ఏపీకి ప్రత్యేక హోదాకు సీపీఎం మద్దతు | cpm support to special status for ap, says raghavulu | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదాకు సీపీఎం మద్దతు

Published Sat, Jul 30 2016 3:49 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

cpm support to special status for ap, says raghavulu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. ఢిల్లీలో శనివారం సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్బ్యూరో సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించింది.  

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆందోళనను చూసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రాఘవులు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడానికి సీపీఎం మద్దతు ఇస్తుందని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు గురించి రాఘవులు మాట్లాడుతూ.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్పై ప్రత్యామ్నయాన్ని ఆలోచించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement