మోదీకి ఆ విషయం తెలియదా? | Rahul gandhi slams narendra modi on AP special status | Sakshi
Sakshi News home page

మోదీకి ఆ విషయం తెలియదా?

Published Tue, Feb 2 2016 4:58 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Rahul gandhi slams narendra modi on AP special status

అనంతపురం: పార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ పైనే ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లి బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు.

ప్రధాని మోదీకి ఈ విషయం తెలియదా? అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకు మోదీ హామీ నిలబెట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి కేంద్రం హామీ ఇచ్చి నిలబెట్టుకోలేక పోవడం ఇదే ప్రథమమని రాహుల్ దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement