seetharam echuri
-
ముగిసిన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశాలు మంగళవారం ముగిశాయి. సమావేశంలో బ్యూరో సీపీఎం మహాసభలలో తీసుకున్న నిర్ణయాల అమలు, భాద్యతల అప్పగింత అంశాలపై చర్చించింది. 22వ సీపీఎం అఖిల భారత మహాసభల తరువాత మొదటిసారి భేటీ అయిన పోలిట్ బ్యూరో ఇది. జూన్ 22 నుంచి 24 వరకు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించి పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలను కేంద్ర కటిటీ ముందుంచనున్నారు. సీపీఎం పోలిట్ బ్యూరో కర్ణాటక రాజకీయ పరిణామాలను స్వాగతించింది. రేపు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకానున్నారు. సమావేశంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. బీజేపీ ప్రజాతీర్పును కాదని గోవా, మణిపూర్, మేఘాలయ, బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్, జెడిఎస్‌కు 56.6 శాతం ప్రజలు ఓటు వేశారు. కానీ అధిక సీట్లు వచ్చిన బీజేపీకి కేవలం 36.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఏచూరి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా పెరిగాయి. గడిచిన నాలుగేళ్ళలో గ్రామీణ భారతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, గతంలో ప్రజలు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని తెలిపారు. నోట్లరద్దు, జీఎస్టీ వల్ల ప్రజలపై ఆర్థిక భారాలు మరింత పెరిగాయాయని, వారిపై భారం పెంచుతూ 11 లక్షల కోట్ల రుణాలను బడా కార్పోరేట్లకు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, ప్రజలపై మోడీ ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పిలుపునిచ్చింది. ‘త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీపీఎం కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 50 పార్టీ కార్యాలయాలు ధగ్దం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ దాడులతో 500 కార్యకర్తలు ఇళ్ళను వదిలి పార్టీ ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో ఉంటున్నారు.’అని సీపీఎం పోలిట్ బ్యూరో త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించింది. అదేవిధంగా బీజేపీ బెంగాల్లో మమత సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పంచాయతీ ఎన్నికలలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, బెంగాల్ లో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసే హక్కును కోల్పోయారు. అలాంటిది బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గురించి మమత బెనర్జీ మాట్లాడటం హాస్యాస్పదమని ఏచూరి అన్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారు. సిటిజన్ షిప్ యాక్ట్ అమలులో మత ప్రాతిపదికను కేంద్రం అమలు చేస్తుంది. కేంద్రం సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని బ్యూరో డిమాండ్ చేసింది. పార్లమెంట్లో సీపీఎం సిటిజన్ షిప్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని సీతారాం ఏచూరి అన్నారు. -
'ఆయన స్లోగన్ జియో హింద్‌గా మారింది'
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం 25 వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగునున్న ఈ మహాసభలకు సీపీఎం జాతీయం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ , బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తోందన్నారు. నోట్ల రద్దు తర్వాత చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయన్నారు. జీఎస్టీ విదేశీ కంపెనీలు బాగుపడటానికి ఉపయోగపడిందని విమర్శించారు. ప్రధాని స్లోగన్ జియో హింద్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వామపక్షాల పోరాటాలు తట్టుకోలేక బీజేపీ దాడులు చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయ మూర్తులే బయటకు వస్తున్నారంటే దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం అవుతున్నారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్షాలను బలహీనపర్చకపోతే గెలవలేమనే ఆలోచనలోఎ బీజేపీ ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాగా, మహా సభలు నేపధ్యంలో అరుణ పతాకాలతో భీమవరం ఎరుపెక్కింది. -
'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిపింది. ఈ భేటీకి సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా హామీని విస్మరించాయని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేటాయింపులు ఇవ్వకుండా కేంద్రం భిక్షం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వేసే భిక్షం కోసమే సీఎం చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై స్పందించకపోవటం దారుణమని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు అన్నారు. -
చేతిలో పనైనా చేయరేం!
యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావుడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! ‘‘స్పెషల్ కేటగిరి స్టేటస్’’ ప్రత్యేక హోదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ‘పదం’. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు ‘స్పెషల్ స్టేట స్’ అని అంటే చాలు బీజేపీ, టీడీపీ వాళ్లకి చిర్రెక్కిపోతోంది. రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్ వాళ్లకూ, సోనియా గాంధీ వెనకాల నక్కిన జగన్మోహన్రెడ్డికీ మాట్లాడే అర్హతే లేదని అధికార పక్షం వారి వాదన... నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ‘పార్టీ ఫీలింగులు’ లేనే లేవు. ఆంధ్రా సీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్ర తినిధులందరూ విభజనను వ్యతిరేకించిన వారే... కొంచెం అటూ ఇటుగా! అటూ ఇటూ అని ఎందుకన్నానంటే, కొందరు కాంగ్రెస్‌కు చెందిన పార్ల మెంట్ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూనే, హైకమాండ్ నిర్ణయానికి కట్టు బడి ఉంటామన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన అభిప్రాయాన్నే చెప్పలేదు! ‘సమన్యాయం’ అంటే ఆయన ఉద్దేశమేమిటో, ఇప్పటి వరకూ చెప్పనేలేదు!! ఏది ఏమైనప్పటికీ... పార్లమెంట్లో రాష్ర్ట విభజన బిల్లు ‘పాసయిపో యింది’ అన్నారు. విభజన జరిగిపోయింది. (బిల్లు నిజానికి లోక్‌సభలో పాస వ్వలేదు. పార్లమెంట్ వారు ప్రచురించిన 18.2.14 లోక్‌సభ డిబేట్స్ చదివిన వారికెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది. అది వేరే సంగతనుకోండి...) యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన విభజన బిల్లులో స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రస్తావనే లేదు. తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి, హడావిడిగా ‘పాస్’ చేసేసినట్లు ప్రకటించిన ‘బిల్లు’ స్పెషల్ స్టేటస్ అంశంతో రాజ్యసభకి రాలేదు. రాజ్యసభలో ఈ అంశాన్ని చేర్చారు! సీమాంధ్ర తరఫున, ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో... కాంగ్రెస్ చిరంజీవి, సీపీఎం సీతారామ్ ఏచూరి ఇప్పటి మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడినా, ఆ రోజు ‘స్టార్’ మాత్రం కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, సీమాంధ్రకు చెందిన వాడు అయిన వెంకయ్యనాయుడే!! పదేళ్లు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వకపోతే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అతీగతీ లేకుండా పోతుందని వాపోయారు వెంకయ్యనాయుడు. ఉత్తరా ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకిచ్చినట్లు పన్ను రాయితీలు ఇవ్వాలనీ, ఉత్త రాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర సబ్సిడీలు ఇవ్వాలనీ, యావద్భా రత దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను కోల్పోతున్న కార ణంగా ఆంధ్రప్రదేశ్‌కు నష్టపరిహారంగా ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇచ్చి తీరా లని... కోరారు వెంకయ్యనాయుడు. సుదీర్ఘ ఉద్యమం తర్వాత, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు గురించి, లోక్ సభలో ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న యావదాంధ్ర ప్రజానీకం 20-2-14న రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలకి అతుక్కుపోయారు. స్వతహాగా మంచి వక్త అయిన వెంకయ్యనాయుడు ఆ రోజు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడి... ‘‘మన గురించి మాట్లాడుతున్న ఏకైక మొనగా డురా...’’ అనిపించుకున్నారు. ‘‘పొద్దున్న అయిదేళ్లకి ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ పదేళ్లు అంటా వేంటి..?’’ అని చిరాకుపడ్డారు హోంమంత్రి షిండే గారు. దాంతో రెచ్చిపోయిన వెంకయ్యనాయుడు గారు ‘రెండు మూడు నెలల్లో మేం అధికారంలోకి వస్తున్నాం. మేము ఇవ్వాళ ‘డిమాండ్’ చేస్తున్నవన్నీ, రేపు మేము చేసి చూపెడతాం’’ అని తెలుగులో మనకందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పారు. 2014 జనరల్ ఎలక్షన్లలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి ప్రధాన కారణం ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’! మోదీగారు ప్రధానమంత్రి అయ్యారు. వెంకయ్యనాయుడు గారు అత్యంత కీలకమైన మంత్రి అయ్యారు. మోదీకి చాలా దగ్గరయ్యారు (మోదీ తన మంత్రివర్గ సహచరులలో ఎప్పుడైనా, ఎవరినైనా పొగిడారూ అంటే... అది ఒక్క వెంకయ్యనాయుడు గారినే). ఇక్కడ చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామ్య పార్టీ అయింది. ఇక ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ వెంటనే ప్రకటించటానికి అభ్యం తరం ఏముంటుంది?! మన్మోహన్సింగ్ ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ ఆఖరి కేబినెట్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానం కూడా చేసి దిగిపోయింది. మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలనే కొత్త సూత్రం ప్రతిపాదిస్తున్నారు కొం దరు విజ్ఞులు. ఎవరొప్పుకున్నారని రాష్ట్ర విభజన బిల్లు తెచ్చారు? ములా యంసింగ్, డీఎంకే, ఏడీఎంకే, అకాలీదళ్, బీజేడీ, జేడీయూ, సీపీఎం, తృణ మూల్... ఏ పార్టీ ఒప్పుకుంది!? కాంగ్రెస్ వారు, బీజేపీ వారు అనుకున్నారు... అయిపోయిందన్నారు. ఈ రోజు కొత్త రూల్స్ మాట్లాడితే ఎలాగ?! ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ అనేది బీజేపీ+టీడీపీల వాగ్దానం. వాగ్దాన భంగం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రతిపక్షాలని లెక్క పెట్టక్కర్లేదన్న ‘అహంకారం’ తలకెక్కినప్పు డు ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి... ‘మైండ్ సెట్’ అవుతుంది. ఎన్నో అటుపోట్లు, ఒడిదుడుకులూ ఎదుర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ‘ఓటు బ్యాంక్’ కలిగియున్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ‘చావు దెబ్బ’ తినేయటానికి కారణం ఏమిటో అన్ని పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వ్యాసకర్త: లోక్‌సభ మాజీ సభ్యులు, - ఉండవల్లి అరుణ్ కుమార్ మొబైల్: 9868180171 -
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..
హైదరాబాద్: గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనడానికి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లే నిదర్శనమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెనుకబాటుతనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోతే గుజరాత్‌లాంటి ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కనబడటం లేదని సీతారాం ఏచూరి మండిపట్టారు. తమ పార్టీ ఇప్పటికే వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు ప్రకటించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు తాము వ్యతిరేకమని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. -
‘మేక్ ఫర్ ఇండియా’ కావాలి
మోదీ సర్కారు విధానాలు ఫలించవు: సీతారాం ఏచూరి విదేశీ, కార్పొరేట్ పెట్టుబడులతో ఫలితం ఉండదు దేశంలో ఉత్పాదక సామర్థ్యాలు పెరిగితేనే ఉపయోగం పీటీఐ ఇంటర్వ్యూలో సీపీఎం ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీ: అధిక పెట్టుబడులతో అధిక ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్న మోదీ ప్రభుత్వం వాదన పనిచేయదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం కోసం, దేశీయ పెట్టుబడుల కోసం కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వటం వంటి మోదీ ప్రభుత్వ విధానాలు ఫలించబోవని.. కారణం భారీ పెట్టుబడులు దేశంలో ఉత్పాదక సామర్థ్యాన్ని సృష్టించబోవని, పైగా ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టటం ద్వారా ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలని.. తద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇటీవలే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి సోమవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని విమర్శించారు. ప్రభుత్వ నినాదం ‘మేక్ ఫర్ ఇండియా’గా.. అంటే ఇండియా కోసం, ఇండియా చేత తయారీగా ఉండాల్సిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రేకెత్తించిన ప్రజా ఆకాంక్షలను నెరవేర్చటంలో ఆ పార్టీ ప్రభుత్వం విఫలమైందని.. ఈ ప్రభుత్వ విధానాలు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావటానికి అవకాశం కల్పించాయన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఏచూరి మాటల్లోనే... ప్రభుత్వ పెట్టుబడులు కావాలి... ‘మోదీ విధానాలు పనిచేయవు. మరిన్ని విదేశీ పెట్టుబడుల కోసం రాయితీలు ఇస్తున్నారు. భారతీయ కార్పొరేట్ సంస్థలు మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు వారికీ రాయితీలు ఇస్తున్నారు. అధిక పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టి జరుగుతుందని, తద్వారా అధిక ఆర్థికాభివృద్ధి జరుగుతుందని మోదీ ప్రభుత్వం చెప్తోంది. పెట్టుబడులు ఉత్పాదక రంగంలోకి వచ్చినపుడే అర్థవంతంగా ఉంటుంది. వారు వస్తువులను ఉత్పత్తి చేస్తే అవి అమ్ముడుపోవాల్సి ఉంటుంది. కానీ వాటిని ఎక్కడ అమ్ముతారు? ఇప్పుడు ప్రపంచ మాంద్యం నెలకొని ఉంది. విదేశాల్లో అమ్మలేరు. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోంది. భారత్‌లోనూ అమ్మలేరు. మన సొంత ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయనిదే.. అధిక పెట్టుబడులు అధిక వృద్ధిని సృష్టించవు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయటమనేది.. ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టటం వల్ల మాత్రమే జరుగుతుంది. కానీ.. దీనిని సుదీర్ఘ కాలంగా ఆపివేశారు. కార్పొరేట్లకు పన్ను రాయితీలు వద్దు... విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ సంస్థలకు భారీ పన్ను రాయతీలు ఇవ్వటం సరికాదు. న్యాయమైన పన్నులు వసూలు చేయాలంటున్నాం. ఆర్థిక బిల్లులో నిర్ణయించిన మేరకే పన్నులు వసూలు చేయాలి. అవి రూ. 5 లక్షల కోట్లు ఉంటాయి. మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాలి. రైతులను ఆత్మహత్యల్లోకి నెట్టేస్తే ఎలా? దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రతి 36 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దూకుడుగా భూసేకరణ బిల్లును తెస్తున్నారు. మన ఆహార స్వీయ సమృద్ధి, ఆహార భద్రతలను ప్రమాదంలోకి నెడుతున్నారు. జాతీయ రహదారుల వెంట కిలోమీటరు మేర భూమిని పారిశ్రామిక కారిడార్ల కోసం తీసుకుంటారు. అంటే.. దేశంలోని మొత్తం సాగు భూమిలో 39.1 శాతం భూమిని తీసుకుంటారు. ఈ భూమిలో సాగును తీసివేస్తే.. మన ఆహార భద్రత ఏమవుతుంది? ‘అన్నదాత’ను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిల్లోకి నెట్టివేస్తే.. ఎటు పోతున్నట్లు?’ అని ఏచూరి ప్రశ్నించారు. మాది భవిష్యత్ పార్టీ... ‘ప్రపంచీకరణ యుగంలో వామపక్షాల అవసరం.. ప్రజా ప్రమేయంలో దాని శక్తి, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజా సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలోని అత్యంత యువక దేశాల్లో భారత్ ఒకటి. ఆ కోణంలో మాది భవిష్యత్ పార్టీ. సిలికాన్ వ్యాలీ, నాసా, ‘దైవ కణం’పై పరిశోధనలు జరుగుతున్న స్విట్జర్లాండ్‌లోని సబ్ లేబరేటరీలను చూడండి. అక్కడ భారతీయ శాస్త్రవేత్తలు, మన యువత ముందువరుసలో ఉన్నారు. 15 శాతం మంది యువత ఉన్నత విద్యలోకి వెళ్లటం వల్లే దీనిని సాధించిగలిగినపుడు.. దానిని 40 శాతానికి పెంచగలగితే.. ప్రపంచ విజ్ఞాన సమాజానికి భారత్ నాయకుడిగా మారటాన్ని ఎవరూ నిలువరించలేరు. దీనికేం కావాలి? యువతకు సరైన ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు. ఏ విధానాలు వారికి వీటిని ఇవ్వగలవు. ఇక్కడే మా అవసరం ఉంటుంది’ అని ఏచూరి అన్నారు.