'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు' | cpm leaders fire on tdp government | Sakshi
Sakshi News home page

'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు'

Published Sat, Sep 26 2015 4:26 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు' - Sakshi

'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు'

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిపింది. ఈ భేటీకి సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా హామీని విస్మరించాయని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని వారు మండిపడ్డారు.


అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేటాయింపులు ఇవ్వకుండా కేంద్రం భిక్షం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వేసే భిక్షం కోసమే సీఎం చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై స్పందించకపోవటం దారుణమని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement