్
 
ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం యూపీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఓటమి ఎదురైనా కూటమి మాత్రం చెక్కుచెదరబోదని, ఎదురుదెబ్బ తర్వాత కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా యూపీఏ 100 శాతం కలిసి ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అరుున పవార్ మంగళవారం పీటీఐతో అన్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంలో విఫలమైన పక్షంలో కాంగ్రెస్ ప్రియూం క వాద్రా వంటి కొత్త నేత కోసం అన్వేషణ కొనసాగిస్తుందని కూడా తాను భావించడం లేదని చెప్పారు. ‘కాంగ్రెస్ ఓ విచిత్రమైన పార్టీ. ఎదురు దెబ్బలు తింటుంది. అంతలోనే తిరిగి పుంజుకుంటుంది. అలాంటి పరిస్థితే (కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంటే) వస్తే అతని (రాహుల్) నేతృత్వంలో ఓ మంచి నేతల బృందం పని చేస్తుంది..’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement