చేతిలో పనైనా చేయరేం! | Special category status in hand of UPA govt | Sakshi
Sakshi News home page

చేతిలో పనైనా చేయరేం!

Published Sat, Sep 26 2015 1:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

చేతిలో పనైనా చేయరేం! - Sakshi

చేతిలో పనైనా చేయరేం!

యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావుడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!!
 
 ‘‘స్పెషల్ కేటగిరి స్టేటస్’’ ప్రత్యేక హోదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ‘పదం’.  ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు ‘స్పెషల్ స్టేట స్’ అని అంటే చాలు బీజేపీ, టీడీపీ వాళ్లకి చిర్రెక్కిపోతోంది. రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్ వాళ్లకూ, సోనియా గాంధీ వెనకాల నక్కిన జగన్‌మోహన్‌రెడ్డికీ మాట్లాడే అర్హతే లేదని అధికార పక్షం వారి వాదన... నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ‘పార్టీ ఫీలింగులు’ లేనే లేవు. ఆంధ్రా సీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్ర తినిధులందరూ విభజనను వ్యతిరేకించిన వారే... కొంచెం అటూ ఇటుగా! అటూ ఇటూ అని ఎందుకన్నానంటే, కొందరు కాంగ్రెస్‌కు చెందిన పార్ల మెంట్ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూనే, హైకమాండ్ నిర్ణయానికి కట్టు బడి ఉంటామన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన అభిప్రాయాన్నే చెప్పలేదు! ‘సమన్యాయం’ అంటే ఆయన ఉద్దేశమేమిటో, ఇప్పటి వరకూ చెప్పనేలేదు!!
 
 ఏది ఏమైనప్పటికీ... పార్లమెంట్‌లో రాష్ర్ట విభజన బిల్లు ‘పాసయిపో యింది’ అన్నారు. విభజన జరిగిపోయింది. (బిల్లు నిజానికి లోక్‌సభలో పాస వ్వలేదు. పార్లమెంట్ వారు ప్రచురించిన 18.2.14 లోక్‌సభ డిబేట్స్ చదివిన వారికెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది. అది వేరే సంగతనుకోండి...) యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావిడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!!
 
 పదేళ్లు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వకపోతే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అతీగతీ లేకుండా పోతుందని వాపోయారు వెంకయ్యనాయుడు. ఉత్తరా ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకిచ్చినట్లు పన్ను రాయితీలు ఇవ్వాలనీ, ఉత్త రాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర సబ్సిడీలు ఇవ్వాలనీ, యావద్భా రత దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను కోల్పోతున్న కార ణంగా ఆంధ్రప్రదేశ్‌కు నష్టపరిహారంగా ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇచ్చి తీరా లని... కోరారు వెంకయ్యనాయుడు.
 
 సుదీర్ఘ ఉద్యమం తర్వాత, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు గురించి, లోక్ సభలో ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న యావదాంధ్ర ప్రజానీకం 20-2-14న రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలకి అతుక్కుపోయారు. స్వతహాగా మంచి వక్త అయిన వెంకయ్యనాయుడు ఆ రోజు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడి... ‘‘మన గురించి మాట్లాడుతున్న ఏకైక మొనగా డురా...’’ అనిపించుకున్నారు. ‘‘పొద్దున్న అయిదేళ్లకి ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ పదేళ్లు అంటా వేంటి..?’’ అని చిరాకుపడ్డారు హోంమంత్రి షిండే గారు. దాంతో రెచ్చిపోయిన వెంకయ్యనాయుడు గారు ‘రెండు మూడు నెలల్లో మేం అధికారంలోకి వస్తున్నాం. మేము ఇవ్వాళ ‘డిమాండ్’ చేస్తున్నవన్నీ, రేపు మేము చేసి చూపెడతాం’’ అని తెలుగులో మనకందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పారు.
 
 2014 జనరల్ ఎలక్షన్లలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి ప్రధాన కారణం ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’!  మోదీగారు ప్రధానమంత్రి అయ్యారు. వెంకయ్యనాయుడు గారు అత్యంత కీలకమైన మంత్రి అయ్యారు. మోదీకి చాలా దగ్గరయ్యారు (మోదీ తన మంత్రివర్గ సహచరులలో ఎప్పుడైనా, ఎవరినైనా పొగిడారూ అంటే... అది ఒక్క వెంకయ్యనాయుడు గారినే). ఇక్కడ చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామ్య పార్టీ అయింది. ఇక ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ వెంటనే ప్రకటించటానికి అభ్యం తరం ఏముంటుంది?! మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ ఆఖరి కేబినెట్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానం కూడా చేసి దిగిపోయింది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలనే కొత్త సూత్రం ప్రతిపాదిస్తున్నారు కొం దరు విజ్ఞులు. ఎవరొప్పుకున్నారని రాష్ట్ర విభజన బిల్లు తెచ్చారు? ములా యంసింగ్, డీఎంకే, ఏడీఎంకే, అకాలీదళ్, బీజేడీ, జేడీయూ, సీపీఎం, తృణ మూల్... ఏ పార్టీ ఒప్పుకుంది!?
 
కాంగ్రెస్ వారు, బీజేపీ వారు అనుకున్నారు... అయిపోయిందన్నారు.  ఈ రోజు కొత్త రూల్స్ మాట్లాడితే ఎలాగ?! ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ అనేది బీజేపీ+టీడీపీల వాగ్దానం. వాగ్దాన భంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రతిపక్షాలని లెక్క పెట్టక్కర్లేదన్న ‘అహంకారం’ తలకెక్కినప్పు డు ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి... ‘మైండ్ సెట్’ అవుతుంది.  ఎన్నో అటుపోట్లు, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ‘ఓటు బ్యాంక్’ కలిగియున్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ‘చావు దెబ్బ’ తినేయటానికి కారణం ఏమిటో అన్ని పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.
 వ్యాసకర్త: లోక్‌సభ మాజీ సభ్యులు,
 - ఉండవల్లి అరుణ్ కుమార్
 మొబైల్: 9868180171

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement