చర్చించుకుంటేనే పరిష్కారం
ఇద్దరు సీఎంలకు రాఘవులు సూచన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలను పక్కనపెట్టి పరస్పరం సహకరించుకుంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఢిల్లీలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వ అనుసరిస్తున్న విధానాలతోపాటు వచ్చే ఏడాది నిర్వహించనున్న సీపీఎం మహాసభల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మతకలహాలను సృష్టించి బీజేపీని బలోపేతం చేసుకోవాలని చూస్తే దేశం బలహీనపడుతుందని హెచ్చరిం చారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కి అప్పగించడంపై స్పంది స్తూ.. పదేళ్ల ఉమ్మడి రాజధానిపై ఇద్దరు సీఎంలు గవర్నర్‌తో సమన్వయంగా వ్యవహరించాలని సూ చించారు. తెలంగాణలో 19న నిర్వహించనున్న సర్వే వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్టు అనుమానాలు కల్గుతున్నాయన్నారు. ఏపీలో బాబు పాలన నిరాశ కలిగిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు.