సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం 25 వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగునున్న ఈ మహాసభలకు సీపీఎం జాతీయం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ , బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తోందన్నారు.
నోట్ల రద్దు తర్వాత చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయన్నారు. జీఎస్టీ విదేశీ కంపెనీలు బాగుపడటానికి ఉపయోగపడిందని విమర్శించారు. ప్రధాని స్లోగన్ జియో హింద్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వామపక్షాల పోరాటాలు తట్టుకోలేక బీజేపీ దాడులు చేస్తోందన్నారు.
సుప్రీంకోర్టు న్యాయ మూర్తులే బయటకు వస్తున్నారంటే దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం అవుతున్నారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్షాలను బలహీనపర్చకపోతే గెలవలేమనే ఆలోచనలోఎ బీజేపీ ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాగా, మహా సభలు నేపధ్యంలో అరుణ పతాకాలతో భీమవరం ఎరుపెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment